India vs UAE in Asia Cup: ఆసియా కప్ మరికొద్ది గంటల్లో మొదలుకానుంది. యూఏఈ వేదికగా ఈ టోర్నీ నిర్వహిస్తున్నారు. తొలి మ్యాచ్ అబుదాబిలో జరుగుతుంది. ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ జట్లు తలపడతాయి. ఆఫ్ఘనిస్తాన్ విజేతగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు బౌలింగ్.. బ్యాటింగ్.. మధ్యలో ఫీల్డింగ్.. ఇలా ఏ విభాగం చూసుకున్నా సరే ఆఫ్ఘనిస్తాన్ అత్యంత బలంగా కనిపిస్తోంది. ఇటీవల ఆ జట్టు పాకిస్తాన్ ను ఓడించింది. ముక్కోణపు సిరీస్ లో ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ.. ఆఫ్ఘనిస్తాన్ తన స్థాయికి తగ్గట్టుగానే ఆడింది. ఇప్పుడు ఆసియా కప్ లో కూడా అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించాలని ఆ జట్టు భావిస్తుంది.
తొలి మ్యాచ్ తర్వాత రెండవ రోజు టీమిండియా తన ఆసియా కప్ వేటను మొదలు పెడుతుంది. హాంకాంగ్ జట్టుతో దుబాయ్ వేదికగా భారత్ మ్యాచ్ ఆడుతుంది.. ఈ మ్యాచ్ నేపథ్యంలో భారత జట్టు మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. టీమిండియా కు ఎంపిక చేసిన 15 మంది ఆటగాళ్లు కూడా అత్యున్నత ప్రతిభ ఉన్నవాళ్లు. మరో కొద్ది రోజుల్లో సొంత గడ్డపై పొట్టి ప్రపంచ కప్ జరుగుతుంది. దీనికి ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో.. భారత్ గనుక ఆసియా కప్ గెలవకపోతే విమర్శలు వ్యక్తం అవుతాయి. అందువల్లే ఆసియా కప్పు సూర్య జట్టుకు అత్యంత ముఖ్యమైనది. ప్రపంచ కప్ కంటే ముందు సూర్య సేన 20 t20 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. వీటిల్లో భారత జట్టు అద్భుతమైన ప్రతిభ చూపితే తిరిగి ఉండదు. ఇక ఆసియా కప్ టోర్నీలో భారత్ 8 సార్లు విజేతగా నిలిచింది. ఈసారి కూడా భారత జట్టు టైటిల్ ఫేవరెట్ గా కనిపిస్తోంది. దాయాది, లంక జట్ల నుంచి గట్టి పోటీ ఎదురవుతుందని అంచనాలు ఉన్నప్పటికీ.. ఎలాంటి స్థితిలో ఉన్నా సరే భారత్ విజయం సాధించే దిశగా కనిపిస్తోంది. పాకిస్తాన్ జట్టు షాహిన్ షా అఫ్రిది, రవూఫ్, హసన్ అలీ మీద ఆధారపడి ఉంది.
Also Read: ఆసుపత్రిలో చేరిన రోహిత్ శర్మ.. హిట్ మాన్ కు ఏమైంది?
ఇటీవలి ముక్కోణపు సిరీస్లో పాకిస్తాన్ 75 రన్స్ తేడాతో విజయం సాధించింది. అయితే నిలకడ లేకుండా ఆడటం పాకిస్తాన్ జట్టుకు ఎప్పటినుంచో ఉంది. ఇక శ్రీలంక, బంగ్లాదేశ్ కూడా బలహీనంగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు పొట్టి ఫార్మాట్ లో శ్రీలంక అదరగొట్టేది. జయ సూర్య సారధ్యంలో పర్వాలేదనిపించినప్పటికీ.. ఇటీవల కాలంలో ఆ జట్టు ఆట తీరు చెప్పుకునే స్థాయిలో లేదు. కీలక ప్లేయర్లు దారుణంగా విఫలమవుతున్నారు. కొత్త ఆటగాళ్లు అంచనాలను అందుకోలేకపోతున్నారు. అందువల్లే శ్రీలంక ఆసియా కప్ లో అనామక జట్టుగా కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే టైటిల్ ఫేవరెట్ గా భారత్ కనిపిస్తోంది. సోనీ గ్రూప్ చానల్స్ లో ఈ మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ అవుతుంది. సోనీ లివ్ ఆప్ లో కూడా చూడొచ్చు.