Cheteshwar Pujara: ఆస్ట్రేలియా, ఇండియా క్రికెట్ మ్యాచ్ అంటేనే ఇరు జట్ల మధ్య ఆట యుద్ధంతోపాటు మాటల యుద్ధం కూడా జరుగుతుంది. ఈ సంస్కృతి ఎప్పటి నుంచో కొనసాగుతోంది. ఆటకు ముందే.. ప్రత్యర్థి ఆటగాళ్లపై కామెంట్ చేయడం ఆస్ట్రేలియా క్రికెటర్లకు బాగా అలవాటు. అయితే ఈసారి టీమిండియా మాజీ క్రికెటర్ ఈ కామెంట్స్ మొదలు పెట్టారు. కొన్ని రోజులుగా పేలవ ఫామ్‌తో ఉన్న కోహ్లీపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. అయితే గతంలో ఆస్ట్రేలియాపై అద్భుత ప్రదర్శన కనబర్చిన కోహ్లీని లై తీసుకోవద్దని చతేశ్వర్ పుజారా ఆస్ట్రేలియాను హెచ్చరించారు. రీసెంట్‌గా బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కోహ్లీ విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రెకటర్ డేవిడ్ వార్నర్ కూడా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఫామ్‌లో లేకున్నా కోహ్లీని తక్కువగా అంచనా వేయొద్దని సూచించాడు. తాజాగా పుజారా కూడా అదే హెచ్చరికా జారీ చేశాడు. ఆస్ట్రేలియా గడ్డ కోహ్లీకి కలిసి వస్తుందని తెలిపాడు. 2024 కోహ్లీకి కలిసి రాలేదు. అయినా ఆస్ట్రేలియా టూర్‌కు సెలక్టర్లు ఎంపిక చేశారు. ఈ సిరీస్ అతడి ఆఖరి సిరీస్ అవుతుందని భారత మాజీ క్రికెటర్, కెప్టెన్ గంగూలీ వ్యాఖాయ్యనించాడు. దీంతో పుజారా కోహ్లీ గురించి మాట్లాడుతూ అతనిపై చాలా అంచనాలు ఉన్నాయన్నాడు. అతను ఆడుతున్న మ్యాచ్‌ల సంఖ్య, అథ్టెట్ విరాట్, అతినిక మధ్య తగిన విరామం లభించదని పేర్కొన్నాడు. అందుకే కాస్త విఫలమయ్యాడని తెలిపాడు.
కోహ్లికి ఇష్టమైన మైదానం
ఇక ఆస్ట్రేలియాలో కోహ్లీ ఇప్పటి వరకు 13 టెస్టులు ఆడాడు. 54.08 సగటుతో 1,352 పరుగులు చేయడంతో ఆస్ట్రేలియా కోహ్లీకి ఇష్టమైనమెదానంగా నిరూపించబడింది. అయితే, అతను ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన 0–3 వైట్‌వాష్‌లో 15.50 సగటుతో బోర్డర్–గవాస్కర్ ట్రోఫీలోకి ప్రవేశించాడు. ఈ నేపథ్యంలో పుజారా ఈ సిరీస్‌లో కోహ్లీ బౌలర్లకు తిరిగి వ్వాలనుకుంటున్నాడని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా పిచ్‌లపై కోహ్లీకి పూర్తి అవగాహన ఉందని తెలిపాడు. అతని నుంచి అభిమానులు ఏం ఆశిస్తున్నారో కూడా తెలుసరి వెల్లడించాడు. మైదానంలో ఎక్కువ సమయం గడుపుతాడని తనకు నమ్మకం ఉందని తెలిపాడు. సెంచరీ చేస్తే కోహ్లీకి ఇది గొప్ప సిరీస్ అవుతుందని తెలిపాడు.
చివరిసారి ఇలా..
కోహ్లీ చివరిసారి 2018–19లో ఆస్ట్రేలియాలో పర్యటించారు. భారత జట్టుకు సిరీస్ అందించడంలో కీలకంగా వ్యవహరించాడు. అప్పుడు కెప్టెన్ ఉన్న కోహ్లీ సారథ్యంలో పుజారా సభ్యుడు. నాటి సీరీస్‌లో పుజారా 500కన్నా ఎ క్కువ పరుగులు చేసి మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు. ప్రతీ మ్యాచ్‌లో కోహ్లీ ప్రేరణ పొందాడు. కచ్చితంగా, అతను దానిపై పనిచేశాడు.