Satwik- Chirag: ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇండియన్ బ్యాడ్మింటన్ కుర్రాళ్ళు చిరాగ్,సాత్విక్ గురించి పెద్దగా చర్చ నడుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో ఎప్పుడూ ఇండియన్ బ్యాడ్మింటన్ హిస్టరీలో ఎవరో ఒకరు ఇద్దరు మాత్రమే ప్లేయర్ల పేర్లు వినిపిస్తాయి తప్ప ఎక్కువ మంది గురించి ప్రస్తావన ఎందుకు ఉండదు అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. అదే ఉదాహరణకు క్రికెట్ లాంటి ఫేవరెట్ స్పోర్ట్స్ గురించి తీసుకుంటే వరుసగా ఒక పదిమంది పేర్లు టకటక చెప్పొచ్చు. కానీ అదే పరిస్థితి ఇండియాలో మిగిలిన ఏ ఆటలకు లేకపోవడం దురదృష్టకరం.
చాలామందికి క్రికెట్ తప్ప మిగతా స్పోర్ట్స్ పేరు చెప్పండి అంటే గబుక్కున గుర్తు కూడా రావు. సచిన్ ,ధోని, విరాట్ వీళ్ళ గురించి తెలిసిన అన్ని డీటెయిల్స్ మిగిలిన ఏ క్రీడలకు చెందిన ఆటగాళ్ల గురించి తెలియవు. ఎన్నో మెడల్స్ తెచ్చి మన దేశ కీర్తిని అన్ని దిశలకు వ్యాప్తిస్తున్న ఎందరో క్రీడాకారుల పేరులు మనవాళ్లకు గుర్తు కూడా రావు. దీనికి కారణం మన వ్యవస్థ? లేక మన ఆలోచనా? అన్న విషయంపై కూడా ఎవరికి స్పష్టత లేదు.
ప్రకాష్ పదకొనే,పుల్లెల గోపీచంద్, సైనా నెహ్వాల్, పివి సింధు, కిదాంబి శ్రీకాంత్,సయ్యద్ మోదీ , పారుపల్లి కశ్యప్ , అపర్ణ పోపట్ , జ్వాలా గుత్తా,చిరాగ్,సాత్విక్… ఇలా భారం అంతా ఎవరో ఒకరిద్దరి భుజస్కాంతాలపైనే వేయాల్సిన దుస్థితికి భారత్ బ్యాడ్మింటన్ ఎందుకు వచ్చింది. క్రికెట్ లో చెప్పినట్టు ఈ క్రీడలో కూడా వరుసగా ఒకేసారి నలుగురైదుగురు పేర్లు చెప్పే ఆస్కారం ఎందుకు కలగడం లేదు? 2022 తర్వాత భారత్ కు బ్యాడ్మింటన్ లో తిరిగి మరొక విజయం ఎందుకు నమోదు కాలేదు.
ఎందుకు అంటే దీనికి కారణాలు ఎన్నో ఉన్నాయి. ఇండియా ఒక్క మ్యాచ్ పాకిస్తాన్ తో ఓడిపోతే రచ్చ చేసే మీడియా మిగిలిన క్రీడల విషయంలో స్పందించదు. ఆన్లైన్ వచ్చే వార్తలు 70 శాతం పైన క్రికెట్ గురించి మాత్రమే ఉంటాయి…. మిగిలిన అన్ని ఆటలకు పట్టుమని 30 శాతం కూడా ప్రాముఖ్యత కేటాయించారు. ప్రభుత్వం కూడా అదే పక్షపాత బుద్ధి చూపిస్తుంది. ఆడుకునే కిడ్స్ దగ్గర నుంచి ఆడే గ్రౌండ్ వరకు ..క్రికెట్ కి ఇచ్చే ప్రాముఖ్యత మిగిలిన ఏ ఆటకి ఇవ్వరు.
బ్యాడ్మింటన్ ఆడి రాణించాలి అనుకున్న వాళ్లు ప్రైవేట్ అకాడమీల వైపే చూస్తున్నారు తప్ప గవర్నమెంట్ కోవచ్చు ఎక్కడా కానరావడం లేదు. ఎవరో ఒకరు తమ కష్టం మీద మెడల్ తెచ్చుకొని క్లిక్ అయితే ఇక భారం మొత్తం వారి మీదే పడుతుంది. ఇక వాళ్ళు ఫామ్ లో ఉన్నంతకాలం ఇంకొక ప్లేయర్ గురించి ఊసే ఉండదు. ఇలా వన్ మ్యాన్ షో చేస్తూ పోవడం వల్లే ఈరోజు
బ్యాడ్మింటన్ లో మంచి ప్లేయర్స్ వేళ్ళ మీద లెక్కపెట్టే సంఖ్యలో ఉన్నారు. ఇది ఇలాగే కొనసాగితే కొంత కాలానికి ఇది కేవలం ఒక రిక్రియేషన్ క్రీడగా మిగిలిపోతుంది.
కేవలం ఎక్కడో ఒక దగ్గర టోర్నమెంట్ జరిగే సమయంలో మాత్రమే కాకుండా మిగిలిన అన్ని సమయాల్లో కూడా ప్రతి క్రీడపై మీడియా తమ ఫోకస్ను పెట్టాలి. ప్రభుత్వ అలసత్వం వల్ల జరుగుతున్న లోపాలను ఎత్తి చూపాలి. అందరి క్రీడాకారులకు సమానమైనటువంటి వసతులను ప్రభుత్వం కల్పించాలి. జనాలు కూడా టోర్నమెంట్ గెలిచినప్పుడు చప్పట్లు కొట్టడం కాదు మిగిలినవి ఓడినప్పుడు ఎందుకు అని ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలి.ఎప్పుడు జరుగుతుందో దేవుడికి కూడా అర్థం కాని ఈ మిరాకిల్స్ అన్ని జరిగినప్పుడు కానీ మన దేశంలో క్రీడారంగం అభివృద్ధి చెందదు.