Ustaad Bhagat Singh Release Date: ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ లో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు ‘హరి హర వీరమల్లు’ చిత్రం తో ఘోరమైన అవమానం ఎదురుకుంటే, సెకండ్ హాఫ్ లో ‘ఓజీ'(They Call Him OG) చిత్రం తో భారీ హిట్ ని అందుకొని, ఇప్పటికీ ఆ మేనియా లో మునిగి తేలుతున్నారు. ఈ రేంజ్ లో అభిమానులు పవన్ కళ్యాణ్ సినిమాకు ఎంజాయ్ చేసి చాలా కాలమే అయ్యింది. రీసెంట్ గానే ఓటీటీ లో విడుదలైన ఈ చిత్రం, ఇప్పటికీ థియేటర్స్ లో రన్ అవ్వడం విశేషం అంటే, కొన్ని చోట్ల హౌస్ ఫుల్స్ ని కూడా సొంతం చేసుకోవడం మరో విశేషం. దీపావళి కి విడుదలైన కొన్ని కొత్త సినిమాలను కూడా నేడు విజయవాడ,వైజాగ్ వంటి ప్రాంతాల్లో డామినేట్ చేసింది ఈ చిత్రం. ఇది కాసేపు పక్కన పెడితే పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh) అనే సంగతి మన అందరికీ తెలిసిందే.
ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ భాగానికి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి అయ్యింది. ప్రస్తుతం డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. నవంబర్ నెలలో సినిమా షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఇక ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని మొదలు పెట్టి జనవరి మొదటి వారం లోపు మొదటి కాపీ ని సిద్ధం చేసే టార్గెట్ ని పెట్టుకున్నారట. కుదిరితే డిసెంబర్ చివరి వారం లో కూడా మొదటి కాపీ రెడీ అయిపోవచ్చు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియా లో చర్చనీయాంశంగా మారింది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14న లేదా మార్చి మొదటి వారం లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇండస్ట్రీ వర్గాల్లో ప్రభాస్ రాజా సాబ్ మూవీ వాయిదా పడింది అనే టాక్ గట్టిగ వినిపిస్తోంది.
జనవరి 9న విడుదల అవ్వాల్సిన ఈ సినిమా VFX వర్క్ ఆలస్యం అయ్యే అవకాశాలు ఉండడం తో వాయిదా పడే ఛాన్స్ ఉందని అంటున్నారు. అదే కనుక జరిగితే ఉస్తాద్ భగత్ సింగ్ ని సంక్రాంతికి దింపే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఈ మూడు నెలల్లో ఎదో ఒక తేదీన ఈ చిత్రం రావడం అయితే పక్కా అని తెలుస్తుంది. ఈ కాంబినేషన్ పై ప్రస్తుతం ‘ఓజీ’ రేంజ్ అంచనాలు అయితే లేవు. కానీ ఒక్కసారి సినిమా నుండి ప్రమోషనల్ కంటెంట్ రావడం మొదలు పెడితే, కచ్చితంగా ఇండస్ట్రీ ని షేక్ చేసే రేంజ్ హైప్ ని ఈ సినిమా సొంతం చేసుకుంటుందని అంటున్నారు. చూడాలి మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ చిత్రాన్ని ఏ లెవెల్ కి తీసుకెళ్తారు అనేది.