https://oktelugu.com/

Pakistan Cricket Team : పాకిస్థాన్ టీమ్ లో కలకలం: షాదాబ్ ఖాన్ కి బాబర్ కి మధ్య గొడవ…షాదాబ్ పైన తప్పని వేటు…

.ఒక్క ఏషియా కప్ ఓడిపోయినందుకె వాళ్ళ మధ్య ఉన్న విభేదాలు బయటికి వస్తున్నాయి...దీనికి పాకిస్థాన్ బోర్డు ఏ విధం గా స్పందిస్తుందో చూడాలి...

Written By:
  • NARESH
  • , Updated On : September 19, 2023 / 04:40 PM IST

    Pak team

    Follow us on

    Pakistan Cricket Team : మొన్నటిదాకా మాదే వరల్డ్ లో నెంబర్ వన్ టీం అని గొప్ప గా చెప్పుకుంటూ తిరిగిన పాకిస్థాన్ క్రికెట్ టీం ఇప్పుడు చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నట్టు గా తెలుస్తుంది.మొన్న జరిగిన ఏషియా కప్ లో లీగ్ మ్యాచ్ ల్లో అదరగొట్టిన పాకిస్థాన్ సూపర్ 4  కి వచ్చేసరికి చతికిల పడిపోయింది.వరుసగా ఇండియా, శ్రీలంక జట్ల మీద ఓడిపోవడం తో ఏషియా కప్ నుంచి నిష్క్రమించింది.అయితే ఇప్పుడు తెలుస్తున్నసమాచారం ప్రకారం పాకిస్థాన్ క్రికెట్ టీం లో అంతర్గతం గా ప్లేయర్ల మధ్య గొడవలు జరుగుతున్నట్టు గా చాలా వార్తలు వస్తున్నాయి. రీసెంట్ గా శ్రీలంక మీద పాకిస్థాన్ ఓడిపోయిన తరువాత డ్రెస్సింగ్ రూమ్ లో షాహిన్షా ఆఫ్రిది కి పాకిస్థాన్ టీం కెప్టెన్ అయిన బాబర్ అజమ్ కి మధ్య గొడవలు జరిగినట్లు గా తెలుస్తుంది.ఇద్దరి మధ్య మ్యాచ్ విషయం లో చాలా వాగ్వివాదం జరిగినట్లు గా తెలుస్తుంది.అయితే టీం లో ఉన్న ప్లేయర్లు చాలా మంది కి బాబర్ అజమ్ కెప్టెన్సీ మీద అంత మంచి అభిప్రాయం లేదు అనేది కూడా ఇక్కడ స్పష్టం అవుతుంది…
    ఇప్పటికే పాకిస్థాన్ టీం లో ఉన్న ప్లేయర్లలో రెండు వర్గాలు ఉన్నట్టు గా తెలుస్తుంది.ఇక బాబర్ అజమ్ కెప్టెన్సీ మీద మహమ్మద్ రిజ్వాన్ కి కూడా అంతమంచి అభిప్రాయం లేదు అని కూడా తెలుస్తుంది…ఎందుకంటే అయన తీసుకునే నిర్ణయాలు అంత ఆశాజనకంగా ఉండక పోవడం తో టీం మెంబర్స్ ఆయన మాట సరిగ్గా వినడం లేదు అనేది కూడా తెలుస్తుంది. పాకిస్థాన్ టీం మెంబర్స్ పట్ల ఇప్పుడు అనే కాదు ఇంతకు ముందు కూడా చాలా సార్లు గొడవలు జరిగాయి.అయితే ఈ టీం వైస్ కెప్టెన్ అయిన షాదాబ్ ఖాన్ కూడా రీసెంట్ గా మాట్లాడుతూ మేము గ్రౌండ్ లో బాబర్ అజమ్ వైఖరి పట్ల అంత ఇష్టం గా ఉండలేము, అదే గ్రౌండ్ నుంచి బయటికి వచ్చాక మాత్రం చాలా బాగా కలిసి పోయి ఉంటాం అని చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసాడు. దాంతో పాకిస్థాన్ బోర్డు అయన మాటలని ఖండిస్తూ ఆయన మీద వేటు వేసే దిశా గా చూస్తుంది. ఎందుకంటే ఒక టీం కెప్టెన్ అయిన ప్లేయర్ మీద ఇలాంటి కామెంట్లు చేయడం కరక్ట్ కాదు అంటూ పాకిస్థాన్ బోర్డు షాదాబ్ ఖాన్ మీద ఫైర్ అవుతుంది…
    ఇక ఇంకో 10  రోజుల్లో వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుండగా పాకిస్థాన్ టీం లో ఇలాంటి గొడవలు జరగడం ఆ టీం కి చాలా మైనస్ అవ్వనుందని క్రికెట్ మేధావులు తెలియజేస్తున్నారు…ఒక్క ఏషియా కప్ ఓడిపోయినందుకె వాళ్ళ మధ్య ఉన్న విభేదాలు బయటికి వస్తున్నాయి…దీనికి పాకిస్థాన్ బోర్డు ఏ విధం గా స్పందిస్తుందో చూడాలి…