Sai Sudharsan Test Match: ఇంగ్లీష్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత ఓపెనర్లు అదరగొట్టారు. కేఎల్ రాహుల్ 42 పరుగులు చేసి.. అనవసరమైన షాట్ కు ఆడేందుకు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. కార్సే బౌలింగ్లో రూట్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. వాస్తవానికి ఆ బంతిని ఆడకున్నా సరిపోయేది. సరిగ్గా హాఫ్ సెంచరీ చేస్తాడనుకుంటున్న సమయంలో రాహుల్ చెత్త బంతిని వెంటాడి అనవసరంగా వికెట్ సమర్పించుకున్నాడు. అవుట్ అయిన తర్వాత కేఎల్ రాహుల్ తనను తాను తిట్టుకుంటూ మైదానం నుంచి వెళ్లిపోయాడు. కేఎల్ రాహుల్ అవుట్ అయిన తర్వాత.. తన కెరియర్ లో తొలి టెస్ట్ ఆడుతున్న సాయి సుదర్శన్ వన్ డౌన్ ఆటగాడిగా మైదానంలోకి వచ్చాడు..
Also Read: IPL 2023 Young Cricketers: ఐపీఎల్ 2023లో దుమ్మురేపుతున్న యువ క్రికెటర్లు వీరే..!
తడబడుతూనే..
సాయి సుదర్శన్ మైదానంలోకి వచ్చిన దగ్గరనుంచి తడబడుతూనే బ్యాటింగ్ చేశాడు. అతడి వీక్ పాయింట్ కనిపెట్టిన ఇంగ్లాండ్ జట్టు సారధి స్టోక్స్ పదేపదే హాఫ్ సైడ్ బంతులు వేశాడు. దీంతో సాయి సుదర్శన్ వాటిని ఎదుర్కోలేక ఇబ్బంది పడ్డాడు. వాస్తవానికి సాయి సుదర్శన్ ఎదుర్కొన్న తొలి బంతినే ఎల్ బీ డబ్ల్యూ గా స్టోక్స్ ఫీల్డ్ అంపైర్ కు అప్పీల్ చేశాడు. అయితే అతడు నాట్ అవుట్ గా ప్రకటించాడు. ఆ తర్వాత రెండు బంతులు కూడా అదే విధంగా వేయడంతో సుదర్శన్ ఇబ్బంది పడ్డాడు. ఇక చివరిగా నాలుగో బంతిని అదే తీరుగా అందించడంతో తప్పుగా అంచనా వేసిన సుదర్శన్ లెగ్ సైడ్ దిశగా ఆడాడు. ఆ బంతి బ్యాట్ చివరి అంచును తగులుతూ కీపర్ స్మిత్ చేతిలో పడింది. దీంతో తొలి టెస్ట్ ఆడుతున్న సాయి సుదర్శన్ డక్ అవుట్ గా వెను తిరగాల్సి వచ్చింది. సాయి సుదర్శన్ ఇటీవలి ఐపిఎల్ లో అదిరిపే రేంజ్ లో బ్యాటింగ్ చేశాడు. టోర్నీలో హైయెస్ట్ రన్స్ చేసి.. నారింజరంగు టోపీని సాధించాడు.
Sai Sudarshan dismissed for a 4 ball duck in his debut Test match #INDvsENG pic.twitter.com/fRvUGAg5XV
— (@HereforVK18) June 20, 2025
వాస్తవానికి టీమిండియా ఓపెనర్లు రాహుల్, జైస్వాల్ తొలి వికెట్ కు ఏకంగా 91 పరుగులు జోడించారు. ఇంగ్లీష్ జట్టు బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు.. చెత్త బంతులను అస్సలు ముట్టుకోలేదు.. బౌండరీలు మాత్రం సులువుగా సాధించారు.. సింగిల్స్ తక్కువగా తీశారు. భారీ స్కోర్ దిశగా టీమిండియా ప్రయాణిస్తుండగా.. కేఎల్ రాహుల్ అవుట్ కావడంతో ఒక్కసారిగా కుదుపు ఏర్పడింది. ఆ తర్వాత సాయి సుదర్శన్ కూడా అవుట్ కావడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఈ లోగానే లంచ్ బ్రేక్ కావడంతో భారత్ రెండు వికెట్ నష్టానికి 92 పరుగులు చేసింది. క్రీజ్ లో జైస్వాల్ (42*), గిల్(0) ఉన్నారు.