IPL 2025 Captaincy: ఐపీఎల్ అనేది కాసుల క్రీడ.. ప్రతి జట్టులో ఆటగాళ్లు ప్రతి సీజన్లో మారిపోతూనే ఉంటారు. కొంతమంది మాత్రమే జట్లను అంటిపెట్టుకొని ఉంటారు. అయితే అందరి ఆటగాళ్లకు ఇలా సాధ్యం కాదు. ఐపీఎల్ లో ఆటగాళ్లు జట్లను మారిపోవడం సాధారణమైన విషయమే అయినప్పటికీ.. ఒక ఆటగాడు జట్టు మారే విషయంలో ప్రస్తుతం విపరీతమైన చర్చ జరుగుతోంది. ఇంతకీ ఆ ఆటగాడు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? ఆటగాడు జట్టులో ఉండకపోవడం వెనక ఏం జరిగింది? ఇప్పుడు ఇవే హాట్ హాట్ చర్చకు కారణం అవుతున్నాయి.
Also Read: బుమ్రా ఆడతాడా? లేదా? రెండో టెస్టుకు ఎటూ తేల్చుకోలేక టీమ్ ఇండియా మేనేజ్మెంట్ సతమతం!
ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ ఒకసారి విజేతగా నిలిచింది. 2024 సీజన్లో ప్లే ఆఫ్ దాకా వెళ్ళింది. అంతకుముందు కూడా పర్వాలేదనే స్థాయిలో ఆట తీరును ప్రదర్శించింది. ఈ సీజన్లో అంతగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ.. కొంతమంది ప్లేయర్లు మాత్రం అదరగొట్టారు. ఇక ఆ జట్టుకు కొన్ని మ్యాచ్ లలో సంజు నాయకత్వం వహించాడు. గాయం వల్ల కొన్ని మ్యాచ్లకు దూరమయ్యాడు. అయితే సంజు గడచిన సీజన్లో ఆశించినంత ఆట తీరును ప్రదర్శించలేదనే చెప్పాలి. టీమిండియా టి20 ఫార్మాట్లో గత ఏడాది సంజు మెరుపులు మెరిపించాడు. ఈ ఏడాది కూడా అదరగొట్టాడు. అయితే జాతీయ జట్టులో చూపించినంత ప్రతిభ ఐపీఎల్ లో ప్రదర్శించలేకపోయాడు. అంతేకాదు అభిమానులు పెట్టుకున్న అంచనాలను నెరవేర్చలేకపోయాడు.
జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం సంజు వచ్చే సీజన్లో రాజస్థాన్ జట్టులో కొనసాగకపోవచ్చు అని తెలుస్తోంది. వచ్చే సీజన్లో అతడు అందుబాటులో ఉండడని ఇప్పటికే రాజస్థాన్ మేనేజ్మెంట్ పరీక్షంగా చెప్పేసింది.. మరోవైపు సంజును జట్టులోకి తీసుకోవడానికి చెన్నై మేనేజ్మెంట్ ఆసక్తిగా ఉంది.” సంజు ప్రతిభావంతమైన ఆటగాడు. అతడు అందుబాటులో ఉంటే కచ్చితంగా వచ్చే సీజన్లో జట్టులోకి తీసుకుంటాం. అతడు కీపర్ మాత్రమే కాదు, అత్యంత విలువైన బ్యాటర్ కూడా. చూస్తుండగానే విధ్వంసాన్ని సృష్టించి వెళ్లిపోతాడు. ఏ మాత్రం భయపడకుండా పరుగులు తీస్తాడు. అతడి ఆట చాలామందిని ఆకట్టుకుంటుంది. అందువల్లే అతడు గనుక అందుబాటులో ఉంటే కచ్చితంగా జట్టులోకి తీసుకుంటాం. అతడికి సముచిత ప్రాధాన్యం ఇస్తామని” చెన్నై మేనేజ్మెంట్ వెల్లడించినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
Also Read: నాలుగు క్యాచ్ లు మిస్.. యశస్వి జైస్వాల్ విషయంలో మేనేజ్మెంట్ కీలక నిర్ణయం..
సంజు ఇటీవల సీజన్లో అంతగా ఆకట్టుకోలేకపోయిన విషయం. పైగా జట్టు లో కొందరి ఆటగాళ్ల తీరు నచ్చకపోవడం వల్లే అతడు గాయం పేరుతో విశ్రాంతి తీసుకున్నాడని తెలుస్తోంది. తనకు నచ్చని ఆటగాళ్లకు మేనేజ్మెంట్ అందలం ఎక్కించడంతో అతడు దూరం జరిగాడని.. వచ్చే సీజన్లో జట్టు నుంచి బయటికి వచ్చే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. అయితే బయట ఇన్ని రకాలుగా ప్రచారాలు జరుగుతున్నప్పటికీ సంజు ఇంతవరకు నోరు మెదపలేదు. అటు రాజస్థాన్ మేనేజ్మెంట్ కూడా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. చూడబోతే సంజు జట్టు నుంచి బయటికి వచ్చే అవకాశం ఉందని స్పోర్ట్స్ వర్గాలు అంతర్గత సంభాషణలలో చెబుతున్నాయి.