India England Test: టెస్ట్ క్రికెట్ లో బౌలర్లు పెద్దగా పరుగులు ఇవ్వరు. అరుదైన సందర్భంలో మాత్రమే బౌలర్లు ధారాళంగా పరుగులు ఇస్తుంటారు. అయితే ప్రస్తుతం ఇంగ్లీష్ జట్టుతో జరుగుతున్న రెండవ టెస్టులో టీమిండియా బౌలర్ ప్రసిద్ద్ కృష్ణ దారుణంగా పరుగులు ఇచ్చాడు. ఒక ఓవర్లో ఏకంగా 23 పరుగులు ఇచ్చి అత్యంత చెత్త రికార్డు తన పేరు మీద లిఖించుకున్నాడు. దొరికిందే అవకాశంగా ఇంగ్లాండ్ బ్యాటర్ స్మిత్ పండగ చేసుకున్నాడు.
Also Read: ఇంగ్లాండ్ దూకుడు.. ఒక్క ఓవర్లోనే 23 రన్స్
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ సమయంలో 32 ఓవర్ వేసిన ప్రసిద్ద్ కృష్ణ.. దారుణంగా పరుగులు సమర్పించుకున్నాడు. 32వ ఓవర్ వేసిన అతడు.. తొలి బంతిని డాట్ గా వేశాడు. ఆ తర్వాత మరుసటి బంతికి ఇంగ్లాండ్ ఆటగాడు స్మిత్ ఫోర్ కొట్టాడు. ఆ మరుసటి బంతిని ఫోర్ కొట్టాడు.. మరసటి బంతిని బౌన్సర్ గా వేయగా.. దానిని స్మిత్ సిక్సర్ గా మలిచాడు. ఆ తర్వాత మరుసటి బంతిని కూడా దూకుడుగా ఆడి ఫోర్ కొట్టాడు. ఇక ఆ తర్వాతి బంతిని వైడ్ వేశాడు. ఇక ఈ ఓవర్లో చివరి బంతిని స్మిత్ బౌండరీ తరలించాడు. ఈ ఓవర్లో 4, 6, 4, 4 వైడ్, 4 ఇలా మొత్తంగా 23 పరుగులను ప్రసిద్ద్ కృష్ణ సమర్పించుకున్నాడు.. దీంతో అప్పటిదాకా 137/5 వద్ద ఉన్న ఇంగ్లాండ్ ఒక్కసారిగా..160/5 వద్దకు చేరుకుంది.. స్మిత్ 49 పరుగులకు చేరుకున్నాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా బౌలింగ్లో సింగిల్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 43 బంతుల్లోనే స్మిత్ హాఫ్ సెంచరీ చేయడం విశేషం.
Prasidh Krishna – took 6 wickets in the space of 28 balls in Ranji Trophy.pic.twitter.com/6uSvPmBLeD
— Johns. (@CricCrazyJohns) February 25, 2022
ప్రసిద్ద్ కృష్ణ ఐపీఎల్ లో హైయెస్ట్ వికెట్ టేకర్ గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతడిని ఇంగ్లీష్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ లోకి తీసుకున్నారు. అయితే తొలి టెస్ట్ లో ఐదు వికెట్లు తీసినప్పటికీ ధారాళంగా పరుగులు ఇచ్చాడు.. ఇక రెండో టెస్టులో అతడికి అవకాశం లభించదని అందరూ అనుకున్నారు. కానీ గిల్ అండదండలు బలంగా ఉండడంతో అతడికి చోటు లభించింది. అయితే రెండవ టెస్టులో అతడు దారుణంగా విఫలమవుతున్నాడు. వచ్చిన అవకాశాలను వినియోగించుకోలేకపోతున్నాడు.. టి20 తరహాలో పరుగులు ఇస్తున్నాడు.. దీంతో ఇంగ్లాండ్ బ్యాటర్లు పండగ చేసుకుంటున్నారు. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్ వైఫల్యం వల్ల 84/5 వద్ద ఉన్న ఇంగ్లాండ్ ఈ కథనం రాసే సమయం వరకు 171/5 వద్దకు చేరుకుంది. క్రీజ్ లో స్మిత్ (58), బ్రూక్(58) ఉన్నారు. వీరిద్దరూ ఇప్పటివరకు ఆరో వికెట్ కు 87 పరుగులు జోడించారు. ఐదు వికెట్లు పడినప్పటికీ ఇంగ్లాండ్ బ్యాటర్లు జోరు చూపిస్తున్నారు. ఏ మాత్రం భయపడకుండా బ్యాటింగ్ చేస్తున్నారు. దీంతో భారత బౌలర్లు లయతప్పుతున్నారు. ఫలితంగా ఇంగ్లాండ్ స్కోర్ పరుగులు పెడుతోంది. అయితే ఈ సమయంలో ఒక వికెట్ కనుక తీయగలిగితే మ్యాచ్ మళ్లీ భారత్ చేతుల్లోకి పూర్తిగా వచ్చే అవకాశం ఉంది.
Akash Deep and Siraj to Prasidh Krishna pic.twitter.com/5o7mNGyZzI
— Binod (@wittybinod) July 4, 2025