Shami Daughter Birthday: ఏ తండ్రికి ఇలాంటి కష్టం రావద్దు. ఏ తండ్రి కూడా కూతురు పుట్టిన రోజు ఇలా కన్నీరు పెట్టకూడదు. అదేం దురదృష్టమో గాని భారత క్రికెటర్ మహమ్మద్ షమీ నా కూతురు పుట్టిన రోజు కన్నీరు పెట్టుకున్నాడు. భావోద్వేగానికి గురయ్యాడు. గుండె పగిలినంత బాధను అనుభవించాడు.. ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. రాసిన ఒక్కో వాఖ్యం.. అతడి గుండె తడిని లేపుతున్నాయి. హృదయంలో నిండిన ఆర్ద్రతను వ్యక్తీకరిస్తున్నాయి.
షమీకి హసీన్ జహాన్ అనే యువతితో వివాహం జరిగింది. వీరికి ఐరా అనే కూతురు ఉంది. షమీ దంపతులు మొదట్లో బాగానే ఉండేవారు. కూతురు పుట్టేంతవరకు కూడా అన్యోన్యంగానే ఉండేవారు. కానీ ఆ తర్వాతే ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. జహన్ ఏకంగా షమీ పై పోలీస్ కేసు పెట్టింది. కొద్దిరోజుల పాటు అతడు క్రికెట్ కూడా ఆడలేదు. అంతర్జాతీయ టోర్నీలకు దూరమయ్యాడు. ఒకానొక దశలో అతని కెరియర్ ఫెడ్ అవుట్ అయిపోయింది. ఈ దశలో భారత క్రికెట్ నియంత్రణ మండలి ఉదారత చూపడంతో అతడు మళ్ళీ మైదానంలోకి అడుగు పెట్టాడు.. తన బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 2023లో స్వదేశంలో జరిగిన 50 ఓవర్ల వరల్డ్ కప్ లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు.. ఆ తర్వాత కాలికి నొప్పి కావడంతో లండన్ వెళ్లి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ఇక ఆ తర్వాత కొద్ది రోజులపాటు క్రికెట్ కు దూరమయ్యాడు. ఇటీవల ఐపీఎల్లో ఆడినప్పటికీ ఒకప్పట్లగా అతడు బౌలింగ్ చేయలేకపోయాడు.
Also Read: Simbu Virat Kohli Issue: స్టార్ హీరోని దారుణంగా అవమానించిన కోహ్లీ..ఇంత అన్యాయమా!
ఇక ఇటీవల అతని భార్య మళ్లీ కోర్టుకు వెళ్లడంతో.. కేసు విచారణకు వచ్చింది. షమీ, జహన్ కు విడాకులు మంజూరు చేసింది. ఈ క్రమంలో భరణంగా జహన్ కు ప్రతినెల మూడు లక్షలు ఇవ్వాలని ఆదేశించింది. విడాకులు మంజూరైన నాటి నుంచి షమీ నిర్వేదంలో కూరుకు పోయాడు. షమీ కూతురు ఐరా ఆమె తల్లి జహన్ వద్దే ఉంటున్నది. బుధవారం తన పుట్టినరోజు కావడంతో ఐరా తండ్రి షమీ వద్దకు వచ్చింది. ఈ క్రమంలో ఆమెను దగ్గరికి తీసుకొని షమీ భావోద్వేగానికి గురయ్యాడు.. ఆమె చిన్నప్పటి ఫోటోలను.. ఆమెతో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకున్నాడు.. దేవుడి దయ తన కూతురు మీద ఉండాలని కోరుకున్నాడు. ఆమెతో కేక్ కట్ చేయించి.. సంబరాలు జరిపాడు.. ఈ దృశ్యాలను షమీ తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా అతని అభిమానులు ఐరాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చాలామంది ఏ తండ్రి కూడా ఇటువంటి కష్టం రాకూడదని వ్యాఖ్యానిస్తున్నారు..” మీ కూతురు అదృష్టవంతురాలు. ఇంత గొప్ప తండ్రి ఆమెకు దొరికాడు. ఈ ప్రేమ కలకాలం ఆన మీద ఉండాలి. భగవంతుడు ఆమెను చల్లగా చూడాలని” నెటిజన్లు కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాలను వెల్లడించారు.