IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ బ్రాండ్ వేల్యూ ఇప్పటికే లక్ష కోట్లకు చేరుకున్న విషయం తెలిసిందే. సరిగ్గా 2009లో 17వేల కోట్లుగా నమోదైన బ్రాండ్ వేల్యూ.. కేవలం 16 సంవత్సరాలలోనే లక్ష కోట్లకు చేరుకుంది.. ఇప్పుడు ఐపీఎల్ చరిత్రలో మరో రికార్డు నమోదయింది. ప్రస్తుతం ఐపీఎల్ లో 10 జట్లు ఉన్నాయి.. ఈ పది జట్లను రకరకాల కంపెనీలు ప్రమోట్ చేస్తున్నాయి. ఆటగాళ్ల మీద వందల కోట్లు ఖర్చుపెడుతున్నాయి. మొత్తానికి క్రికెట్ కు కార్పొరేట్ హంగులు అద్దుతున్నాయి. అందువల్లే ఐపిఎల్ రిచ్ క్రికెట్ లీగ్ గా ఆవిర్భవించింది. కేవలం ఆట మాత్రమే కాకుండా వినోదానికి కూడా ఐపీఎల్ లో పెద్దపీట వేస్తున్నారు.
Also Read: చెన్నై ప్లేయర్లు అవుట్ అయితే తిట్టింది.. సీన్ కట్ చేస్తే సెలబ్రిటీ అయిపోయింది.. ఇక ఆఫర్లే ఆఫర్లు..
ఆత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పోటీలు నిర్వహిస్తున్నారు. ఏమాత్రం చిన్న పొరపాటుకు కూడా అవకాశం ఇవ్వకుండా మ్యాచ్ లు నిర్వహిస్తున్నారు. తద్వారా ఐపిఎల్ ను సరికొత్త క్రికెట్ పోటీలకు వేదికలాగా మారుతున్నారు. ప్రపంచంలో ఎన్నో దేశాలలో క్రికెట్ లీగ్ లు జరుగుతున్నప్పటికీ.. అవేవీ ఐపీఎల్ కు దరిదాపుల్లో కూడా లేకపోవడం విశేషం. డబ్బుకు డబ్బు పేరుకు పేరు వస్తున్న నేపథ్యంలో విదేశాలకు చెందిన ఆటగాళ్లు కూడా ఐపీఎల్ లో ఆడేందుకు వస్తున్నారు. భారీగా డబ్బులు సంపాదిస్తున్నారు. అంతే కాదు, తమ దేశాల జాతీయ జట్లకు కూడా ఆడటాన్ని కాస్త పక్కన పెడుతున్నారు. ఐపీఎల్ కోసం ఇండియాకు క్యూ కడుతున్నారు.
బిగ్గెస్ట్ రికార్డ్
ఐపీఎల్ మార్చిలో మొదలైంది. ఇప్పటివరకు విజయవంతంగా సాగుతోంది. ప్రస్తుతం 18వ ఎడిషన్ పోటీలు జరుగుతున్నాయి. పది జట్లు కూడా హోరాహోరీగా పోరాడుతున్నాయి. పోటీలు రసవత్తరంగా జరుగుతున్న నేపథ్యంలో చూసే ప్రేక్షకులకు అమితమైన ఆనందం లభిస్తుంది. ఇక మార్చిలో మొదలైన ఐపీఎల్ సరికొత్త రికార్డులు సృష్టించింది. ముఖ్యంగా ప్రారంభ మ్యాచ్ అనితర సాధ్యమైన రికార్డులను సొంతం చేసుకుంది. ఐపీఎల్ 18వ ఎడిషన్ లో ప్రారంభ పోటీలో కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ తలపడ్డాయి. భారీ అంచనాల మధ్య జరిగిన ప్రారంభ మ్యాచ్ వ్యూయర్ షిప్ లో సరికొత్త రికార్డు సృష్టించింది. ఏకంగా 1.4 బిలియన్ డిజిటల్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఇక టీవీలో అయితే 49.6 బిలియన్ మినిట్స్ వాచ్ టైం నమోదు చేసింది. ఈ విషయాన్ని పీటీఐ (PTI) నివేదికలో వెల్లడించింది.. ఐపీఎల్ చరిత్రలోనే బిగ్గెస్ట్ ఎవరు ఓపెనింగ్ వీకెండ్ అని పి టి ఐ పేర్కొంది.. ఐపీఎల్ మ్యాచ్లను స్టార్ స్పోర్ట్స్, నెట్వర్క్ 18 టెలికాస్ట్ చేస్తున్నాయి. ఇక డిజిటల్ ప్రీమియర్ లో జియో హాట్ స్టార్ స్ట్రీమింగ్ చేస్తోంది. డిజిటల్, శాటిలైట్ హక్కుల ద్వారా ఐపీఎల్ నిర్వాహక కమిటీకి వేలకోట్ల ఆదాయం వస్తోంది.
Also Read: ESA day వచ్చింది.. ముంబై ఆటగాళ్ల కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించింది..