Homeక్రీడలుక్రికెట్‌DC vs GT match preview: ఢిల్లీ ఆషామాషి కాదు.. గిల్ అంతకుమించి చేస్తేనే దక్కేది..

DC vs GT match preview: ఢిల్లీ ఆషామాషి కాదు.. గిల్ అంతకుమించి చేస్తేనే దక్కేది..

DC vs GT match preview: ప్రస్తుతం ఐపీఎల్ లో వరుస విజయాలతో దూసుకుపోతోంది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు. జట్టులో సమిష్టితత్వం కొనసాగుతోంది. బ్యాటర్లు, బౌలర్లు, ఫీల్డర్లు సమాంతరంగా జట్టు భారాన్ని మోస్తున్నారు. ఫలితంగా ఢిల్లీ జట్టు ఇతర జట్లు అసూయపడే విధంగా విజయాలు సాధిస్తోంది. ఇటీవల ముంబై జట్టుపై ఢిల్లీ సాధించిన విజయం.. ఆ జట్టు సమిష్టి తత్వానికి బలమైన ప్రతీక.

వరుస విజయాలతో జోరు మీద ఉన్న ఢిల్లీ.. పరాజయాలతో నిరాశతో కనిపిస్తున్న గుజరాత్ టైటాన్స్ బుధవారం ఢిల్లీ వేదికగా తలపడతాయి. గిల్ ఇటీవల రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో కండరాల గాయం వల్ల జట్టుకు దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలో అతడు ఢిల్లీతో జరిగే మ్యాచ్ కు సిద్ధంగా ఉన్నాడు. ఢిల్లీ జట్టులో సమీర్ రిజ్వి అత్యంత ప్రమాదకరమైన ఆటగాడిగా కనిపిస్తున్నాడు. ఇప్పటికే అతడు రెండు అద్భుతమైన వరుస అర్థ సెంచరీలు చేశాడు.

బౌలింగ్ పరంగా ఢిల్లీ బలంగా ఉంది. స్టార్క్ లేకపోయినప్పటికీ.. ఎంగిడి.. ముఖేష్ కుమార్, నటరాజన్ ఆ లోటు తీరుస్తున్నారు. ముఖ్యంగా ముఖేష్ తన సీమ్ బౌలింగ్ తో ఆకట్టుకుంటున్నాడు.. ఇటీవల ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్లో 26 పరుగులు ఇచ్చి.. రెండు వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్, కులదీప్ యాదవ్, విప్రజ్ నిగమ్ వంటి వారు స్పిన్ బౌలింగ్లో కీలకంగా ఉన్నారు.. ఓపెనర్ కేఎల్ రాహుల్, నితీష్ రానా సరిగ్గా ఆడటం లేదు. వీరిద్దరి వైఫల్యం జట్టును తీవ్రంగా ఇబ్బంది పడుతోంది..

రాజస్థాన్ జట్టు చేతిలో ఓడిపోయిన తర్వాత గుజరాత్ అనేక కసరత్తులు చేస్తోంది.. సిరాజ్, ప్రసిద్ కృష్ణ, రబాడ, అశోక్ శర్మ, రషీద్ ఖాన్ తన బౌలింగ్ నైపుణ్యాలను పెంచుకుంటున్నారు.. గిల్ జట్టులోకి వస్తున్న నేపథ్యంలో.. బ్యాటింగ్ దళం బలంగా మారే అవకాశం ఉంది. సాయి సుదర్శన్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. గిల్ తన లయను అందిపుచ్చుకోవాలి. మిగతా బ్యాటర్లు కూడా ఢిల్లీ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కోవాలి. అప్పుడే ఆ జట్టు బలమైన పోటీ ఇవ్వగలుగుతుంది.

గత ఏడాది మే 18న ఢిల్లీలో గుజరాత్, ఢిల్లీ జట్లు తలపడ్డాయి. నాటి మ్యాచ్లో సాయి సుదర్శన్ 108*, గిల్ 93* పరుగులు చేశారు. తొలి వికెట్ కు 205 పరుగులు నమోదు చేశారు. ఐపీఎల్ చేజింగ్ లో ఈ జట్టు కైనా సరే ఇదే అత్యధిక తొలి వికెట్ భాగస్వామ్యం.

కేఎల్ రాహుల్ (112) గుజరాత్ జట్టుతో గత ఏడాది జరిగిన మ్యాచ్లో 65 బంతుల్లో చేశాడు.. గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఒక ఢిల్లీ బ్యాటర్ చేసిన పరుగులలో ఇవే అత్యధికం.

గుజరాత్, ఢిల్లీ గత ఏడాది రెండుసార్లు తలపడితే.. రెండుసార్లు కూడా గుజరాత్ విజయం సాధించింది.

 

 

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular