Homeఎంటర్టైన్మెంట్Pradeep Ranganathan emotional comments: పరిస్థితి ఇంత దారుణంగా అవుతుందని అనుకోలేదంటూ హీరో ప్రదీప్ రంగనాథన్...

Pradeep Ranganathan emotional comments: పరిస్థితి ఇంత దారుణంగా అవుతుందని అనుకోలేదంటూ హీరో ప్రదీప్ రంగనాథన్ ఎమోషనల్ కామెంట్స్..

Pradeep Ranganathan emotional comments: యూత్ ఆడియన్స్ లో ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) , ‘డ్యూడ్’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ‘LIK : లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ'(LIK Movie) చిత్రం తో మన ముందుకు రాబోతున్నాడు. రీసెంట్ గానే విడుదల చేసిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అంతే కాకుండా పాటలు ఇప్పటికే పెద్ద చార్ట్ బస్టర్స్ […]

Pradeep Ranganathan emotional comments: యూత్ ఆడియన్స్ లో ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) , ‘డ్యూడ్’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ‘LIK : లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ'(LIK Movie) చిత్రం తో మన ముందుకు రాబోతున్నాడు. రీసెంట్ గానే విడుదల చేసిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అంతే కాకుండా పాటలు ఇప్పటికే పెద్ద చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. దాదాపుగా ఇప్పటి వరకు విడుదలైన ప్రతీ పాట కూడా సూపర్ హిట్ అయ్యింది. అనిరుద్ మరోసారి తన సత్తా చాటాడు. అయితే ఈ సినిమా ప్రొమోషన్స్ విషయం లో నిన్న మొన్నటి వరకు వెనుకపడి ఉండొచ్చు కానీ, నిన్నటి నుండి మాత్రం చాలా గ్రాండ్ గా మొదలుపెట్టారు. నిన్న హైదరాబాద్ లో ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు వెర్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.

ఈ ఈవెంట్ లో ప్రదీప్ రంగనాథన్ తన స్టైల్ లో మాట్లాడిన మాటలు కొన్ని ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ తెచ్చిన విప్లవాత్మక మార్పుల గురించి ప్రదీప్ చాలా ఆసక్తికరంగా మాట్లాడాడు. ఆయన మాట్లాడుతూ ‘ప్రస్తుతం మనం ఒక రోబోటిక్ జీవితాన్ని గడుపుతున్నాము. అదొక వింత ప్రపంచం. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ కారణంగా మనకి ఏది నిజం , ఏది అబద్ధం అనేది అర్థం కావడం లేదు. సోషల్ మీడియా లోకి వస్తే చాలు, ఎంతోమంది హీరోయిన్లకు సంబంధించిన మార్ఫింగ్ ఫోటోలను చూస్తుంటాం. అవి సహజత్వానికి చాలా దగ్గరగా ఉన్నాయి. ఇవి నిజమైన ఫొటోలేనా అని అనిపించే స్థాయిలో ఉన్నాయి. ఎన్నో సార్లు వాటిని చూసి మనమే షాక్ కి గురి అయ్యాం. AI తెచ్చిన అనర్దామైన మార్పులు ఇవి’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ప్రస్తుతం మనం టెక్నాలజీ కి బానిస అయ్యాం. ఎంతలా అంటే మనుషులతో మాట్లాడడం చిన్నగా తగ్గించేస్తున్నాం. చాట్ బాట్స్ తో మాట్లాడడమే ఎక్కువ అయిపోయింది. ఇంటర్నెట్ లో దొరికే సమాచారం మొత్తం పచ్చి నిజమనే భ్రమలో బ్రతుకుతున్నాం. 2026 కి పరిస్థితి ఇంత దారుణంగా ఉందంటే , 2040 లో ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. మనం ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనేది కూడా ఈ యంత్రాలే నిర్ణయించే స్థాయికి వచ్చేస్తుంది. అలాంటి పరిస్థితులను ఆధారంగా తీసుకొనే మా LIK చిత్రాన్ని రూపొందించాము. చాలా అద్భుతంగా వచ్చింది ఈ మూవీ , నా కెరీర్ లో మరో మైల్ స్టోన్ లాగా మిగిలిపోనుంది ఈ చిత్రం’ అంటూ చెప్పుకొచ్చాడు ప్రదీప్ రంగనాథన్. మరి ఆ రేంజ్ లో ఈ చిత్రం ఉంటుందా లేదా అనేది తెలియాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే. విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి, నయనతార హీరోయిన్ గా నటించింది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper