SA20 2025 most expensive players: ఈ భూమ్మీద కష్టపడ్డ వాళ్ళు ఎప్పటికైనా విజయం సాధిస్తారు. కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ.. మిగతా సందర్భాల్లో విజయాలు సాధించి మిగతా వారికి ఆదర్శంగా నిలుస్తుంటారు. అటువంటి వ్యక్తులను విజేతలు అంటుంటారు. ఇతడి గాధ కూడా అటువంటిదే. కష్టపడ్డాడు. అపజయాలు ఎదురయ్యాయి. అయినప్పటికీ కృంగిపోలేదు. తనను తాను నిరూపించుకోవడానికి ఎదురైన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. తద్వారా తనకు తానే కొత్తగా కనిపించాడు. ఇప్పుడు ఏకంగా వార్తల్లో నిలిచాడు. తన తోటి ఆటగాళ్లు కలలో కూడా ఊహించని నగదును సొంతం చేసుకున్నాడు.
ఐపీఎల్ తర్వాత పొట్టి క్రికెట్ ఫార్మాట్లో ఆ స్థాయి ఆదరణ సొంతం చేసుకున్న లీగ్ సౌత్ ఆఫ్రికా 20. త్వరలో జరిగే నాలుగో సీజన్ కోసం ఆటగాళ్ల వేలం మొదలైంది. ఇందులో భాగంగా ప్రిటోరియా క్యాపిటల్స్ ఒక ఆటగాడిని సొంతం చేసుకుంది. అతని కోసం ఏకంగా ఎనిమిది కోట్లకు మించి ఖర్చు పెట్టింది. వాస్తవానికి సౌత్ఆఫ్రికా 20 లీగ్ లో ఇదే అత్యధిక ధర కావడం విశేషం.. బేబీ బేబీ గా పేరు తెచ్చుకున్న బ్రేవిస్ కోసం క్యాపిటల్స్ జట్టు అంతస్థాయిలో నగదు వెచ్చించింది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టి20 సిరీస్ లో ఈ యువ ఆటగాడు అదరగొట్టాడు. మైదానంలో సునామీ లాంటి ఇన్నింగ్స్ ఆడి ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆ ఇన్నింగ్స్ తర్వాత బ్రేవిస్ వెను తిరిగి చూసుకోలేదు. అంతర్జాతీయ మీడియా అతడిని బేబి ఏబిగా కీర్తించడం మొదలుపెట్టింది. ఒకప్పుడు డివిలియర్స్ అయితే ఏ స్థాయిలో ఆడేవాడో.. ఇప్పుడు బ్రేవిస్ కూడా అదే స్థాయిలో ఆడుతున్నాడు. కొన్ని సందర్భాలలో జట్టుకు వెన్నెముకగా మారిపోయి ఊహించని ఇన్నింగ్స్ ఆడుతున్నాడు.
Also Read: నిన్న ద్రావిడ్.. నేడు ఇతడు.. రాజస్థాన్ జట్టులో ఏం జరుగుతోంది? ఇంతకీ ఐపీఎల్ ఆడుతుందా?
బ్రేవిస్ ఐపీఎల్లో చెన్నై జట్టు తరఫున ఆడుతున్నాడు. నో లుక్ సిక్సర్లు కొట్టడంలో ఇతడు సిద్ధహస్తుడు. బౌలర్ ఎవరనేది లెక్కపెట్టకుండా.. పిచ్ ఎలాంటిదనేది పట్టించుకోకుండా పరుగులు తీయడంలో బేబీ ఏబి మొనగాడు. అతని బ్యాటింగ్ స్టైల్ చూసి క్యాపిటల్స్ జట్టు ఆస్థాయి నగదు వెచ్చించింది. అతడిని కొనుగోలు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తోంది. అతడు జట్టులో ఉండడం వల్ల మరింత బలం చేకూరిందని.. ఈ సీజన్లో మెరుగైన ప్రదర్శన చేస్తామని ఆశాభావం వ్యక్తం చేసింది. అరవైపు డర్బన్ సూపర్ జేయింట్స్ ఏడు కోట్లు వెచ్చించి సౌత్ ఆఫ్రికా స్టార్ ఆటగాడు మార్క్రమ్ ను దక్కించుకుంది.