Indian women cricket team rankings: వన్డే వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు అంతర్జాతీయ క్రికెట్ మండలి భారత మహిళల క్రికెట్ జట్టుకు శుభవార్త అందించింది. మహిళల వన్డే ర్యాంకింగ్స్ వెల్లడించింది. ఇందులో టీమిండియా ఉపసారథి స్మృతి మందాన అగ్రస్థానాన్ని ఆక్రమించింది.. జూన్ 17 అంటే మంగళవారం నాడు అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రకటించిన ర్యాంకింగ్స్ లో స్మృతి 727 రేటింగ్ పాయింట్లు సాధించి అగ్రస్థానానికి చేరుకుంది. దక్షిణాఫ్రికా క్రికెటర్ లారా ను పక్కకు నెట్టి స్మృతి మొదటి స్థానానికి చేరుకుంది. ఆరు సంవత్సరాల అనంతరం 50 ఓవర్ల ఫార్మాట్లో స్మృతి మొదటి స్థానానికి చేరుకోవడం విశేషం. 2019లో చివరిసారిగా స్మృతి వన్డే విభాగంలో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. సౌత్ ఆఫ్రికా సారథిగా ఉన్న లారా దాదాపు 8 పాయింట్లు కోల్పోయింది. దీంతో స్మృతి మొదటి స్థానాన్ని ఆక్రమించింది. లారా (719), ఇంగ్లాండ్ సారధి నటాలి (719) సంయుక్తంగా రెండవ స్థానంలో కొనసాగుతున్నారు.. ఇక వోల్వార్డ్ మూడో స్థానానికి పరిమితమైంది. ఇంగ్లాండ్ క్రికెట్ కీపర్ జోన్స్, కంగారు జట్టు ఆల్రౌండర్ అమీ వరుసగా నాలుగు ఐదు స్థానాలలో కొనసాగుతున్నారు. అయితే టాప్ 10 లో మాత్రం నలుగురు కంగారు ప్లేయర్లు ఉండడం గమనార్హం.
Also Read: Indian Women Cricket Team: టీమిండియా : అమ్మాయిలు అదరగొడుతున్నారు.. అబ్బాయిలు తేలిపోతున్నారు..
అదరగొట్టింది
ఇటీవల ముక్కోణపు వన్డే సిరీస్ లో స్మృతి అదరగొట్టింది. 52.8 0 సరాసరితో ఐదు మ్యాచ్లలో 264 రన్స్ చేసింది.. శృతి స్ట్రైక్ రేట్ 90.41 గా ఉండడం విశేషం. ఇటీవల వెస్టిండీస్ జట్టుతో ముగిసిన సిరీస్ లో వోల్వార్డ్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. సఫారీ సారథి వోల్వార్డ్ రెండు మ్యాచ్లలో వరుసగా 27, 28 పరుగులు మాత్రమే చేసింది.. ఇక మన దేశానికి సంబంధించిన ఇతర బ్యాటర్లలో జెమీమా, హర్మన్ వరుసగా 14, 15 స్థానంలో కొనసాగుతున్నారు. ఇక బోధర్ల విభాగంలో ఆంగ్ల జట్టుకు చెందిన సోఫి 747 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. భారత బౌలర్లలో దీప్తి శర్మ నాలుగవ స్థానాన్ని ఆక్రమించింది. ఇక ఇటీవల భారత జట్టు మెరుగైన విజయాలు సాధిస్తోంది. ముఖ్యంగా స్మృతి తిరుగులేని ఫామ్ లో ఉంది. అద్భుతమైన బ్యాటింగ్ తో ఆకట్టుకుంటున్నది. అందువల్లే ఆమె మొదటి స్థానాన్ని ఆక్రమించింది. మరి కొద్ది రోజుల్లో మన దేశం వేదికగా వన్డే విశ్వ సమరం మొదలవుతున్న నేపథ్యంలో స్మృతి నెంబర్ వన్ స్థానంలోకి రావడం ఒకరకంగా మన జట్టుకు శుభవార్త లాంటిది. ఎందుకంటే స్మృతి ఇప్పుడున్న ఫామ్ కనుక కొనసాగిస్తే.. భారత్ భారీగా పరుగులు చేసే అవకాశం ఉంది. అందులోనూ సొంతమైదానం కావడంతో అడ్వాంటేజ్ కూడా ఉంటుంది.. మన దేశానికి ఆస్ట్రేలియా మినహా మిగతా వాటితో పెద్దగా ఇబ్బంది లేదు. ఇక ఇటీవల కాలంలో భారత్ అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది. ముఖ్యంగా వన్డే, టి20 ఫార్మాట్ లో అదరగొడుతోంది.భారత జట్టు సాధించిన ఈ విజయాలలో స్మృతిది ముఖ్యపాత్ర. ఎందుకంటే ఓపెనర్ గా బ్యాటింగ్ చేసే స్మృతి.. ఒకటి రెండు మినహా మిగతా అన్ని మ్యాచ్లలో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. అందువల్లే భారత జట్టు ఈ స్థాయిలో విజయాలు సాధించింది. ఇప్పుడిక నెంబర్ వన్ స్థానం సాధించడంతో తన బాధ్యత మరింత పెరిగిందని స్మృతి చెబుతోంది. త్వరలో ప్రారంభమయ్యే వన్డే విశ్వ సమరంలో తన సత్తా చూపిస్తానని స్మృతి చెబుతున్నది.