https://oktelugu.com/

Chiru Grand Party For PV Sindhu: పీవీ సింధుకు చిరంజీవి సర్ ప్రైజ్..

Chiru Grand Party For PV Sindhu: పీవీ సింధు (PV Sindhu).. రెండు సార్లు ఒలింపిక్స్ లో పతకాలు సాధించి దేశానికి ఎంతో పేరు తెచ్చుకున్న బ్యాడ్మింటన్ ప్లేయర్. ఈ సంచలన క్రీడాకారిణికి తాజాగా జన్మలో మరిచిపోలేని సత్కారం చేశాడు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi). మన తెలుగు బిడ్డకు గౌరవం ఇచ్చాడు. పీవీ సింధుకు మెగాస్టార్ చిరంజీవి తాజాగా ప్రత్యేకంగా ఒక పార్టీ ఏర్పాటు చేసి మరీ సత్కరించారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి పీవీ […]

Written By:
  • NARESH
  • , Updated On : August 28, 2021 / 08:19 PM IST
    Follow us on

    Chiru Grand Party For PV Sindhu: పీవీ సింధు (PV Sindhu).. రెండు సార్లు ఒలింపిక్స్ లో పతకాలు సాధించి దేశానికి ఎంతో పేరు తెచ్చుకున్న బ్యాడ్మింటన్ ప్లేయర్. ఈ సంచలన క్రీడాకారిణికి తాజాగా జన్మలో మరిచిపోలేని సత్కారం చేశాడు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi). మన తెలుగు బిడ్డకు గౌరవం ఇచ్చాడు.

    పీవీ సింధుకు మెగాస్టార్ చిరంజీవి తాజాగా ప్రత్యేకంగా ఒక పార్టీ ఏర్పాటు చేసి మరీ సత్కరించారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి పీవీ సింధును ముఖ్య అతిథిగా ఆహ్వానించి ప్రత్యేక వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు నాగార్జునతోపాటు సీనియర్ కథానాయికలు రాధిక, సుహాసిని సహా చిరంజీవి కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, పలువురు సినీ ప్రముఖులు హాజరై సింధును సన్మానించారు.

    ఈ సందర్భంగా తన సొంత బిడ్డ ఇంత పెద్ద స్థాయికి ఎదిగిందని.. ఒలింపిక్స్ లో మెడల్ సాధించినట్టు ఫీల్ అయ్యానని చిరంజీవి చెప్పుకొచ్చాడు. సింధు సాధించిన విజయాలను కొనియాడారు. సింధును చూసి దేశం మురిసిపోతుంటే తన బిడ్డే అనే భావన కలిగిందని ఆనందం వ్యక్తం చేశారు.

    ఇక చిరంజీవి కుటుంబం తనపై చూపించిన ప్రేమ, గౌరవాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటానని సింధు కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఒలింపిక్స్ లో తపకుండా బంగారు పతకం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.

    తాజాగా సింధును సన్మానించిన వీడియోను చిరంజీవి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది.