India vs England Test 2025 : డకెట్ హాఫ్ సెంచరీ చేసి అవుట్ అయ్యాడు. రూట్ అంచనాలు అందుకోవడంలో విఫలమయ్యాడు. అయితే వీరు ముగ్గురు బుమ్రా చేతిలో అవుట్ కావడం విశేషం. వాస్తవానికి ఈ మైదానంలో బౌలర్లకు సామర్ధ్యాన్ని నిరూపించుకునే స్థాయిలో అవకాశం లేకపోయినప్పటికీ.. బుమ్రా అద్భుతమైన బంతులు వేశాడు. ఫలితంగా క్రాలే, డకెట్, రూట్ వికెట్లను పడగొట్టాడు.
Also Read:
అయితే మిగతా బౌలర్ల నుంచి బుమ్రా కు అంతగా సహకారం లభించడం లేదు. ముఖ్యంగా సిరాజ్, ప్రసిద్ కృష్ణ, శార్దూల్ ఠాగూర్, రవీంద్ర జడేజా అంతగా ఆకట్టుకోలేకపోతున్నారు. పైగా వీరు పరుగులు ఇవ్వడం ఇండియా కు ఇబ్బందికరంగా మారింది. ప్రసిద్ కృష్ణ ఐపీఎల్లో అదరగొట్టాడు. కానీ టెస్ట్ సిరీస్ విషయానికి వచ్చేసరికి పూర్తిగా తడబడుతున్నాడు. ఏకంగా 10 ఓవర్లలో 56 పరుగులు ఇచ్చి.. తనపై పెంచుకున్న ఆశలను మొత్తం వమ్ము చేశాడు. మూడో రోజు కూడా భారత బౌలర్లు ఇలానే ప్రదర్శన చేస్తే మాత్రం ఫలితం ఇండియాకు ప్రతికూలంగా వచ్చే అవకాశం కనిపిస్తోంది..
ఇప్పటికే ఇంగ్లీష్ జట్టు డబుల్ సెంచరీ చేసేసింది. పోప్ సెంచరీ తో దూకుడు మీద ఉన్నాడు. బ్రూక్ ఇంకా ఖాతాను ప్రారంభించలేదు. రెండవ రోజు ఆట ముగిసిన తర్వాత ఇంగ్లీష్ జట్టు మూడు వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది.. భారత్ సాధించిన పరుగులకు ఇంకా 262 రన్స్ వెనుకబడి ఉంది. మూడోరోజు ఇంగ్లాండ్ బ్యాటర్లు జోరు కొనసాగిస్తే మాత్రం భారత జట్టుకు ఇబ్బంది తప్పదు. పిచ్ నుంచి సహకారం లభించకపోయినప్పటికీ బుమ్రా అద్భుతంగా బంతులు వేశాడు. అయితే భారత ఫీల్డర్లు ఏకంగా రెండు క్యాచ్లను నేలపాలు చేయడంతో ఇంగ్లాండు బ్యాటర్లు పోప్, డకెట్ జీవదానాలు పొందారు. ఫలితంగా ఆ జట్టు భారత్ కు దీటుగా బదులిస్తోంది.
Also Read:
మూడో రోజు భారత బౌలర్లు తమ లయను అందుకొని ఇంగ్లీష్ జట్టును అదుపు చేయాల్సి ఉంది. అప్పుడే విజయం సాధించడానికి భారత జట్టుకు అవకాశాలుంటాయి. వాస్తవానికి రెండవ రోజు భారత బ్యాటర్లలో లోయర్ ఆర్డర్ దారుణంగా విఫలమైంది. వారు కనుక కాస్త నిలబడి ఉండి బ్యాటింగ్ చేస్తే భారత్ మరింత భారీ స్కోర్ చేసి ఉండేది. వచ్చిన ఆటగాళ్లు వచ్చినట్టే వెళ్లిపోవడంతో ఇంగ్లాండ్ బౌలర్లు రెండవ రోజు పై చేయి సాధించారు. దీంతో భారత్ 500 స్కోర్ చేయలేకపోయింది. ఇక ఇంగ్లాండ్ బ్యాటర్లు పోప్, డకెట్ సెంచరీ భాగస్వామ్యంతో జట్టును పటిష్ట స్థితిలోకి తీసుకెళ్లారు. దీంతో ఇంగ్లాండ్ జట్టు డబుల్ సెంచరీ సాధించింది. మూడో రోజు భారత బౌలర్లు సామర్థ్యాన్ని నిరూపించుకున్న దానినిబట్టే ఫలితం ఆధారపడి ఉంటుంది.