Dhoni IPL 2025: ఐపీఎల్ లో చెన్నై జట్టుకు 5 టైటిల్స్ అందించిన ఘనత మహేంద్రసింగ్ ధోనిది. అందువల్లే ధోనిని తమిళ అభిమానులు తలా అని పిలుచుకుంటారు. అతడు మైదానంలో కనిపిస్తే చాలు కేరింతలు కొడతారు. అతడు బౌండరీలు సాధిస్తే చాలు ఎగిరి గంతులు వేస్తారు. అతని ఆటను చూసి తమను తాము మైమరిచిపోతారు.
Also Read: అలా అవుట్ అయిన ఒకే ఒక్క క్రికెటర్.. లెజెండ్ కెరీర్‌లో అదీ ఓ రికార్డే!
ఇటీవల సీజన్లో చెన్నై జట్టు ఆశించినత స్థాయిలో ఆడలేక పోయింది. చెన్నై జట్టు సారథి గైక్వాడ్ గాయానికి గురయ్యాడు. దీంతో అతడు టోర్నీ మధ్యలో నుంచి వెళ్లిపోయాడు. ఫలితంగా చెన్నై జట్టుకు తాత్కాలిక సారధిగా ధోని వ్యవహరించడం మొదలుపెట్టాడు. ధోని నాయకత్వంలోను చెన్నై జట్టు ఊహించిన స్థాయిలో విజయాలు సాధించలేదు. దీంతో గ్రూప్ దశ నుంచే చెన్నై జట్టు ఇంటికి వెళ్లిపోయింది. దీంతో వచ్చే సీజన్లో జట్టు గొప్ప విజయాలు సాధించాలని భావిస్తోంది.
ఇక ప్రస్తుతం ధోని పలు కార్యక్రమాలలో బిజీబిజీగా గడుపుతున్నాడు. తాజాగా ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ధోని కీలక వ్యాఖ్యలు చేశాడు. వచ్చే సీజన్లో చెన్నై జట్టు తరఫున ఆడతారా అనే ప్రశ్నకు ఆయన తనదైన శైలిలో సమాధానం చెప్పాడు. ” వచ్చే సీజన్లో ఆడతానో లేదో తెలియదు. దానికి ఇంకా సమయం ఉంది. కాకపోతే నా మోకాలి నొప్పి తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ఇలాంటి సమయంలో నేను ఐపీఎల్ ఆడాలంటే ఆలోచించాలని” ధోని వ్యాఖ్యానించాడు. మరోవైపు ఇటీవల ఐపీఎల్ గురించి మాట్లాడిన ధోని.. తను హాస్పిటల్ మీద స్ట్రెచర్ పై ఉన్నప్పటికీ.. మేనేజ్మెంట్ ఐపీఎల్ ఆడిస్తుందని ధోని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
Also Read: విజయానికి దగ్గరదారులు ఉండవు.. దానికి ఈ క్రికెటరే జీవితమే బలమైన ఉదాహరణ
వచ్చే సీజన్ కు సంబంధించి ఐపిఎల్ మార్చి మూడో వారం నుంచి మొదలుపెడితే మే రెండవ వారం వరకు సాగుతుందని తెలుస్తోంది. ఇక చెన్నై జట్టుకు గైక్వాడ్ సారథ్యం వహిస్తాడా లేదా అనే ప్రశ్నలు ఇప్పటికీ వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఎందుకంటే అతడు గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. ఇదే క్రమంలో సంజు శాంసన్ చెన్నై జట్టుకు సారథ్యం వహిస్తాడని వార్తలు వస్తున్నాయి. అయితే అతను మాత్రం రాజస్థాన్ జట్టే తన ప్రాణం అని వ్యాఖ్యానించాడు. ఈ లెక్కన వచ్చే సీజన్లో గైక్వాడ్ లేదా ధోని చెన్నై జట్టుకు నాయకత్వం వహించకపోతే.. వేరే వ్యక్తిని సారధిగా చూడాల్సి వస్తుందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.