Andre Russell creates history: టి20 ఫార్మాట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కొత్త కొత్త రికార్డులు తెరపైకి వచ్చాయి. ఎంతోమంది ప్లేయర్లు t20 లలో సత్తా చూపించారు. సరికొత్త రికార్డులను నమోదు చేశారు.. ముఖ్యంగా యంగ్ ప్లేయర్లు అయితే టి20లలో అదరగొడుతున్నారు..
ప్రేక్షకులు కూడా టీ20 ఫార్మాట్ కు విపరీతంగా అలవాటుపడ్డారు. ఐసీసీ నిర్వహించే టోర్నీలు మాత్రమే కాకుండా, ఆయా దేశాలు నిర్వహించే టి20 లీగ్ లు క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్నాయి.. గతంలో టి20 టోర్నీలు కొన్ని దేశాలు మాత్రం నిర్వహించేవి. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చాలావరకు దేశాలు టీ20 క్రికెట్ టోర్నీలను నిర్వహిస్తున్నాయి.. యంగ్ ప్లేయర్లనుంచి మొదలుపెడితే సీనియర్ ప్లేయర్ల వరకు అందరు ఈ టోర్నీలలో ఆడుతున్నారు. టి20 లను ప్రేక్షకులు విపరీతంగా ఇష్టపడుతున్న నేపథ్యంలో చాలా వరకు దేశాలు ఈ టోర్నీలను నిర్వహిస్తున్నాయి. ఆటకు ఆట, సంపాదనకు సంపాదన ఉండడంతో చాలామంది ప్లేయర్లు ఈ టోర్నీలను ఆడేందుకు ఇష్టపడుతున్నారు.
టీ20 టోర్నీలలో చాలామంది ప్లేయర్లు సత్తా చూపిస్తున్నారు. సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నారు. ఈ జాబితాలో విండిస్ ఆల్ రౌండర్ రస్సెల్ కు సరికొత్త స్థానం ఉంది. ఇతడు సాధించిన రికార్డులు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. టి20 ఫార్మేట్ లో ఐదు వేల కు మించిన పరుగులు చేశాడు రస్సెల్.. ఇతడి ఖాతాలో 500+ సిక్సులు, 500+ వికెట్లు ఉన్నాయి. ఈ రికార్డు సృష్టించిన తొలి ఆటగాడిగా రస్సెల్ నిలిచాడు. అన్ని దేశాల లీగ్ లలో కలిపి రస్సెల్ 576 మ్యాచ్లు ఆడాడు. మొత్తంగా 9496 పరుగులు చేశాడు. 972 సిక్సర్లు, 628 ఫోర్లు కొట్టాడు. టి20 ఫార్మేట్ లో అత్యధికంగా 126 మంది ప్లేయర్లు 5వేలకు మించి పరుగులు చేశారు. ఆరుగురు బౌలర్లు 500+ వికెట్లు పడగొట్టారు. పదిమంది ప్లేయర్లు 500+ సిక్సర్లు కొట్టారు. కానీ ఇవన్నీ చేసింది ఒకే ఒక్క ఆటగాడు రస్సెల్.
వెస్టిండీస్ జట్టులో టి20 ఫార్మేట్ లో భీకరమైన ఆట తీరు ప్రదర్శించే ఆటగాళ్లు చాలామంది ఉన్నారు. అందులో రస్సెల్ ఒకడు. ఇతడు భీకరమైన ఆటకు పెట్టింది పేరు. ఎలాంటి బంతి అయినా సరే స్టాండ్స్లోకి పంపించడం ఇతడికి అలవాటు. బంతిని తిప్పి తిప్పి వేయడం ఇతడికి ఉన్న ఒక సరదా. అందువల్లే ఇతడిని టి20 ఫార్మేట్ లో మాయాజాలికుడు అని పిలుస్తుంటారు. ఆ పదానికి తగ్గట్టుగానే ఇతడు ఆడుతుంటాడు. అభిమానులను సమ్మోహితులను చేస్తుంటాడు.