spot_img
Homeక్రీడలుక్రికెట్‌CSK Vs PBKS Match Preview 2026: సంజు శాంసన్ తో ఓపెనర్ గా అతడు.....

CSK Vs PBKS Match Preview 2026: సంజు శాంసన్ తో ఓపెనర్ గా అతడు.. చెన్నై జట్టుకు శుభ పరిణామం

CSK Vs PBKS Match Preview 2026: ఐపీఎల్ లో భాగంగా చెన్నై జట్టు శుక్రవారం పంజాబ్ తో తలపడుతోంది. సొంత మైదానమైన చెపాక్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మైదానంలో ఇటీవల జరిగిన టి20 వరల్డ్ కప్ లో సూపర్ 8 దశలో టీమిండియాలోకి వచ్చాడు సంజు శాంసన్. జింబాబ్వేపై 24 పరుగులు చేశాడు. ఆ తర్వాత మిగతా మూడు మ్యాచ్లలో వరుస ఆఫ్ సెంచరీలు చేసి.. టీమ్ ఇండియా విజేతగా ఆవిర్భవించడంలో కీలక పాత్ర పోషించాడు.

శుక్రవారం పంజాబ్ జట్టుతో జరిగే మ్యాచ్లో కూడా అతడు అదే స్థాయిలో ఆకట్టుకుంటాడని అభిమానులు అంచనా వేస్తున్నారు. తొలి మ్యాచ్లో అంతగా ఆకట్టుకోలేని సంజు.. ఈ మ్యాచ్లో తన మెరుపు ఆట తీరు కొనసాగిస్తాడని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. తొలి మ్యాచ్లో విఫలమైన నేపథ్యంలో.. సంజు తన బ్యాటింగ్ లోపం మీద అత్యంత సీరియస్ గా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. మైదానంలో కూడా అతడు తీవ్రంగా సాధన చేసినట్టు వార్తలు వస్తున్నాయి.

పంజాబ్ జట్టుతో జరిగే మ్యాచ్లో చెన్నై తరఫున సంజు తో పాటు కెప్టెన్ రుతు రాజ్ గైక్వాడ్ ఓపెనర్ గా వచ్చే అవకాశం ఉందని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే తన ఆసక్తిని గైక్వాడ్ మేనేజ్మెంట్ ముందు ఉంచాడని.. మేనేజ్మెంట్ కూడా దీనికి సమ్మతి తెలిపిందని తెలుస్తోంది.. గైక్వాడ్ తొలి మ్యాచ్ లో విఫలమయ్యాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ ఏమాత్రం ప్రతిభ చూపించలేకపోయాడు. దీంతో అతని మీద తీవ్రమైన ఒత్తిడి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ ఒత్తిడిని తగ్గించుకోవడానికి అతడు ఓపెనర్ గా వస్తాడని తెలుస్తోంది.

సంజు ఓపెనర్ గా తను ఏమిటో నిరూపించుకున్నాడు. టి20 వరల్డ్ కప్ లో అతడు సాధించిన పరుగులే దానికి బలమైన ఉదాహరణ. ఇప్పుడు సంజుకు గట్టి హ్యాండ్ తగిలితే.. చెన్నై జట్టుకు తిరుగుండదు. అలాగని పంజాబ్ జట్టు అంత ఆషామాషీ కాదు. గట్టి లెక్కల తోనే ఉంది. అలాంటప్పుడు సంజు, గైక్వాడ్ వర్సెస్ పంజాబ్ అన్నట్టుగా పరిస్థితి మారుతుంది. ఇది కనక జరిగితే అభిమానులకు అసలు సిసలైన క్రికెట్ మజా లభిస్తుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular