Manchu Vishnu Vs Akshay Kumar: మంచు విష్ణు(Manchu Vishnu) ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కించిన ‘కన్నప్ప'(Kannappa Movie) చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై డీసెంట్ స్థాయి వసూళ్లను సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఈ రేంజ్ లో ఉంటుందని అసలు ఊహించలేదు, మంచు విష్ణు అందరినీ సర్ప్రైజ్ కి గురి చేశాడంటూ చూసిన ప్రతీ ఒక్కరు సోషల్ మీడియా లో కామెంట్స్ చేశారు. రివ్యూస్ కి తగ్గట్టే, మంచు విష్ణు మార్కెట్ రేంజ్ లోనే మంచి వసూళ్లు నమోదు అయ్యాయి. కానీ అది ఈ సినిమా విజయం సాదించేందుకు ఏ మాత్రం సరిపోదు. మంచు విష్ణు 200 కోట్ల బడ్జెట్ ఖర్చు అయ్యిందని ప్రతీ ఇంటర్వ్యూ లో చెప్పుకుంటూ వచ్చాడు. అది నిజమైతే సినిమా ఘోరమైన డిజాస్టర్ గా మిగిలినట్టే. ఇది కాసేపు పక్కన పెడితే ఈ సినిమాలో శివుడి పాత్రలో అక్షయ్ కుమార్ నటించిన సంగతి అందరికీ తెలిసిందే.
Also Read: కన్నప్ప’ మూవీ క్లోజింగ్ కలెక్షన్స్..ఆల్ టైం డబుల్ డిజాస్టర్!
సినిమాలో అందరూ చాలా బాగా నటించారు కానీ, అక్షయ్ కుమార్ శివుడి పాత్ర మాత్రం సహజత్వానికి దగ్గరగా లేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేశారు. ఈ చిత్రానికి ఆయన సొంత డబ్బింగ్ చెప్పినట్టు ప్రచారం చేశారు కానీ, ఆ వాయిస్ ని AI ద్వారా చేశారని అంటున్నారు. సినిమాలో అక్షయ్ కుమార్ డైలాగ్స్ చెప్తున్నప్పుడు ఆ పెదాల కదలిక చూస్తే సింక్ లో చేసినట్టుగా అనిపించదు. డైలాగ్స్ కూడా ఆయన గుర్తు పెట్టుకొని చెప్పలేదు. టెలిప్రాంప్తర్ ను ఉపయోగించి డైలాగ్స్ చూసి చదువుతున్నట్టుగా ఉంది. అతను కళ్ళు తిప్పడం చూస్తేనే ఈ విషయాన్నీ గ్రహించవచ్చు. ఇది ఆడియన్స్ ని మోసం చేసినట్టు కాదా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ ప్రశ్నిస్తున్నారు. ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించిన ప్రభాస్(Rebel Star Prabhas), మోహన్ లాల్(Mohanlal) వంటి వారు ఒక్క పైసా రెమ్యూనరేషన్ తీసుకోకుండా నటించారు.
Also Read: యంగ్ హీరోల్లో ఆ ఒక్కడు మాత్రమే భారీ సక్సెస్ లను సాధిస్తున్నాడా..? ఇంతకీ ఆ హీరో ఎవరు..?
కానీ అక్షయ్ కుమార్(Akshay Kumar) మాత్రం భారీ రెమ్యూనరేషన్ ని అందుకున్నాడు. కనీసం తీసుకున్న రెమ్యూనరేషన్ కి న్యాయం చేయకపోతే ఎలా?, ఎదో రిక్వెస్ట్ చేశారు, బలవంతంగా వచ్చి షూటింగ్ చేసి వెళ్ళాము అనిపించే విధంగా నటించడం ఎందుకు? అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మండిపడుతున్నారు. మంచు విష్ణు ని కూడా ఈ విషయం లో తప్పుబడుతున్నారు. నీకు మన టాలీవుడ్ లో శివుడి పాత్ర కోసం ఏ హీరో కనిపించలేదా?, ఇతర ఇండస్ట్రీస్ లో వెతుక్కునే దుస్థితి ఎందుకు వచ్చింది?, మహేష్ బాబు ని కాస్త రిక్వెస్ట్ చేసి ఉండుంటే, ఒక రెండు రోజులు మహాశివుడి క్యారక్టర్ చేసి వెళ్ళేవాడు కదా?, సినిమాకు మరింత క్రేజ్ ఏర్పడి ఉండేది, మహాశివుడి క్యారక్టర్ ని ఎంపిక చేసుకునేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించాలి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.