IND vs ENG 2025 Updates: ఇంగ్లీష్ జట్టుతో తొలి టెస్ట్ మొదలైంది. టాస్ గెలిచిన ఆంగ్ల జట్టు సారథి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత జట్టు ముందుగా బ్యాటింగ్ చేస్తున్నది. ఈ కథనం రాసే సమయం వరకు వికెట్ నష్టం లేకుండా భారత్ నాలుగు పరుగులు చేసింది. రాహుల్, జైస్వాల్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు.
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఓపెనర్లుగా రంగంలోకి దిగి ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు.. కేఎల్ రాహుల్ ఇటీవల కాలంలో భీకరమైన ఫామ్ లో ఉన్నాడు. ఐపీఎల్ లో చూపించిన సామర్ధ్యాన్ని ఇటీవలి ప్రాక్టీస్ మ్యాచ్లో కూడా ప్రదర్శించాడు. దీంతో అతడి నుంచి భారీ ఇన్నింగ్స్ ను భారత జట్టు అంచనా వేస్తోంది. మరోవైపు జైస్వాల్ కూడా టచ్ లోకి వచ్చాడు.. అనధికారిక టెస్టులలో అంతగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ.. ప్రాక్టీస్ మ్యాచ్ లో దుమ్ము రేపాడు. కెప్టెన్ గిల్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వస్తాడు. ఆ తర్వాత రిషబ్ పంత్, కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా శార్దూల్ ఠాకూర్ బ్యాటింగ్ చేస్తారు.. పేస్ బౌలర్లుగా బుమ్రా, సిరాజ్, ప్రసిద్ కృష్ణ తమ సేవలను జట్టుకు అందిస్తారు. స్పిన్ బౌలర్లుగా రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్ కొనసాగుతారు..
Also Read: Sai Sudharsan: సాయి సుదర్శన్.. టీమిండియాలో కచ్చితంగా సుదర్శన చక్రం తిప్పుతాడు..
జట్టులోకి సాయి సుదర్శన్
ఐపీఎల్ లో గుజరాత్ జట్టు తరఫున అదరగొట్టిన సాయి సుదర్శన్ భారత టెస్టు జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. అతడికి టెస్ట్ జట్టు క్యాప్ ను సీనియర్ ఆటగాడు చతేశ్వర్ పూజార బహుకరించాడు. అతడిని టీమిండియా లోకి సాదరంగా ఆహ్వానించాడు. తోటి ఆటగాళ్లు కూడా అతడిని అభినందించారు. గొప్ప ఇన్నింగ్స్ ఆడి జట్టు సాధించే విజయాలలో కీలకపాత్ర పోషించాలని ఆకాంక్షించారు.. క్యాప్ స్వీకరించిన తర్వాత సాయి సుదర్శన్ ఆనందం వ్యక్తం చేశాడు. తన తల మీద క్యాప్ ధరించి మురిసిపోయాడు.. సాయి సుదర్శన్ ఇటీవల ఐపీఎల్లో గుజరాత్ జట్టు తరఫున బీభత్సమైన పరుగులు చేశాడు. గుజరాత్ జట్టుకు గిల్ నాయకత్వం వహించాడు. ఇప్పుడు టెస్ట్ జట్టుకు గిల్ నాయకత్వం వహిస్తుండగా.. సాయి సుదర్శన్ జట్టులో స్థానం సంప్రదించాడు. వన్ డౌన్ ఆటగాడిగా బ్యాటింగ్ చేయనున్నాడు.. సాయి సుదర్శన్ కు జాతీయ జట్టులో స్థానం లభించడంతో గుజరాత్ మేనేజ్మెంట్ హర్షం వ్యక్తం చేసింది. మరోవైపు టీమ్ ఇండియా సీనియర్ ఆటగాడు హార్థిక్ పాండ్యా కూడా అభినందనలు తెలియజేశాడు. తన సామాజిక మాధ్యమాలలో సాయి సుదర్శన్ కు శుభాకాంక్షలు తెలియజేశాడు. తన ఇన్ స్టా గ్రామ్ స్టోరీలో సాయి సుదర్శన్ కు గ్రీటింగ్స్ తెలియజేశాడు. సాయి సుదర్శన్ భీకరమైన ఫామ్ లో ఉన్న నేపథ్యంలో అతడికి వన్ డౌన్ ఆటగాడిగా అవకాశం కల్పించారు.. అతడు భారీ ఇన్నింగ్స్ ఆడతాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నది భారత మేనేజ్మెంట్. ఇటీవలి ప్రాక్టీస్ మ్యాచ్లలో సాయి సుదర్శన్ అదరగొట్టాడు. భారీగా పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అంతేకాదు తనకు తుది జట్టులో అవకాశం రావడంతో హర్షం వ్యక్తం చేశాడు. భావోద్వేగానికి గురయ్యాడు. తన తల మీద భారత జట్టు క్యాప్ ధరించి మురిసిపోయాడు.