Edgbaston Test Day 5: తొలి టెస్ట్ లో గెలవాల్సిన సందర్భంలో బౌలింగ్ వైఫల్యం వల్ల టీమిండియా ఓటమిపాలైంది.. రెండో టెస్టులో ప్రస్తుతం నాలుగో రోజు కూడా ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఐదో రోజు మరో 7 వికెట్లు తీస్తే గిల్ సేన విజయం సాధించడం ఖాయం. నాలుగు రోజు ఇంగ్లాండు జట్టు మూడు వికెట్లను టీమిండియా పడగొట్టింది. ఇక ఐదో రోజు ఏడు వికెట్లు సాధిస్తే టీమ్ ఇండియాకు గెలుపు లభిస్తుంది. దీంతో సిరీస్ 1-1 తో సమం అవుతుంది. అయితే టీమిండియా ఈ మ్యాచ్లో విజయం సాధించాలని భావిస్తోంది. గెలుపు ముంగిట బోర్లా పడకూడదని అనుకుంటున్నది. ఇందులో భాగంగానే ఇంగ్లాండ్ జట్టును ఒత్తిడిలోకి నెట్టాలని ప్రణాళిక రూపొందించింది. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇంగ్లాండ్లో వరుణిడి స్క్రిప్ట్ మరో విధంగా ఉంది.
Also Read: రెచ్చగొట్టిన బ్రూక్.. పద్ధతిగా ఇచ్చిపడేసిన పంత్.. అట్లుంటది మరీ (వీడియో)
రెండవ టెస్ట్ ఎడ్జ్ బాస్టన్ లో జరుగుతోంది. అయితే ఆదివారం అక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ వేదికలో 60% వర్షం కురవవడానికి అవకాశం ఉందని ఆక్యువెదర్ వెల్లడించింది. ముఖ్యంగా ఉదయం పూట ఆటకు వర్షం ఇబ్బంది కలిగించవచ్చని పేర్కొంది. ఒకవేళ ఇదే గనుక వాస్తవరూపం దాల్చితే మ్యాచ్ డ్రా అవడానికి అవకాశం ఉంటుంది. మరోవైపు టీమిండియా కెప్టెన్ గిల్ నిన్న చాలా ఆలస్యంగా ఇన్నింగ్స్ డిక్లేర్ ఇచ్చాడు. ఇప్పుడు అదే టీమ్ ఇండియా కొంపముంచే అవకాశం ఉందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇండియా గెలవాలంటే ఇంకా 7 వికెట్లు అవసరం ఉంది. ఇంగ్లాండ్ జట్టులో బ్రూక్, పోప్ క్రీజ్ లో ఉన్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు ఇప్పటికే 22 పరుగులు జోడించారు.. భారత జట్టులో ఆకాశ్ దీప్ రెండు వికెట్లు పడగొట్టాడు. సిరాజ్ ఒక వికెట్ సాధించాడు.
మరోవైపు టీమ్ ఇండియా గెలవాలంటే ఇంగ్లాండ్ ఆటగాళ్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా బౌలింగ్ చేయాలి. ముఖ్యంగా ఆకాశ్ దీప్, సిరాజ్ ఇంగ్లాండ్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టే విధంగా బంతులు వేయాలి. నాలుగు రోజు ఇంగ్లాండ్ రెండవ ఇన్నింగ్స్ లో ఆకాష్ అద్భుతంగా బంతులు వేశాడు. ముఖ్యంగా రూట్, డకెట్ కు అత్యంత పదునైన బంతులు వేసి బోల్తా కొట్టించాడు. ఆ బంతులను వారిద్దరు ఆడలేక చేతులెత్తేశారు. ఫలితంగా వారిద్దరు క్లీన్ బౌల్డ్ అయ్యారు. సిరాజ్ కూడా కట్టుదిట్టంగా బంతులు వేయాల్సి ఉంది. వీరిద్దరి మీద ఒత్తిడి పడకుండా ప్రసిధ్ సత్తా చాటాలి. ప్రసిధ్ ఇంగ్లాండ్ జట్టు రెండవ ఇన్నింగ్స్ లో మూడు ఓవర్లు బౌలింగ్ వేశాడు. కేవలం ఆరు పరుగులు మాత్రమే ఇచ్చాడు. అయితే జట్టు విజయం సాధించాలంటే పరుగులను నియంత్రించడం ఒక్కటే మార్గం కాదు. వికెట్లు కూడా తీయాలి. అతడు గనుక తన వంతు బాధ్యతగా వికెట్లు తీస్తే టీమ్ ఇండియాకు తిరుగు ఉండదు.
Also Read: సరిహద్దుల్లో దేశం కోసం ధోని అంత కష్టపడ్డాడా.. రోమాలను నిక్కబొడిపించే కథనం ఇది..
వర్షం కురుస్తుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో టీమిండియా అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గెలుపు ముంగిట వాతావరణం ఇలా మారిందని బాధపడుతున్నారు. వర్షం కురువద్దని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ” వరుసగా టెస్ట్ మ్యాచులు ఓడిపోతోంది. మిగతా ఫార్మాట్లలో టీమ్ ఇండియాకు తిరుగు లేకపోయినప్పటికీ.. టెస్ట్ ఫార్మాట్ లో మాత్రం తడబడుతోంది. ఇది టీమిండియా కు తల వంపులు తీసుకొస్తున్నది. ఇప్పుడు ఇంగ్లాండ్ గడ్డమీద పర్యటిస్తున్న నేపథ్యంలో తొలి టెస్ట్ ఓడిపోయింది. రెండవ టెస్ట్ గెలుస్తుందనుకుంటున్న తరుణంలో ఇలా వాతావరణం మారిపోవడం.. మనకు ప్రతికూలంగా మారడం బాధ కలిగిస్తున్నదని” టీమ్ ఇండియా అభిమానులు వాపోతున్నారు. వర్షం కురవకుండా ఉంటే బాగుంటుందని వ్యాఖ్యానిస్తున్నారు.