Australia Test Victory: గతం ఎంతో ఘనం.. నేడు మాత్రం అధ్వానం అనే సామెత ప్రస్తుత పరిస్థితుల్లో వెస్టిండీస్ జట్టుకు నోటికి నూరుపాళ్లు సరిపోతుంది. లెజెండరీ ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహించిన ఆ జట్టు.. క్రికెట్ పై ఏకచత్రాధిపత్యాన్ని కొనసాగించిన ఆ జట్టు ఇప్పుడు అనామకంగా మారిపోయింది. కనీసం ఐసిసి నిర్వహిస్తున్న మెగా పోటీలకు అర్హత సాధించలేకపోతోంది.. చివరికి బంగ్లాదేశ్ కంటే హీనంగా మారిపోతోంది. జింబాబ్వేతో కూడా ఓడిపోతోంది.. తాజాగా ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో వెస్టిండీస్ అత్యంత దారుణమైన ప్రదర్శన చేస్తోంది. ఇప్పటికే రెండు టెస్టులు గెలిచి ఈ సిరీస్ సొంతం చేసుకున్న కంగారు జట్టు.. చివరి టెస్ట్ కూడా గెలిచి వైట్ వాష్ చేసింది.. తద్వారా 2025-27 డబ్ల్యూటీసీలో తొలి అడుగు ఘనంగా వేసింది.
కింగ్ స్టన్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ లో కంగారు జట్టు బౌలర్లు దుమ్మురేపారు. ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కంగారు జట్టు 225 పరుగులు చేసింది. ఆ తర్వాత ఫస్ట్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన వెస్టిండీస్ జట్టు 143 పరుగులకు కుప్పకూలింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఆస్ట్రేలియా జట్టు 121 పరుగులు చేసింది.. తొలి ఇన్నింగ్స్ 72.. రెండవ ఇన్నింగ్స్ 121 మొత్తం 193 పరుగుల విజయ లక్ష్యాన్ని వెస్టిండీస్ జట్టు ముందు ఆస్ట్రేలియా విధించింది. ఈ టార్గెట్ ఫినిష్ చేసే క్రమంలో రంగంలోకి దిగిన వెస్టిండీస్ జట్టు కేవలం 27 పరుగులకే కుప్ప కూలింది. సుదీర్ఘ ఫార్మాట్లో అత్యంత చెత్త రికార్డును.. అది కూడా స్వదేశంలోనే వెస్టిండీస్ జట్టు నమోదు చేయడం విశేషం. వెస్టిండీస్ జట్టులో ఏకంగా ఏడుగురు బ్యాటర్లు 0 పరుగుల వద్ద అవుట్ అయ్యారు. వెస్టిండీస్ జట్టులో గ్రీవ్స్ చేసిన 11 పరుగులు టాప్ స్కోర్ అంటే ఆటగాళ్ల బ్యాటింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ 6 వికెట్లు పడగొట్టాడు . ఓవరాల్గా టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇది సెకండ్ లో స్కోర్. 1955లో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో న్యూజిలాండ్ కేవలం 26 పరుగులకే ఆల్ అవుట్ అయింది.
Also Read: Eng Vs Ind: టీమిండియా గెలుస్తుందనుకుంటున్న దశలో ఓడింది.. భారతీయుల గుండె పగిలిన సందర్భం అది!
వెస్టిండీస్ బౌలర్లు ఈ సిరీస్లో అదరగొడుతున్నప్పటికీ.. బ్యాటర్లు మాత్రం దారుణంగా తేలిపోతున్నారు. ఏమాత్రం ఆకట్టుకోలేక చేతులెత్తేస్తున్నారు. బ్యాటర్లు విఫలం కావడం వెస్టిండీస్ జట్టు విజయాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. స్వదేశంలో ఏకంగా మూడు టెస్టులు ఓడిపోయి వెస్టిండీస్ జట్టు పరువు తీసుకుంది. ఇక అంది వచ్చిన అవకాశాన్ని ఆస్ట్రేలియా జట్టు సద్వినియోగం చేసుకుంది. అద్భుతంగా బ్యాటింగ్ చేసి.. అదే సమయంలో బౌలింగ్ కూడా చేసి వెస్టిండీస్ జట్టుపై ప్రతాపాన్ని చూపించింది.
WEST INDIES ALL OUT FOR 27 IN 2ND INNINGS
Australia won the test series 3-0 against West Indies
– Mitchell Starc takes 5 wickets in just 15 balls
– Scott Boland grabs a hat-trick
– the second-lowest Test total ever!AUSTRALIA PACE ATTACK FOR THE TEST pic.twitter.com/biiu1G0HIM
— Prakash (@definitelynot05) July 15, 2025
వెస్టిండీస్ జట్టు కేవలం 27 పరుగులకే కుప్పకూలిన నేపథ్యంలో సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా వెస్టిండీస్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ ను పక్కనపెట్టి ఏదైనా వ్యాపకం చూసుకోవాలని ఆటగాళ్లకు సలహా ఇస్తున్నారు. ఇంత దారుణంగా స్వదేశంలో ఆడి ఎటువంటి సందేశం ఇస్తున్నారంటూ మండిపడుతున్నారు. మరోవైపు ఓటమి పట్ల ఆ జట్టు కెప్టెన్ నిర్వేదం వ్యక్తం చేశాడు. ఇలాంటి ఆట ఇబ్బందికరంగా ఉందని దిగ్బ్రాంతి చెందాడు.