India vs Australia 1st ODI: భారత్, ఆస్ట్రేలియా మధ్య 3 వన్డేల మ్యాచ్ సిరీస్ రేపటి నుంచి మొదలు కాబోతోంది. పెర్త్ వేదికగా తొలి వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. ఇప్పటికే రెండు జట్లు తొలి వన్డేలో సత్తా చాటేందుకు ఆసక్తిగా ఉన్నాయి. ఆటగాళ్లు మైదానంలో తీవ్రంగా సాధన చేస్తున్నారు. చెమటలు చిందిస్తూ ప్రాక్టీస్ చేస్తున్నారు. టీమిండియాలో విరాట్, రోహిత్ అయితే అలుపన్నదే లేకుండా సాధన చేస్తున్నారు.
రెండు జట్లలో యువ ప్లేయర్లు అధికంగా ఉండడంతో మ్యాచ్ నువ్వా నేనా అన్నట్టుగా సాగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. విరాట్, రోహిత్ సుదీర్ఘ విరామం తర్వాత మైదానం లోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో అభిమానుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. వీరిద్దరూ అదరగొడతారని.. దుమ్ము రేపే రేంజ్ లో బ్యాటింగ్ చేస్తారని అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్నారు.. మరోవైపు ఈ మ్యాచ్ చూసేందుకు అభిమానులు పోటీపడుతున్నారు. రెండు జట్లు సమఉజ్జీలు కావడంతో.. పోటీ తీవ్రంగా ఉంటుందని స్పోర్ట్స్ చానల్స్ లో కథనాలు వస్తున్నాయి. దీనికి తోడు రెండు జట్ల ఆట తీరు చూసేందుకు ప్రేక్షకులు భారీగా వస్తున్న నేపథ్యంలో టికెట్లు మొత్తం అమ్ముడుపోయాయని నిర్వాహకులు చెబుతున్నారు.. పెద్ద స్టేడియం మొత్తం దాదాపు నిండిపోయే అవకాశం ఉందని ఆస్ట్రేలియా మీడియా చెబుతోంది.
హోరా హోరీ గా మ్యాచ్ సాగుతుందనే అంచనాలు వినిపిస్తున్న నేపథ్యంలో అభిమానులకు ఒక చేదు వార్త తెలిసింది. అది వారిని తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. ఎందుకంటే తొలి వన్డే మ్యాచ్ జరిగే పెర్త్ వేదికలో వర్షం కురిసే అవకాశం ఉందట. ఆక్యు వెదర్ రిపోర్ట్ ప్రకారం ఈ మ్యాచ్ నిర్వహణకు వర్షం పలుమార్లు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. అంతేకాదు వర్షం వల్ల టాస్ ప్రక్రియ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. మ్యాచ్ జరుగుతున్నంత సేపు సేపు వర్షం ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని ఆక్యు వెదర్ చెబుతోంది.
ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఆకాశం మేఘాలు ఆవరించి ఉన్నాయి. చల్లని గాలులు వీస్తున్నాయి.. తుంపర్ల మాదిరిగా వర్షం కురుస్తోంది. సిడ్నీ మైదానం ప్రారంభంలో పేస్ బౌలర్లకు… మధ్యలో స్పిన్ బౌలర్లకు అనుకూలించే అవకాశం ఉంది. ఒకవేళ వర్షం కురిస్తే మైదానంపై ఉన్న తేమ స్పిన్ బౌలర్లకు సహకరించే అవకాశం ఉంది. అందువల్ల టీమిండియా కులదీప్ యాదవ్, అక్షర్ పటేల్ కు అవకాశం కల్పించింది. వాషింగ్టన్ సుందర్ ను ఒకవేళ తుది జట్టులోకి తీసుకుంటే.. అతడితో కూడా బౌలింగ్ వేయించే అవకాశం ఉంది.