Pakistan vs Afghanistan Highlights: యూఏఈ వేదికగా జరుగుతున్న ట్రై సిరీస్లో పాకిస్థాన్ కథ తేలిపోయింది. ఇటీవల ఆఫ్గానిస్థాన్, యూఏఈ పై విజయం సాధించిన పాకిస్తాన్.. ఈ సిరీస్లో ఫేవరెట్ గా కనిపించింది. కానీ అదంతా పాలపొంగు అని తేలిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ దారుణంగా విఫలమైంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ ఐదు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. సెదికుల్లా అటల్ 64, ఇబ్రహీం జద్రాన్ 65 పరుగులు చేసి టాప్ స్కోరర్లు గా నిలిచారు. తొలి రెండు మ్యాచ్ లలో అదరగొట్టిన పాకిస్తాన్ బౌలర్లు.. ఆఫ్గనిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో తేలిపోయారు. ఈ అవకాశాన్ని ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లు ఉపయోగించుకున్నారు. తేలికగా పరుగులు చేస్తూ.. స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు.
170 పరుగుల విజయ లక్ష్యంతో రంగంలోకి దిగిన పాకిస్తాన్ ఏ దశలోనూ విజయం దిశగా అడుగులు వేసినట్టు కనిపించలేదు. 20 ఓవర్లు పూర్తిస్థాయిలో ఆడినప్పటికీ 9 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. తద్వారా 19 పరుగుల వ్యత్యాసంతో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓటమిపాలైంది. దీంతో సోషల్ మీడియాలో పాకిస్తాన్ జట్టు పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తొలి రెండు మ్యాచ్లలో గెలిచిన పాకిస్తాన్ జట్టు.. ఆ తర్వాత అదే ఊపును కొనసాగించడంలో విఫలమైందని విశ్లేషకులు విమర్శిస్తున్నారు.. పాకిస్తాన్ జట్టులో రౌఫ్ చేసిన 34 పరుగులు టాప్ స్కోర్ అంటే పాకిస్తాన్ బ్యాటింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆఫ్గనిస్తాన్ జట్టులో నూర్ అహ్మద్, నబి, రషీద్, ఫారుకి తలా రెండు వికెట్లు సాధించారు..
ఆసియా కప్ ముందు ఈ టోర్నీ జరుగుతూ ఉండడం..ఇదే వేదికగా ఆసియా కప్ నిర్వహిస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ సాధించిన వరుస విజయాలు చర్చకు దారితీసాయి. ఆసియా కప్ లో పాకిస్తాన్ జట్టు అదరగొడుతుందని అంచనాలు వెలవడ్డాయి. కానీ అదంతా పాలపొంగు అని నిరూపించడానికి ఎంతో సమయం పట్టలేదు. ఆఫ్ఘనిస్తాన్ జట్టు ముందు పాకిస్తాన్ ఏ భాగంలో కూడా గట్టిగా నిలబడలేకపోయింది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు విజయం సొంతం చేసుకుంది. పాకిస్తాన్ ఓటమి నేపథ్యంలో సోషల్ మీడియాలో విపరీతంగా విమర్శలు వస్తున్నాయి. ఇదే లయ సాగిస్తే ఆసియా కప్ లో గ్రూప్ దశ నుంచే ఇంటికి రావాల్సి ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.