Mohammed Siraj Latest News: దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఈ సామెతను ఈ కాలంలో క్రికెటర్లు నిజం చూపిస్తున్నారు. పేరు ఉన్నప్పుడే దానిని క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.. ఈ జాబితాలో ఇప్పుడు టీమిండియా ఆటగాడు మహమ్మద్ సిరాజ్ కూడా చేరిపోయాడు.
టీమిండియాలో క్రికెటర్లకు సొంత వ్యాపారాలు ఉన్నాయి. ఇందులో విరాట్ కోహ్లీకి రెస్టారెంట్లు ఉన్నాయి. ఇప్పటికే అతడు దేశవ్యాప్తంగా ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు. రోహిత్ శర్మ కూడా విదేశాలలో రెస్టారెంట్లు ఉన్నాయని తెలుస్తోంది. సురేష్ రైనా, హర్భజన్ సింగ్, ఇంకా కొంతమంది ప్లేయర్లకు కూడా రెస్టారెంట్ల వ్యాపారం ఉంది. అటు ఆటతోపాటు ఇటు ఫుడ్ బిజినెస్ తో కూడా ప్లేయర్లు సంపాదిస్తున్నారు. భారీగా వెనకేసుకుని ఆర్థిక స్థిరత్వాన్ని సంపాదిస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి హైదరాబాద్ పేస్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ కూడా చేరిపోయాడు. ప్రస్తుతం ఆంగ్ల జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడుతున్న అతడు తన సొంత గడ్డ హైదరాబాదులో హోటల్ ఏర్పాటు చేశాడు.
హైదరాబాదులో శ్రీమంతులు ఉండే బంజారాహిల్స్ ఏరియాలో రోడ్ నెంబర్ 3లో జొహార్ఫా పేరుతో ప్రీమియం రెస్టారెంట్ ఏర్పాటు చేశాడు సిరాజ్. తన రెస్టారెంట్లో మొగలాయి, అరేబియన్, పర్షియన్, చైనీస్ లాంటి వంటకాలను అందుబాటులో ఉంటాయని సిరాజు పేర్కొన్నాడు. ఇవన్నీ కూడా కస్టమర్ల కోరిక మేరకు ఏర్పాటు చేశామని వివరించాడు. ఈ మాత్రమే కాకుండా హైదరాబాద్ స్పెషల్ బిర్యాని, ఇక్కడి వంటకాలు కూడా అందుబాటులో ఉంటాయని సిరాజ్ పేర్కొన్నాడు. శాకాహార భోజన ప్రజలకు కూడా అద్భుతమైన వంటకాలు సిద్ధం చేశామని.. ఇందుకోసం వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకమైన చెఫ్ లను నియమించామని సిరాజ్ వెల్లడించాడు. అయితే మూడు అంతస్తులో ఈ హోటల్ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇందులో బార్ ఉందా? లేదా అనే విషయంపై సిరాజ్ క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు ఈ ప్రాంతంలో శ్రీమంతులు ఉండడంతో.. వారిని దృష్టిలో పెట్టుకొని ఈ హోటల్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇందులో సాంప్రదాయ వంటకాలతో పాటు పాశ్చాత్య దేశాలకు చెందిన వంటకాలకు కూడా ప్రాధాన్యం ఇచ్చినట్టు సమాచారం.. హైదరాబాద్ నగరం విశ్వవ్యాప్తం కావడంతో.. ఇక్కడికి వచ్చే టూరిస్టులకు కూడా మెరుగైన ఆహారం లభిస్తుందని సిరాజ్ సన్నిహితులు చెబుతున్నారు.
Also Read: Mohammed Siraj : RCB పై మహమ్మద్ సిరాజ్ దెబ్బ అదుర్స్ కదూ!
ఇక ప్రస్తుతం ఇంగ్లీష్ జట్టుతో జరిగే టెస్ట్ సిరీస్ కోసం భారత్ ఇటీవల ఆంగ్ల గడ్డమీద అడుగుపెట్టింది. రేపటి నుంచి ఇంగ్లీష్ జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఇందులో భాగంగానే ఇంగ్లీష్ గడ్డ మీద అడుగుపెట్టిన సిరాజ్ తీవ్రంగా సాధన చేస్తున్నాడు. బుమ్రా తో పాటు బంతిని పంచుకోబోతున్నాడు. బుమ్రా సామర్థ్యం పై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పేస్ భారాన్ని సిరాజ్ మోస్తాడని ప్రచారం జరుగుతోంది . సిరాజ్ తో పాటు ఇంకా కొంతమంది పేస్ బౌలర్లను మేనేజ్మెంట్ ఎంపిక చేసింది. వారు కూడా తొలి టెస్ట్ లో తుది జట్టులో చోటు సంపాదించుకునే అవకాశం కనిపిస్తోంది.