Homeక్రీడలుక్రికెట్‌RCB fan viral celebration: చెన్నై పై గెలిచిన తర్వాత.. RCB మహిళ అభిమాని రచ్చ...

RCB fan viral celebration: చెన్నై పై గెలిచిన తర్వాత.. RCB మహిళ అభిమాని రచ్చ మాములుగా లేదు..

RCB fan viral celebration: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో చెన్నై పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 250 పరుగులు చేసింది. ఆ తర్వాత చెన్నై 207 పరుగులకు ఆల్ అవుట్ అయింది.

ఈ సీజన్లో చెన్నై బెంగళూరుకు ఇది తొలి విజయం. గత సీజన్ లో కూడా చెన్నై జట్టుపై బెంగళూరు సంపూర్ణ ఆధిపత్యం కొనసాగించింది. ఐపీఎల్ లో చెన్నై జట్టుకు.. బెంగళూరు జట్టుకు ఆధిపత్య పోరు ఉంది. అనేక సందర్భాలలో చెన్నై జట్టు బెంగళూరు మీద విజయాలు సాధించింది. ముఖ్యంగా ధోని నాయకత్వంలో చెన్నై జట్టు వరుస విజయాలు సాధించి.. ఐదుసార్లు విజేతగా నిలిచింది.

అందువల్లే చెన్నై జట్టును సుదీర్ఘ ప్రత్యర్థి అని బెంగళూరు జట్టు భావిస్తూ ఉంటుంది. బెంగళూరు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అందువల్లే చెన్నై జట్టుతో మ్యాచ్ అంటే బెంగళూరు అభిమానులకు ఎక్కడా లేని ఉత్సాహం వస్తూ ఉంటుంది. చెన్నై జట్టుతో మ్యాచ్ జరుగుతుంటే చాలు మైదానానికి బెంగళూరు అభిమానులు పోటెత్తుతూ ఉంటారు.

చెన్నై, బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగితే ఆటగాళ్లలో విపరీతమైన పోటీ ఉంటుంది. నువ్వా నేనా అన్నట్టుగా ఆటగాళ్లు మైదానంలో ప్రదర్శన చేస్తూ ఉంటారు. అయితే ఆటగాళ్ల కంటే ఎక్కువ అభిమానులు తమ అభిమానాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఆదివారం చెన్నై, బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో కన్నడ మహిళా అభిమాని మైదానంలో రచ్చ సృష్టించింది. ఆర్సిబికి అనుకూలంగా నినాదాలు చేసి మైదానాన్ని హోరెత్తించింది. ఈ క్రమంలో ఆమె ఉత్సాహాన్ని చూసి చెన్నై అభిమానులు తలవంచుకున్నారు. వారిని చూసిన ఆ మహిళా అభిమాని మరింత రెచ్చిపోయింది. దగ్గరగా అరుస్తూ సెలబ్రేట్ చేసుకుంది. ఆమె చేస్తున్న ఓవరాక్షన్ భరించలేక ఓ చెన్నై అభిమాని ఆమెను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు మీ టైం వచ్చింది.. తర్వాత మాకు కూడా టైం వస్తుందని అతడు వ్యాఖ్యానించాడు.. చెన్నై జట్టు ఎక్కడ ఆడినా సరే మైదానం పసుపు వర్ణంలో కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈసారి బెంగళూరు అభిమానులు భారీగా రావడంతో ఎర్రటి సంద్రాన్ని తలపించింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular