Shreevats Goswami: ఈ ఘటన తర్వాత దేశం మొత్తం నిరసన స్వరం వినిపిస్తోంది. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా మనమంతా ఐక్యంగా ఉండాలని భావన అందరిలోనూ కనిపిస్తోంది.. ఈ ఘటనకు పాల్పడిన వారు కచ్చితంగా మూల్యం చెల్లించుకోవాలని.. భారత్ సత్తా ఏమిటో తెలియజేయాలనే డిమాండ్ వినిపిస్తోంది.. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని.. భారతీయతను నిరూపించాలని సోషల్ మీడియాలో నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఇదే క్రమంలో టీమిండియా మాజీ ఆటగాడు శ్రీ వాస్తవ్ గోస్వామి ఒక్కసారిగా బరస్ట్ అయిపోయారు. పాకిస్తాన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇకపై పాకిస్తాన్ తో ఎప్పుడూ క్రికెట్ ఆడకూడదని.. అసలు ఆ దేశంతో ఎటువంటి వ్యవహారాలు నడపకూడదని స్పష్టం చేశారు. పనిలో పనిగా బిసిసిఐకి ఒక లేఖ కూడా రాశారు..
Also Read: మైదానంలోనే జహీర్ ఖాన్ పై విరుచుకుపడిన రిషబ్ పంత్.. వైరల్ వీడియో
క్రీడ అంటే వాళ్ళ దృష్టిలో చంపడమే
” నేను ఎప్పుడూ చెబుతుంటాను.. ఈ కారణంతోనే పాకిస్తాన్ జట్టుతో క్రికెట్ ఆడకూడదని. ఇప్పుడు మాత్రమే కాదు.. ఇప్పుడు కూడా భారత్ పాకిస్తాన్ చెట్టుతో క్రికెట్ ఆడకూడదు… పాకిస్థాన్లో ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ జరిగినప్పుడు.. అక్కడికి మన జట్టును పంపించకుండా ఉన్నప్పుడు చాలామంది ఇష్టానుసారంగా మాట్లాడారు. క్రీడలకు రాజకీయాలతో ముడి పెడతారా అంటూ ప్రశ్నించారు.. అసలు ఆ దేశానికి అమాయకమైన భారతీయులను చంపడమే ఒక క్రీడ.. అప్పుడు మనం కూడా వాళ్లకు అర్థమయ్యే భాషలోనే ఆడాలి. బ్యాట్, బంతులు పక్కన పెట్టాలి. సంకల్పాన్ని, గౌరవాన్ని, సహనాన్ని దూరం పెట్టాలి. రక్తం ఉడికిపోతుంది. ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత నా హృదయం ముక్కలైపోయింది. విపరీతమైన కోపం కలుగుతోంది. ఇటీవల కాశ్మీర్ లో జరిగిన లెజెండ్స్ క్రికెట్ లీగ్ కోసం అక్కడికి వెళ్లాను. పహల్గాం ప్రాంతంలో నడిచాను.. అక్కడి వాళ్లతో మాట్లాడాను. వారి మాటల్లో చిగురించిన ఆశ.. అనంతమైన ఆశావాహ దృక్పథాన్ని పరిశీలించాను. ఇన్నాళ్ల తర్వాత అక్కడికి శాంతి తిరిగి వచ్చిందని భావించాను. మళ్లీ ఈ రక్తపాతాన్ని చూస్తుంటే బాధ కలుగుతోంది. చనిపోయింది మనవాళ్లు కదా.. ఎటువంటి ద్రోహం చేయని అమాయకులు కదా.. వారికి ఉగ్రవాదులతో సంబంధం లేదు. దేశద్రోహంతో సంబంధం లేదు. కానీ అటువంటివారిని పొట్టన పెట్టుకున్నారు. ఇంత జరిగిన తర్వాత మౌనంగానే ఉండాలా? క్రీడా స్ఫూర్తిని కొనసాగించాలా? అలా జరగదు. ఇకపై జరగకూడదని” శ్రీ వాస్తవ్ ట్విట్టర్ లో పేర్కొన్నాడు. శ్రీ వాస్తవ్ గోస్వామి గతంలో బెంగళూరు జట్టుకు ఆడాడు. కాగా, పహల్గాం ప్రాంతం ఇండియన్ స్విట్జర్లాండ్ గా పేరుపొందింది. కాశ్మీర్ లోని ఈ ప్రాంతం ఏడాది పాటు చల్లగా ఉంటుంది. అందువల్లే ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి పర్యాటకులు భారీగా వెళుతుంటారు. ఇక ఇక్కడ మంగళవారం ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో కలకలం నెలకొంది. భారత భద్రతా దళాలు ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.
ENOUGH!!!! pic.twitter.com/1fF6XUhgng
— Shreevats goswami (@shreevats1) April 22, 2025