Rohit-Kohli emotional video: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఇందులో ఆడే ఆటగాళ్లు జెంటిల్మెన్ మాదిరిగానే ప్రవర్తించాలి.. కానీ దురదృష్టవశాత్తు ఆస్ట్రేలియా జట్టులో ఆటగాళ్ల నుంచి అలాంటి ప్రవర్తనను ఆశించలేం. ఎలాగైనా గెలవాలని ఆ జట్టు ఆటగాళ్లు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. రకరకాల గిమ్మిక్కులకు పాల్పడుతుంటారు. వ్యక్తిగత దూషణకు సైతం వెనుకాడరు. అందువల్లే ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియా ప్లేయర్లకు పెద్దగా అభిమాన గణం ఉండదు. అయితే టీమిండియా మాత్రం అలా కాదు. టీమిండియాలో ఎంతమంది ఆటగాళ్లు క్రికెట్ కు సరికొత్త వన్నె తీసుకొచ్చారు. అటువంటి వారిలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ముందు వరుసలో ఉంటారు.
విరాట్ కోహ్లీ, రోహిత్ ఇటీవల సిడ్నీ వన్డేలో అదరగొట్టారు. సెంచరీకి మించిన భాగస్వామ్యాన్ని నమోదు చేసి టీమ్ ఇండియాకు అద్భుతమైన విజయాన్ని అందించారు. వన్డే సిరీస్ కోల్పోయినప్పటికీ.. ఆ లోటును భర్తీ చేశారు. ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో టీమిండియా కు గ్రాండ్ విక్టరీని అందించారు. తద్వారా తాము ఎంతటి ప్రమాదకరమైన ఆటగాళ్లమో ప్రపంచానికి రుచి చూపించారు. ఆస్ట్రేలియా గడ్డమీద.. ఆస్ట్రేలియా బౌలర్లపై వీర ప్రతాపాన్ని చూపించారు. ఏ మాత్రం భయపడకుండా.. వెనకడుగు వేయకుండా దూకుడుగా ఆడారు. పరుగుల వరద పారిస్తూ చరిత్ర సృష్టించారు. తగ్గాల్సిన చోట తగ్గి.. నెగ్గాల్సిన చోట నెగ్గి అదరగొట్టారు. అందువల్లే విరాట్ కోహ్లీ, రోహిత్ ఆడిన ఆటకు ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ 2027 వరకు ఆడతారని తెలుస్తోంది. 2027లో వన్డే వరల్డ్ కప్ జరగనుంది. దక్షిణాఫ్రికా వేదికగా జరిగే ఈ మెగా టోర్నీలో ఆడతామని విరాట్, రోహిత్ సంకేతాలు ఇచ్చారు. ఈ ప్రకారం చూసుకుంటే టీమిండియాకు అది గుడ్ న్యూస్.. పైగా వారిద్దరూ అప్పటివరకు సూపర్ ఫాం కొనసాగిస్తే టీమిండియా కు తిరుగుండదు. పైగా విరాట్, రోహిత్ సిడ్నీ వన్డే ద్వారా టచ్ లోకి వచ్చారు. రోహిత్ కూడా బరువు పూర్తిగా తగ్గాడు. అభిషేక్ నాయర్ ఆధ్వర్యంలో ముంబైలో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు.
విరాట్, రోహిత్ సిడ్నీ వన్డేలో మెరుపులు మెరిపించిన నేపథ్యంలో అభిమానులు సందడి చేస్తున్నారు. ఇదే క్రమంలో సిడ్ని లో వ్యాఖ్యానం చేసిన ఓ క్రికెట్ వ్యాఖ్యాత భావోద్వేగానికి గురయ్యాడు. ఇకపై సిడ్నీ మైదానంలో విరాట్, రోహిత్ ఆటను చూడబోమంటూ కన్నీటి పర్యంతమయ్యాడు..”వాళ్ళిద్దరూ లెజెండ్రీ ఆటగాళ్లు. సూపర్ గా ఆడతారు. ఇప్పుడు కూడా సిడ్నీ మైదానాన్ని హోరెత్తించారు. అటువంటి ఆటగాళ్లు ఇకపై ఈ మైదానంలో ఆడరు. అది తలుచుకుంటేనే బాధగా ఉంది. గుండె బరువెక్కుతోందని” ఆ వ్యాఖ్యాత వాపోయాడు. ఊబికి వస్తున్న కన్నీటిని దిగ మింగుకుంటూ అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా గడ్డ మీద.. ఎంతోమంది ఆస్ట్రేలియా ఆటగాళ్లు అదరగొట్టారు. ఆ జట్టుకు అద్భుతమైన విజయాలు అందించారు. కానీ వారందరూ జెంటిల్మెన్ మాదిరిగా ఆడలేదు. కానీ విరాట్, రోహిత్ జెంటిల్మెన్ గేమ్ కు అందం తీసుకొచ్చారు. అందువల్లే ఆ వ్యాఖ్యాత గుండె పగిలే విధంగా ఏడ్చాడు.
An australian commentator was seen crying when Kohli and Rohit played their last game in Australia.
Cricket truly unites the people man pic.twitter.com/R71605Vh8A
— ` (@45Fan_Prathmesh) October 26, 2025