AP EDCET 2025 Results: ఏపీ ఎడ్ సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా విడుదల చేశారు. ఈ పరీక్షల్లో 99.42 శాత ఉత్తీర్ణత నమోదైనట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 17,795 మంది రిజిస్టర్ చేసుకోగా 14,527 మంది అర్హత సాధించినట్లు మంత్రి వెల్లడించారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, ఎడ్ సెడ్ హాల్ టికెట్ తో పాటు పుట్టిన తేతీ వివరాలను ఎంటర్ చేసి ఫలితాలు, ర్యాంక్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 9552300009 ద్వారా కూడా ఫలితాలను పొందే అవకాశాన్ని కల్పించింది ప్రభుత్వం.