Tollywood: ఈమె స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో తన చెల్లెలు తనకు మేనేజర్ గా ఉండేది. కానీ తల్లి మరణించిన తర్వాత ఎంతో ప్రేమగా ఉండే ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు బద్ధ శత్రువులుగా మారారు. అయితే వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో ఎవరికి తెలియదు. ఒకప్పుడు ఈమె సౌత్ సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. మొదట్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా మా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. తెలుగు తో పాటు ఈమె తమిళ్, కన్నడ, మలయాళం లో కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే హిందీలో కూడా వరుసగా సినిమాలు చేసి సూపర్ హిట్స్ అందుకుంది. కానీ ఆమె తల్లి చనిపోయిన తర్వాత అక్కా చెల్లికి మధ్య దూరం బాగా పెరిగిపోయింది. ఆ తర్వాత ఇద్దరూ శత్రువులుగా మారిపోయారు. ఈమె మరెవరో కాదు దివంగత స్టార్ హీరోయిన్ శ్రీదేవి. శ్రీదేవి తన కెరీర్ లో 300 కి పైగా సినిమాలలో నటించి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. శ్రీదేవి చెల్లెలి పేరు శ్రీలత. ఒకానొక సమయంలో వీరిద్దరూ చాలా ప్రాణంగా ఉండేవారు. కానీ ఆ తర్వాత ఎందుకో తెలియదు గానీ ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం పూర్తిగా మానేశారు. 1970లో శ్రీదేవి నటన ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆమె చెల్లెలు శ్రీలత శ్రీదేవి పక్కనే నీడలా ఉండేది. ప్రతి సినిమా షూటింగుకు శ్రీదేవి అక్కతో కలిసి వచ్చేది. అప్పట్లో శ్రీలత కూడా నటి కావాలని ఎన్నో కలలు కనేది. కానీ అలా జరగలేదు. చివరికి శ్రీలత శ్రీదేవికి మేనేజర్ గా ఉండేది.
Also Read: ఒకప్పుడు మిస్ ఇండియా.. ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ ను ఏలేస్తున్న హీరోయిన్…
1996లో ఈ ఇద్దరు అక్కచెల్లెళ్ల జీవితంలో ఒక సంఘటన జరిగింది. ఆ సమయంలో అనారోగ్య సమస్యతో బాధపడుతున్న తన తల్లిని ఆసుపత్రిలో చేరిచారు. అప్పుడు తల్లికి జరిగిన ఆపరేషన్ తప్పు జరగడంతో ఆమె తల్లి ఆరోగ్యం బాగా క్షమించి గమనించడం జరిగింది. ఆ సమయంలో శ్రీదేవికి ఆసుపత్రి నుంచి రూ. 7.2 కోట్ల నష్టపరిహారం కూడా వచ్చింది. కానీ అప్పట్లో ఆ డబ్బు మొత్తం శ్రీదేవి దగ్గరే ఉండడంతో ఇద్దరు అక్కాచెల్లెళ్ల మధ్య విభేదాలు ఏర్పడ్డాయని వార్తలు వినిపించాయి. అలాగే శ్రీదేవి తల్లి ఆస్తిని తన పేరు మీద బదిలీ చేసుకోవడంతో తనకు తన చెల్లికి మధ్య గొడవలు ఏర్పడ్డాయని తెలుస్తుంది. ఆ సమయంలో శ్రీలత తన తల్లి ఆస్తి తనకు కూడా రావాలంటు కోర్టును ఆశ్రయించింది.

కానీ ఆ కేసును కోర్టు కొట్టి వేసింది. శ్రీలతకు ఈ కేసులో రు.2 కోట్లు వచ్చాయి. అప్పట్లో వీరిద్దరి మధ్య వచ్చిన గొడవను బోనికపూర్ కూడా రాజీ చేయడానికి చాలా ప్రయత్నించాడట. అయితే 2013లో శ్రీదేవి పద్మశ్రీ అవార్డు అందుకున్న తర్వాత శ్రీలత ఒక కుటుంబ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసిందని అప్పట్లో వార్తలు కూడా వినిపించాయి. అయినా కూడా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తగ్గలేదు. 2018లో స్టార్ నటి శ్రీదేవి దుబాయ్ లో హఠాత్తుగా మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. అయినా కూడా శ్రీదేవి చెల్లెలు శ్రీలత ఆమె అంత్యక్రియలకు కానీ చెన్నైలో జరిగిన ప్రార్థన సమావేశంలో కానీ పాల్గొనలేదు.