Balayya vs Nagarjuna Controversy: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి, అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నందమూరి ఫ్యామిలీ నుంచి విశ్వ విఖ్యాత నటసార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు హీరోగా రాణించడమే కాకుండా తెలుగు సినిమా ఖ్యాతిని పెంచే ఎన్నో గొప్ప సినిమాలను చేశాడు. అలాగే రాజకీయాల్లోకి వెళ్లి సీఎంగా కూడా తన పదవి బాధ్యతలను కొనసాగించాడు. ఇక అక్కినేని నాగేశ్వరరావు రొమాంటిక్ సినిమాలకు పెట్టింది పేరుగా మారాడు. ఆయన చేసిన సినిమాలన్నీ కూడా యూత్ ని బాగా ఆకర్షించేవి అలా ఎన్టీఆర్ నాగేశ్వరరావు సినిమాలు చూడడానికి జనాలు ఎగబడే వారు. ఇప్పటికి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఈ ఇద్దరిని రెండు కండ్లుగా చెప్పుకుంటూ ఉంటారు. మరి ఇలాంటి సందర్భంలోనే వీళ్ళ నట వారసులు సైతం సినిమా ఇండస్ట్రీకి వచ్చి వాళ్లు కూడా స్టార్లుగా ఎదిగారు… ఇక ఎన్టీఆర్ కొడుకు అయిన బాలయ్య బాబు హీరో ఎంట్రీ ఇచ్చి మాస్ ప్రేక్షకులను అలరిస్తూ గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు. నాగేశ్వర రావు కొడుకు అయిన నాగార్జున సైతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలక్షణమైన నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా డిఫరెంట్ పాత్రలు చేస్తూ తనను తాను ఒక స్టార్ హీరోగా మలుచుకున్నాడు… అయితే ఈ ఇద్దరి మధ్య గత కొన్ని రోజులుగా మాటలు లేవనే వార్తలైతే వినిపిస్తున్నాయి.
Also Read: Balakrishna-Nagarjuna : బాలయ్య ఆ మూవీని వదిలేస్తే నాగార్జున చేసి సూపర్ సక్సెస్ ను అందుకున్నాడా..?
బాలయ్య బాబు (Balayya Babu), నాగార్జున (Nagarjuna) ఇద్దరు ఒకప్పుడు చాలా మంచి ఫ్రెండ్స్ గా ఉన్నారు. కానీ ఈమధ్య వాళ్ళిద్దరి మధ్య అసలు మాటలు లేవని తెలుస్తోంది. ఒకరి ఫంక్షన్ కి మరొకరు అటెండ్ అవ్వడం లేదంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలైతే వస్తున్నాయి. నిజానికి ఎందుకు వీళ్ళ మధ్య గొడవ జరిగింది. అసలు ఏ కారణం చేత వీళ్లిద్దరి మధ్య మాటలు లేకుండా పోయాయి అనే విషయాలను తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు…
ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే బాలయ్యా బాబు ఒక స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి కమిట్ అయ్యాడట. ఇక అదే సమయంలో నాగార్జున ఆ దర్శకుడితో సినిమా చేయాలని అనుకున్నాడు. బాలయ్య బాబు కి కథ చెప్పిన ఒక దర్శకుడు నాగార్జునకు కూడా అదే కథ ను చెప్పి ఒప్పించాడట. ఈ విషయం బాలయ్య కి తెలిసి ఆ డైరెక్టర్ ను మందలించి ఆయన ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు.బాలయ్య ఆ తర్వాత నుంచి నాగార్జున మీద కోపంతో ఉంటున్నాడు.
ఇక నాగార్జున సైతం ఆ సినిమాను చేస్తానని అనుకున్నప్పటికి ఆ దర్శకుడిని పక్కన పెట్టినట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే ఆ ఇద్దరు హీరోల్లో ఎవరు ఆ ప్రాజెక్టు ను చేయలేదు ఇంకా ఆ దర్శకుడు ఎవరు అనే విషయం కూడా ఎవరికీ తెలియలేదు. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఆ సినిమా వల్లనే గొడవలు జరిగాయి. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వాళ్లిద్దరి మధ్య మాటలు కూడా లేకుండా పోయాయి…