Shreyas Iyer : టీమిండియా వన్ డే ఫార్మాట్ వైస్ కెప్టెన్ గా ఇటీవల ప్రమోషన్ పొందాడు శ్రేయస్ అయ్యర్. చాలా రోజుల తర్వాత అతడు జట్టులోకి వచ్చాడు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ లో అతడు రెండు వన్డేలు ఆడాడు. తొలి వన్డేలో విఫలమైనప్పటికీ.. రెండవ వన్డేలో హాఫ్ సెంచరీ చేసి అదరగొట్టాడు. రోహిత్ శర్మతో కలిసి మూడో వికెట్ కు సెంచరీ భాగస్వామ్యం నమోదు చేసినప్పటికీ.. ఆ తదుపరి టీమిండియా వెంట వెంటనే వికెట్లు కోల్పోవడంతో భారీ స్కోర్ చేయలేకపోయింది.
టీమిండియా రెండో వన్డేలో ఓడిపోయిన తర్వాత.. మూడో వన్డేలో సత్తా చూపించింది. ఆస్ట్రేలియాలో ఫస్ట్ బ్యాటింగ్ చేయించి తక్కువ స్కోరుకు చేసేలా బౌలింగ్ వేసింది. ఆ తర్వాత ఆ స్కోర్ ను టీమిండియా ఒకే ఒక వికెట్ కోల్పోయి ఫినిష్ చేసింది. అయితే ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ తాగుతున్న సమయంలో అయర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఓ క్యాచ్ పట్టే సమయంలో అతడు కింద పడిపోయాడు. ఈ క్రమంలో అతడికి గాయాలైనట్టు తెలుస్తోంది. క్యాచ్ పట్టే క్రమంలో అతడు కిందపడ్డాడు. ఈ నేపథ్యంలోనే అతడి పక్కటెముకలకు గాయాలైనట్టు తెలుస్తోంది. రక్తస్రావం కూడా జరిగిందని తెలుస్తోంది. ప్రస్తుతం అతడు సిడ్నీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అత్యవసర వైద్యం కావడంతో అతడిని ఐసీయూలో ఉంచారు. వారం పాటు అతడు వైద్యుల పర్యవేక్షణలో ఉంటాడని తెలుస్తోంది.
ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత అయ్యర్ జట్టులోకి వచ్చాడు. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్. ఆసియా కప్ వంటి వాటికి అతడిని ఎంపిక చేయలేదు. చివరికి వెస్టిండీస్ సిరీస్ లో కూడా అతనికి అవకాశం లభించలేదు.. దీంతో మేనేజ్మెంట్పై అతని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో గౌతమ్ గంభీర్ కు వ్యతిరేకంగా ఉద్యమం నడిపించారు. దీంతో మేనేజ్మెంట్ వెనక్కి తగ్గక తప్పలేదు. పైగా అయ్యర్ కు ప్రమోషన్ కల్పించింది. వైస్ కెప్టెన్ ను చేసింది. ఫలితంగా అతడు ఆస్ట్రేలియా సిరీస్ లో ఉపసారధిగా వ్యవహరించాడు.
సారధి గిల్ మూడు మ్యాచ్లలో విఫలమైనప్పటికీ.. అయ్యర్ మాత్రం అదరగొట్టాడు. తొలి వన్డేలో అయ్యర్ విఫలమైనా.. రెండవ వన్డేలో మాత్రం హాఫ్ సెంచరీ చేశాడు. అత్యంత కఠినమైన పరిస్థితుల్లో బ్యాటింగ్ చేసి టీమ్ ఇండియా గౌరవాన్ని కాపాడాడు. అయ్యర్ హాఫ్ సెంచరీ చేయడంతో అభిమానులు గౌతమ్ గంభీర్ ను ఉద్దేశించి విమర్శలు చేశారు.. గిల్ కు కెప్టెన్సీ ఇస్తే.. అతడు విఫలమయ్యాడని.. అయ్యర్ కు అవకాశం కల్పిస్తే అతడు హాఫ్ సెంచరీ చేశాడని గుర్తు చేస్తున్నారు.. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో ఉండడంతో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతడు కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.