https://oktelugu.com/

Rahul Gandhi : అదానీ పై విమర్శలు చేస్తూ.. రాహుల్ సంచలనం.. డిఫెన్స్ లో కాంగ్రెస్ నాయకులు..

అదానీ గ్రూప్ వ్యవహారం అంతకంతకు దేశ రాజకీయాలలో నిప్పు రాజేస్తున్నది. మొన్న న్యూయార్క్ అధికారులు వారెంట్ జారీ చేయగానే.. నిన్న కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ హడావిడిగా ఢిల్లీలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. అదానీ తో అంట కాగిన వారందరికీ శిక్ష పడాలని డిమాండ్ చేశారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 22, 2024 / 11:03 AM IST

    Rahul Gandhi

    Follow us on

    Rahul Gandhi :  అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వాలలో.. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ.. అది కాంగ్రెస్ లేదా బిజెపి లేదా ఇతర పార్టీ అయినా కచ్చితంగా విచారణ జరగాలని” రాహుల్ గాంధీ చేసిన ఆ వ్యాఖ్యలతో కొన్ని పార్టీలు పండగ చేసుకుంటున్నాయి. సామాజిక మాధ్యమాలలో పదేపదే ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యంగా రాహుల్ గాంధీ ఢిల్లీలో చేసిన ఆ వ్యాఖ్యలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఉద్దేశించి చేసినవని, రేవంత్ రెడ్డికి, అదానీ సన్నిహిత సంబంధం ఉందని భారత రాష్ట్ర సమితి నాయకులు ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. రాహుల్ గాంధీ ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ప్రారంభించారు. సోషల్ మీడియా అనేది ఎలా ఉంటుందో తెలుసు కదా.. రేవంత్ రెడ్డి అదానీ తో గట్టి సంబంధాలు ఏర్పరచుకున్నారని.. స్కిల్ యూనివర్సిటీ కోసం తీసుకున్న 100 కోట్ల విరాళం ఆ బాపతేనని భారత రాష్ట్ర సమితి ప్రచారం చేయడం మొదలుపెట్టింది. వాస్తవానికి రాహుల్ గాంధీ అవినీతి ఆరోపణల విషయంలోనే మాట్లాడారు. కానీ కొన్ని పార్టీలు ఒకడుగు ముందుకేసి ఇష్టానుసారంగా ప్రచారం చేయడం మొదలుపెట్టాయి. అదా నీ వ్యవహారాన్ని తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం ప్రారంభించాయి. వాస్తవానికి రాహుల్ గాంధీ ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు కాస్త ఆలోచించుకోవాల్సి ఉండేది. ఆదానీపై ఆరోపణలు వెలుగులోకి వచ్చింది అమెరికాలో. కేసు నమోదయింది అమెరికాలో. అలాంటప్పుడు విచారణ కూడా అమెరికాలోని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చూసుకుంటుంది. ఆ మాత్రం అంచనా లేకుండా రాహుల్ గాంధీ విమర్శలు చేయడం.. వాటిని కొన్ని పార్టీలు కావాలని ప్రచారం చేయడం నిజంగా భావదారిద్ర్యం.

    నాడు అధికారంలో ఉన్నది ఎవరు

    అదానీ విద్యుత్ కొనుగోళ్ల విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్రాలలో చత్తీస్గడ్, ఒడిస్సా, కాశ్మీర్, తమిళనాడు ఉన్నాయి. వీటిలో చతిస్గడ్ రాష్ట్రంలో నాడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. తమిళనాడులో తన ఇండియా కూటమిలో ప్రముఖంగా ఉన్న డీఎంకే ఉంది. అలాంటప్పుడు రాహుల్ చేసిన విమర్శలు తనకే ఎదురు తిరిగాయి. ఇదే విషయాన్ని బిజెపి పదే పదే ప్రస్తావిస్తోంది..”ఆయన విమర్శలు చేస్తారు. ఆ విమర్శల్లో కనీసం ఒక్క శాతం కూడా నిజం ఉండదు. ఏదో పుస్తకం చూపిస్తారు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆయన పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ నిర్మాణం కోసం 100 కోట్లు ఆదాని విరాళం ఇచ్చారు. దీని వెనుక ఏం జరిగింది? దావోస్ లో 12,000 కోట్లకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు? అవి ఎందుకు చేశారు? అదాని అవినీతిపరుడని తెలియదా” అని బిజెపి నాయకులు రాహుల్ గాంధీని ఉద్దేశించి విమర్శిస్తున్నారు. మొత్తంగా ఒక సెక్షన్ మీడియా గౌతమ్ అదాని ఎపిసోడ్ ను పదేపదే నెగిటివ్ కోణంలో చూపిస్తుండగా.. కొన్ని పార్టీల నాయకులు లేనిపోనివి జరిగినట్టు.. రకరకాల ప్రచారాలు చేస్తున్నాయి.