Puri Jagannadh New Movie: పూరి చేసింపోకిరి సినిమాతో మాస్ హీరోగా అవతరించిన మహేష్ బాబు అప్పటినుంచి ఇప్పటివరకు అన్ని రకాల సినిమాలను చేస్తూ తనకంటూ ఒక సపరేట్ క్రేజ్ ను కూడా సంపాదించుకున్నాడు… ఒకప్పుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తే హీరోలకు సపరేట్ ఇమేజ్ వస్తుందని, వాళ్ల డైలాగ్ డెలివరీ కూడా మారుతోంది అనే ధోరణిలో ప్రతి ఒక్కరూ ఆలోచించేవారు. కానీ గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఆయనకు బ్యాక్ టైం అయితే నడుస్తోంది. వరుసగా లైగర్ (Liger) , డబుల్ ఇస్మార్ట్ (Double Ismart) ఈ రెండు సినిమాలు డిజాస్టర్లు అవ్వడంతో ఆయనతో సినిమాలు చేయడానికి ఎవరు ఆసక్తి అయితే చూపించడం లేదు… ఇక తమిళ్ ఇండస్ట్రీలో నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకొని ఇతర భాషల్లో కూడా నటుడిగా రాణిస్తున్న విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ప్రస్తుతం పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకి బెగ్గర్ అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది.
Also Read: Puri Jagannadh : పూరి జగన్నాధ్ బెగ్గర్ మూవీలో ఆ స్టార్ హీరో కూడా నటిస్తున్నాడా..?
అయితే సినిమా యూనిట్ నుంచి టైటిల్ విషయంలో అఫిషియల్ అనౌన్స్ మెంట్ అయితే రాలేదు. ఇక ఈ సినిమాలో విజయ్ సేతుపతి బిచ్చగాడి క్యారెక్టర్ లో నటించబోతున్నాడు అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది. మరి ఈ సినిమా కోసం విజయ్ సేతుపతి పూరికి కొన్ని కండిషన్స్ అయితే పెట్టారట. అవేంటి అంటే షాట్ అయ్యేంతవరకు తీయమని షూట్ సమయం లో పర్ఫెక్షన్ కోసం ఎన్ని టేకులు అయినా పర్లేదు తను ఓపిగ్గా చేస్తానని చెప్పారట.
అలాగే సినిమాలో తన క్యారెక్టర్జేషన్ ఎలాగైతే చెప్పారో దాన్ని షూట్ చేయాలని తన పాత్ర ఏమాత్రం తగ్గించకూడదని చెప్పారట. మొత్తానికి అయితే విజయ్ సేతుపతి ఆ క్యారెక్టర్ లో బాగా లీనమైపోయినట్టుగా తెలుస్తోంది. అందుకోసమే ఈ సినిమా కోసం ఏది చేయడానికైనా తను సిద్ధంగా ఉన్నాడు.
కానీ రాసిన కథను పర్ఫెక్ట్ గా తెరకెక్కిస్తే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని తను పూర్తి కాన్ఫిడెంట్ తో ఉన్నట్టుగా తెలుస్తోంది… మరి ఈ సినిమాతో పూరి జగన్నాధ్ మరోసారి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఈ సినిమా అతనికి కెరియర్ ను డిసైడ్ చేసే సినిమా అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…