Homeక్రీడలుక్రికెట్‌South Africa historic win 2025: బలమైన ఆస్ట్రేలియాను ఎలా ఓడించారు.. సౌత్ ఆఫ్రికన్ల...

South Africa historic win 2025: బలమైన ఆస్ట్రేలియాను ఎలా ఓడించారు.. సౌత్ ఆఫ్రికన్ల విజయానికి దోహదం చేసినవి ఇవే..

South Africa historic win 2025: లెజెండరీ ఆటగాళ్ళు ఉన్నారు. అంతకుమించి అనే సామర్థ్యాన్ని చూపించే సత్తా కలిగి ఉన్నారు. కానీ చివరి దశలో ఓడిపోవడం.. ట్రోఫీ అందుకొనే సందర్భంలో చేతులెత్తయడం వారికి పరిపాటి గా మారింది. దురదృష్టాన్ని జేబులో వేసుకొని తిరుగుతున్నారా.. అనే మాటలు పడాల్సి వచ్చింది. కొన్ని సందర్భాల్లో అత్యంత చిన్న జట్ల చేతిలో ఓడిపోవాల్సి వచ్చింది. ఇన్ని అవమానాలు.. ఇన్ని పరాభావాలు.. ఇన్ని పదిఘట్టనలు బహుశా క్రికెట్ చరిత్రలో ఏ జట్టు కూడా అనుభవించి ఉండదు. చవిచూసి ఉండదు. ఇన్ని ఓటముల తర్వాత.. ఎన్ని ఎదురు దెబ్బల తర్వాత ప్రొటీస్ జట్టు నిలబడింది. నిలదొక్కుకుంది. చిరస్థాయిగా నిలిచిపోయే ఫలితాన్ని అందుకుంది. ఈ ఫలితాన్ని అందుకునే క్రమంలో సఫారి జట్టు ప్లేయర్లు అనితర సాధ్యమైన ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించారు. ఏ దశలో కూడా ఓటమి అనే నిరాశ వాదాన్ని తమ దరికి రానివ్వలేదు. పైగా ప్లేయర్లు మైదానంలో సమష్టి తత్వాన్ని ప్రదర్శించారు. ముఖ్యంగా బౌలింగ్లో అదరగొట్టారు. బ్యాటింగ్లో తొలి ఇన్నింగ్స్ లో విఫలమైనప్పటికీ.. రెండవ ఇన్నింగ్స్ లో మాత్రం అద్భుతమైన ప్రదర్శన చేశారు.. అంచనాలకు మించి ఆట తీరుని కొనసాగించి.. సరికొత్త చరిత్ర సృష్టించారు.

బలమైన కంగారులను ఓడించాలంటే అంత సులభం కాదు. ఈ పనిని సఫారి జట్టు చేసి చూపించింది. ఇంగ్లీష్ గడ్డమీద టెస్ట్ గదను అందుకుంది.. 28 సంవత్సరాల సుదీర్ఘకలను నిజం చేసుకుంది.. ఇంతటి సుదీర్ఘ క్రతువులో సఫారీ జట్టు ఎంతో ఒత్తిడి ఎదుర్కొంది. ఎన్నో ఇబ్బందులను చవిచూసింది. సఫారి జట్టు మానసికంగా సంసిద్ధమై.. బంగారు జట్టును నేల నాకించింది. బౌలింగ్ లో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పింది. ముఖ్యంగా రబాడ, ఎన్గిడి, జాన్సన్ త్రయంతో కమిన్స్ జట్టుకు చుక్కలు చూపించింది. చరిత్రలో నిలిచిపోయే చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. తద్వారా డబ్ల్యూటీసీలో ఎలా గెలవాలో.. ఎలాంటి పద్ధతులు అవలంబిస్తే గెలుపు సాధ్యమవుతుందో సఫారీ జట్టు నిరూపించింది.


సఫారి జట్టు ఆటతీరుతో మిగతా టెస్ట్ దేశాలు చాలా పాఠాలు నేర్చుకోవాలి. ముఖ్యంగా భారత జట్టు సఫారీ జట్టును చూసి నేర్చుకోవాలి. ఒత్తిడిలో ఎలా ఆడాలి.. ప్రత్యర్థి జట్టు మానసికంగా పై చేయి సాధించకుండా ఎలా ఆడాలి.. అనే విషయాలలో చాలా నేర్చుకోవాలి. సఫారీ జట్టును చూసైనా సరే వచ్చే సీజన్లో గిల్ బృందం సుదీర్ఘ ఫార్మాట్లో తుది పోరులో విజయం సాధించి.. టెస్ట్ గదను దక్కించుకోవాలని ఆశిద్దాం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version