Today Horoscope In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం పూర్వ పాల్గుని నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు బుధాదిత్య ఏర్పడడం వల్ల కొన్ని రాశుల వ్యాపారులకు అదృష్టం పట్టనుంది. మరికొందరు ప్రయాణాలు చేయాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారు ఈరోజు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. ఉద్యోగులు చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. వ్యాపారులకు లాభాలు ఉంటాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు. గతంలో ప్రారంభించిన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : . ఈ రాశి వ్యాపారాలు ఏవైనా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే పెద్దలు సలహా తీసుకోవాలి. అయితే కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అదరాబాదర ఖర్చులు పెట్టడం వల్ల ఆర్థిక భారాలు మోయాజీ వస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల పాల్గొంటే విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారు ఈ రోజు జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. దంపతులు కలిసి విహారయాత్రలకు వెళ్తారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. వ్యాపారులకు అనుకున్న దానికంటే ఎక్కువగా లాభాలు వస్తాయి. ఉద్యోగులు లక్షలను పూర్తి చేయడంతో అధికారుల నుంచి ప్రశంసలకు పొందుతారు. ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి కుటుంబ సభ్యులతో చర్చిస్తారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : . ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు పురోగతి లభిస్తుంది. అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. కొత్తగా ఏ పని ప్రారంభించిన విజయవంతంగా పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు చేయడం వల్ల లాభాలు ఉంటాయి. పిల్లల కెరీర్ పై ప్రత్యేక దృష్టి పెడతారు. కొత్తగా ఆర్థిక వ్యవహారాలు జరిపే వారితో జాగ్రత్తగా ఉండాలి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వ్యాపారులకు ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అయితే కుటుంబ జీవితం కాస్త గందరగోళంగా ఉండే అవకాశం. జీవిత భాగస్వామితో వాగ్వాదం ఉంటుంది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండాలి. డబ్బుకు సంబంధించిన ఏ కార్యక్రమం మొదలుపెట్టిన విజయవంతమే అవుతుంది.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : జీవిత భాగస్వామి సలహాతో వ్యాపారాలు కొత్త పెట్టుబడులు పెడతారు. వి భవిష్యత్తులో లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగులు అనుకున్న పనిని పూర్తిచేస్తారు. దీంతో ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. ప్రియమైన వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్నిసార్లు కష్టపడిన సరైన గుర్తింపు వచ్చే అవకాశం ఉండదు. అయితే మీరు చేసిన పనులను ఇతరులకు చెప్పుకునే ప్రయత్నం చేయాలి. వ్యాపారులకు సాధారణ లాభాలు ఉంటాయి. వ్యక్తిగత జీవితం బాగుంటుంది. కుటుంబ సభ్యులకు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విద్యార్థుల కెరీర్ పై ప్రత్యేక దృష్టి పెడతారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి కెరీర్ బాగుంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగులకు అదనపు ఆదాయం అందుతుంది. వ్యాపారులకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేస్తారు. దేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థుల పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి సమాజంలో గౌరవం పెరిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఏదైనా ముఖ్యమైన పనుల గురించి చర్చించేటప్పుడు కొత్తవారు లేకుండా చూడాలి. ఇతరులకు అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్త పడాలి. బంధువుల నుంచి తన సహాయం అందుతుంది. కొత్తగా ఆర్థిక వ్యవహారాలు జరపొద్దు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : కొత్తగా పనిని ప్రారంభించడానికి ఈ రోజు అనుకూలమైన సమయం. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. వ్యాపారులకు లాభాలు ఉంటాయి. ఉద్యోగులు కొత్తగా పనులు మొదలు పెట్టాలనుకుంటే ఇదే మంచి సమయం. జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా ఉంటారు. పిల్లలతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. అయితే కొత్త వ్యక్తులు పరిచయం కావడంతో వారితో ఆర్థిక వ్యవహారాలు జరపొద్దు. ఉద్యోగులకు అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. కానీ తోటి వారి సాయం చేయడం వల్ల అనుకున్న పనిని పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామి సలహాతో కొత్త పెట్టబడును పెడతారు. ఉద్యోగులు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అయితే ఇవి లాభాలు ఉంటాయి. తోటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు ఏర్పడతాయి. వీటిని పరిష్కరించేందుకు తీవ్రంగా కృషి చేస్తారు.