Cricket In Olympics: క్రికెట్ అంటే ఇండియా లో ఒక మతం గా భావిస్తాం నిజానికి ఇండియన్స్ కి బాగా దగ్గరైన అట కూడా క్రికెటే కావడం విశేషం.చిన్నపిల్లలు నలుగురు కలిస్తే చాలు క్రికెట్ ఆడుతుంటారు బ్యాట్ లేకపోయినా ఒక చెక్క ని బ్యాట్ లాగా చేసుకొని మరి క్రికెట్ అనేది ఆడుతూ ఉంటాం. అందుకే ఇండియా లో క్రికెట్ కి చాలా ఆదరణ ఉంటుంది. 140 కోట్ల మంది ఉన్న భారతదేశం లో దాదాపు 100 కోట్లకు పైన జనాలు క్రికెట్ అంటే ఇష్టపడుతుంటారు.ఇక ఇలాంటి క్రికెట్ ని ఇప్పుడు ఒలింపిక్స్ లో కూడా చేర్చడం జరిగింది.2028 లో లాస్ ఏంజిల్స్ లో జరిగే ఒలంపిక్స్ గేమ్స్ లో టి 20 ఫార్మాట్లో క్రికెట్ ని నిర్వహించబోతున్నట్టు గా అంతర్జాతీయ ఒలంపిక్స్ కమిట్ (ఐఓసి) నిర్ణయం తీసుకుంది…నిజానికి చాలా సంవత్సరాల నుంచి క్రికెట్ కి ఒలంపిక్స్ లో చోటు కల్పించండి అని చాలా మంది చాలా రకాలుగా ట్రై చేసిన కూడా అది కుదరలేదు కానీ ఇపుడు ప్రపంచం లోనే క్రికెట్ కి ఉన్న క్రేజ్ ని గమనించి ఇప్పుడు ఐఒసి దానిని ఒలంపిక్స్ లో చేర్చడం జరిగింది…
ముఖ్యం గా ఆసియా ఖండం లోని దేశాల్లో క్రికెట్ కి ఉన్న క్రేజ్ గురించి సెపరేట్ గా చెప్పాల్సిన పని లేదు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల దాక అందరు క్రికెట్ చూడటానికి, ఆడటానికి ఇష్టపడుతూ ఉంటారు.అసలు క్రికెట్ అంటే అదొక పిచ్చి ఆట అని మొదట్లో కొట్టి పారేసిన అమెరికా లాంటి దేశం కూడా ఇప్పుడు క్రికెట్ కి సంభందించిన పనులను వేగవంతం చేస్తుంది అందులో భాగంగానే వివిధ దేశాల నుంచి ఛాన్సులు లేకుండా ఉంటున్న చాలా మంది ప్లేయర్లను తమ టీం తరుపున తీసుకొని వాళ్ళ చేత చాలా లీగ్ మ్యాచ్ లను కండక్ట్ చేస్తూ ఆడిస్తుంది.అలాగే అమెరికా తొందర్లోనే క్రికెట్ లో వాళ్ళ సత్తా ఏంటో చూపించాలని ప్లేయర్లను తయారుచేసే పనిలో పడింది.ఇక దానికి సంభందించిన పనులు కూడా భారీ ఎత్తున జరుగుతున్నాయి.అయితే ఫుట్ బాల్, టెన్నిస్ లను ఎక్కువగా ఇష్టపడే ఫ్రాన్స్, సిజర్లాండ్, చీలి లాంటి ఐరోపా దేశాల్లో కూడా ఇప్పుడు క్రికెట్ అనేది ఒక సీరియస్ గేమ్ గా మారిపోయింది.ఎదో టైం పాస్ కోసం కాకుండా సీరియస్ గా మ్యాచులు ఆడుతూ క్వాలిఫయింగ్ టోర్నీల్లోనూ ఆయా దేశాలు వాళ్ళ సత్తా చాటుతూ ఆడుతున్నారు. దాంతో ప్రస్తుతం ప్రపంచం లోనే ఎక్కువ ఆదరణ పొందుతున్న అట గా క్రికెట్ రెండో స్థానం లో నిలిచింది.
అప్పట్లో ఒలంపిక్స్ లో క్రికెట్ ని ఆడించాలని చాలా ట్రై చేసిన కూడా కుదరలేదు కానీ 1900 సంవత్సరం లో ఒకే ఒక సారి లో ఒలంపిక్స్ లో క్రికెట్ అనేది ఆడటం జరిగింది.ఇక దాదాపు 128 సంవతసరాల తర్వాత ఇప్పుడు మళ్లీ క్రికెట్ అనేది ఒలంపిక్స్ లో ఆడబోతుంది.అయితే క్రికెట్ ని చిన్న చూపు చూసిన దేశాలే ఇప్పుడు క్రికెట్ ఆడటానికి ముందుకు వస్తున్నాయి.ఇక చాలా సంవత్సరాల నుంచి చాలా మంది పడిన కష్టానికి ఫలితం ఇప్పుడు దొరికింది.ఇక క్రికెట్ ని ఒలంపిక్స్ లో చేర్చితే క్రీడల విలువ చాలా బాగా పెరుగుతుందని నిర్వాహకులు నమ్మి ఇలా చేర్చడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.అయితే ఇంతకుముందే ఒలంపిక్స్ తర్వాత అంత పెద్ద ఈవెంట్ అయిన ఆసియా క్రీడల్లో క్రికెట్ ని చేర్చడం ద్వారా ఒలంపిక్స్ లోకి కూడా క్రికెట్ ని చేర్చడం చాలా ఈజీ అయింది.
ఇక ఒలంపిక్స్ లోకి క్రికెట్ ని చేర్చడం ద్వారా ఆ గేమ్స్ ని ప్రసారం చేయడం కోసం భారత ప్రసార హక్కుల నుంచి ఐఓసి 158 కోట్ల వరకు డబ్బులను పొందుతున్నట్టు గా తెలుస్తుంది.సుమారు 15 వేల కోట్లు కేవలం ప్రసార హక్కుల ద్వారానే ఐఓసీ పొందనున్నట్టు గా తెలుస్తుంది.దీన్ని బట్టి ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ కి ఉన్న క్రేజ్ ఏంటి అనేది కూడా అందరికి అర్థం అవుతుంది…ఇలా ఏ లెక్కన చూసిన ఒలంపిక్స్ లో క్రికెట్ ని చేర్చడం వల్ల ఐఒసి కి చాలా రకాలు గా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి…
అయితే ఒలంపిక్స్ లో క్రికెట్ ని 2028 లో అరంగేట్రం చేస్తే క్రికెట్ కి ఉన్న విలువ ఇంకా భారీ రేంజ్ లో పెరగడమే కాకుండా క్రికెట్ ని మన హక్కు గా భావిస్తూ దాన్నే ప్రాణం గా పెట్టుకొని ఆట ఆడుతున్న ఇండియన్ ప్లేయర్లకి కూడా చాలా అరుదైన గౌరవాలు దక్కుతాయి. అలాగే ప్రపంచం లో ఉన్న అన్ని దేశాలు క్రికెట్ పరం గా మన దేశాన్ని గౌరవించడం తో పాటు గా మన ఇండియానే అన్ని దేశాలకంటే టాప్ లో ఉంటుంది కాబట్టి మన దేశం అన్ని దేశాల దృష్టి లో తార స్థాయి లో ఉంటుంది.ఒకప్పుడు మన ఇండియా లో క్రికెట్ తప్ప ఏమి ఆడారు అదొక పిచ్చి ఆట అని హేళన చేసిన ప్రపంచ దేశాలు సైతం క్రికెట్ లో మన ఇండియా ని పొగడక తప్పదు…