Team India Performance: ఇంగ్లీష్ గడ్డమీద జరుగుతున్న తొలి టెస్ట్ లో టీమిండియా అదరగొడుతోంది. ఈ కథనం రాసే సమయం వరకు 7 వికెట్ల నష్టానికి 454 పరుగులు చేసింది. సెంచరీ హీరోలు గిల్, పంత్ వేగంగా ఆడి అవుట్ అయ్యారు.
లీడ్స్ మైదానంలో భారత బ్యాటింగ్ పూర్తి విభిన్నంగా సాగింది. గిల్, జైస్వాల్, పంత్ శతకాలు బాదారు. జైస్వాల్, గిల్ తొలి రోజు సెంచరీలు చేశారు. పంత్ అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న సెంచరీ వైపు పయనం సాగించాడు. ఇక రెండవ రోజు పంత్ తన బ్యాటింగ్ స్టైల్ తో అదరగొట్టాడు. ముఖ్యంగా సిక్సర్ల వర్షం కురిపించి సత్తా చూపించాడు. తద్వారా సెంచరీ సాధించి టీమిండియా భారీ స్కోర్ కు బాటలు పరిచాడు. అయితే 500 పరుగుల దిశగా ప్రయాణ సాగిస్తున్న టీమిండియా ఒక్కసారిగా ఇబ్బంది పడింది.. స్వల్ప పరుగుల వ్యవధిలోనే గిల్, కరుణ్ నాయర్, పంత్, శార్దూల్ ఠాకూర్ వికెట్లను కోల్పోయింది. దీంతో ఒకానొక దశలో 430-4 నుంచి 454-7 కు పడిపోయింది..
ఎందుకిలా
ఐపీఎల్ లో అద్భుతమైన ప్రదర్శన చూపించిన నేపథ్యంలో సాయి సుదర్శన్, కరుణ్ నాయర్, శార్దూల్ ఠాకూర్ కు జట్టులో అవకాశాలు లభించింది. అయితే వీరి ముగ్గురిలో ఇద్దరు డకౌట్ కావడం, ఒకరు ఒక పరుగు మాత్రమే చేసి అవుట్ కావడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా శార్దూల్ ఠాకూర్ ఒక్క పరుగు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. నాయర్ సున్నా పరుగులకు అవుట్ అయ్యాడు. వీరు ముగ్గురు ఇటీవలి ఐపీఎల్లో అదర కొట్టారు. కానీ ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్ట్ లో మాత్రం దారుణంగా విఫలమయ్యారు. ఒకవేళ వీరు గనుక నిలబడి ఉంటే.. స్థిరంగా పరుగులు చేసి ఉంటే టీమిండియా భారీ స్కోర్ చేసి ఉండేది. కానీ అంచనాలు అందుకోవడంలో వీరు ముగ్గురు విఫలం కావడంతో ఆ ప్రభావం టీమిండియా స్కోర్ మీద పడింది.. ఇక ప్రస్తుతం ఏడు వికెట్ల కోల్పోయిన నేపథ్యంలో.. జట్టు ఆశలు మొత్తం జడేజా మీద నెలకొని ఉన్నాయి. జడేజా కనుక భారీగా పరుగులు చేస్తే టీమిండియా స్కోర్ మరింత పెరుగుతుంది. అయితే రెండవ రోజు ఇంగ్లాండ్ బౌలర్లు రెచ్చిపోయి బౌలింగ్ చేయడంతో టీమిండియా ఏకంగా నాలుగు వికెట్లు కోల్పోయింది..
ముగ్గురు శతకాలు చేసిన ఈ మైదానంపై.. ఇద్దరు టీమ్ ఇండియా బ్యాటర్లు 0 చుట్టడం.. ఒక బ్యాటర్ ఒక్క పరుగు మాత్రమే చేసి అవుట్ కావడాన్ని భారత అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.. గిల్, జైస్వాల్, పంత్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తే.. కరుణ్ నాయర్, సాయి సుదర్శన్ తేలిపోవడం, శార్దుల్ ఠాకూర్ ఒక పరుగు మాత్రమే చేసి అవుట్ కావడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తీవ్రమైన ఒత్తిడి, పిచ్ ను అర్థం చేసుకోవడంలో తడబడటం వల్లే ఇలా జరిగి ఉంటుందని వారు వ్యాఖ్యానిస్తున్నారు.