Simbu Virat Kohli Issue: అంతర్జాతీయ క్రీడాకారులకు ఒకప్పుడు మన సౌత్ ఇండియన్ స్టార్స్ పెద్దగా తెలిసి ఉండకపోయి ఉండొచ్చు. కానీ పాన్ ఇండియా లెవెల్ లో మన సౌత్ ఇండియన్ సినిమా, బాలీవుడ్ ని డామినేట్ చేస్తున్నప్పటి నుండి మన సౌత్ హీరోలు తెలియని వాళ్లంటూ ఎవ్వరూ లేరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మీడియం రేంజ్ హీరోల సంగతి కూడా వాళ్లకు తెలుస్తూ ఉంటాది. కానీ విరాట్ కోహ్లీ కి మాత్రం ఒక స్టార్ హీరో పేరు తెలీదట. నేరుగా అతను విరాట్ కోహ్లీ(Virat Kohli) వద్దకు వెళ్లి తనని తానూ పరిచయం చేసుకున్నా చివరికి అవమానమే మిగిలిందట. ఇంతకీ ఆ స్టార్ హీరో మరెవరో కాదు, శింబు(Silambarasan TR). తమిళనాడు లో యూత్ ఆడియన్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్న చేసుకున్న నటుడు ఈయన. హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఇతని సినిమాలకు భారీ ఓపెనింగ్ వసూళ్లు వస్తుంటాయి.
అయితే ఒకసారి తమిళనాడు లో చెన్నై సూపర్ కింగ్స్ తో ఆర్సీబీ టీం కి జరుగుతున్న మ్యాచ్ చూసేందుకు శింబు అక్కడికి వచ్చాడట. విరాట్ కోహ్లీ ని కలవడానికి వెళ్లి, తనని తానూ పరిచయం చేసుకోగా, మీరు ఎవరో నాకు తెలియదు అండీ, క్షమించండి అని చెప్పి వెళ్ళిపోయాడట. ఆ సమయం లో శింబు కాస్త నిరాశకు గురయ్యాడట. ఆ తర్వాత కొన్నాళ్ళకు తన ‘పాతు తల’ చిత్రం లోని ఒక పాటకు విరాట్ కోహ్లీ రీల్ చేశాడని, కానీ అందులో హీరో నేనే అనే విషయం అతనికి తెలిసి ఉండకపోయుండొచ్చు అంటూ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఈ సంఘటనల గురించి చెప్పుకొచ్చాడు శింబు. ఈ మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. విరాట్ కోహ్లీ అలా ముఖం మీద మీరెవరో నాకు తెలియదు అని చెప్పడం ఏమాత్రం బాలేదని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Anasuya viral pics: నైట్ పార్టీలో ఫుల్ గా ఎంజాయ్ చేసిన అనసూయ.. క్రేజీ పిక్స్ వైరల్
ఇక శింబు విషయానికి వస్తే ఒకానొక దశలో ఈయన మార్కెట్ పూర్తిగా నాశనం అయ్యింది. అలాంటి సమయం లో ఈయన ‘మానాడు’ అనే చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. అక్కడి నుండి సరికొత్తగా తన కెరీర్ ని మొదలు పెట్టిన శింబు కి వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ వరించాయి. కానీ రీసెంట్ గా ఆయన కమల్ హాసన్ తో కలిసి నటించిన ‘థగ్ లైఫ్’ అనే చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై కమర్షియల్ గా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. విడుదలకు ముందు అనేక వివాదాల్లో చిక్కుకున్న ఈ చిత్రం,విడుదల తర్వాత మొదటి ఆట నుండే అభిమానులను తీవ్రంగా నిరాశ పర్చింది. వరల్డ్ వైడ్ గా కనీసం వంద కోట్ల గ్రాస్ వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది ఈ చిత్రం.