Nagarjuna Kubera Controversy: నిన్నటి తరం హీరోలలో టాప్ 3 లిస్ట్ తీస్తే అందులో అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) పేరు కచ్చితంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన తీసిన కల్ట్ క్లాసిక్ సినిమాలను అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. ఒకానొక దశలో యూత్ ఆడియన్స్ లో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) తర్వాత అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ నాగార్జున కి వచ్చింది. ఆరు పదుల వయస్సు దాటినా ఇప్పటికీ కుర్రాడిలా కనిపిస్తూ ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. అలాంటి స్టార్ హీరోకు ఇప్పుడు మార్కెట్ లో అనుకున్నంత క్రేజ్ లేదు. వరుస ఫ్లాప్స్ కారణంగా కాస్త తగ్గింది. కానీ ఒక మంచి డైరెక్టర్ తో సినిమా తీసి మళ్ళీ భారీ కం బ్యాక్ ఇచ్చే సత్తా అక్కినేని నాగార్జున లో ఉంది. కానీ ఆయన ఆ వైపు ప్రయత్నం చేయడం లేదు అనేది అభిమానుల ఆవేదన.
Also Read: Kubera Movie : ‘కుబేర’ టీంతో నాగ చైతన్య స్పెషల్ ఇంటర్వ్యూ..తండ్రి పైనే పంచులు వేసిన నాగ చైతన్య!
ఇప్పుడు మెల్లగా ఆయన హీరో రోల్స్ కి దూరం గా జరుగుతూ క్యారక్టర్ రోల్స్ పై ద్రుష్టి పెట్టడం అభిమానులకు అసలు నచ్చడం లేదు. నేడు ఆయన కీలక పాత్ర పోషించిన ‘కుబేర'(Kuberaa Movie) చిత్రం విడుదలైంది. విడుదలకు ముందు వరకు కూడా ధనుష్ తో సమానంగా నాగార్జున కి కూడా మంచి క్యారక్టర్ ఇచ్చి ఉంటారని అనుకున్నారు. కానీ అది జరగలేదు, ప్రారంభం 15 నిమిషాలు ఆయన క్యారక్టర్ చాలా బాగా ఉన్నింది కానీ, ఆ తర్వాత మాత్రం ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది. అసలు నటనకు స్కోప్ ఆయనకు దక్కలేదు. కేవలం ఒక్క ప్రీ క్లైమాక్స్ లో మాత్రమే కాస్త స్కోప్ దొరికింది. ఈ చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరికి అనిపించేది ఒక్కటే, అసలు నాగార్జున ఇలాంటి క్యారక్టర్ ఎలా ఒప్పుకున్నాడు?, ఆయన అభిమానులు ఫీల్ అవుతారని ఇసుమంత కూడా ఆలోచించలేదా? అని అనుకుంటున్నారు విశ్లేషకులు.
Akkineni Fans in Space
A3 – #Dhanush ey kada bro kottindi…Take it easy…
A4 – కడుపు రగిలిపోతుంది అన్న కుక్కని కొట్టినట్లు కొట్టాడు #Nagarjuna #Kuberaa pic.twitter.com/ZhO1398akt
— Tyson Naidu (@VintageTfiFan) June 20, 2025
ఈ చిత్రం లో ఒక సన్నివేశం లో ధనుష్ వెనుక నుండి వచ్చి నాగార్జున ని కొడుతాడు. ఈ సన్నివేశం ఫ్యాన్స్ కి అసలు నచ్చలేదు. కరుడుగట్టిన నాగార్జున అభిమానులు సైతం ఇలాంటి పాత్ర ఎలా ఒప్పుకున్నావు, జగపతి బాబు లాంటోళ్ళు చెయ్యాల్సిన క్యారక్టర్ ని మా హీరో తో చెయ్యిస్తావా అంటూ అభిమానులు డైరెక్టర్ శేఖర్ కమ్ముల ని కూడా ట్యాగ్ చేసి తిడుతున్నారు. అక్కినేని ఫ్యాన్స్ దీనికే ఇలా అయిపోతే ఎలా?, ఆగష్టు 14 న విడుదల కాబోయే కూలీ చిత్రం లో నాగార్జున మెయిన్ విలన్ క్యారక్టర్ చేసాడు. విలన్ అంటే హీరో చేతిలో చావు దెబ్బలు తినాల్సిందే. నాగార్జున ని రజినీకాంత్ కొడుతుంటే ఎలా తట్టుకోగలరో అని కొంతమంది విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం ఏమిటంటే నాగార్జున కి కూలీ లో అద్భుతమైన క్యారక్టర్ దొరికింది, అక్కినేని ఫ్యాన్స్ దీనిని నాగార్జున రియల్ కం బ్యాక్ గా భావించవచ్చు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరగబోతుందో అనేది.