Homeక్రీడలుCheteshwar Pujara: ఒకప్పుడు డిఫెన్స్ కు ద్రావిడ్.. ఇప్పుడు ఈయన.. కానీ గేర్ మార్చి వరుస...

Cheteshwar Pujara: ఒకప్పుడు డిఫెన్స్ కు ద్రావిడ్.. ఇప్పుడు ఈయన.. కానీ గేర్ మార్చి వరుస సెంచరీలతో దూసుకుపోతున్న ఇండియన్ క్రికెటర్

Cheteshwar Pujara: ఇండియన్ క్రికెట్ లో ది వాల్ అనే పేరు రాహుల్ ద్రావిడ్ కు ఉంది. ద్రావిడ్ నిలబడ్డాడంటే ఇక గోడకు బంతులు వేసినట్టే. అతడి వికెట్ టెస్టుల్లో తీయడం బౌలర్లకు తలకుమించిన భారమయ్యేది. ద్రావిడ్ తర్వాత ఇండియన్ క్రికెట్ లో నయా వాల్ గా ‘చెతశ్వర్ పూజారా’ పేరు తెచ్చుకున్నాడు. 150 కి.మీలపైగా వేగంతో బంతులేసినా దాన్ని మరో స్టెప్ లేకుండా డిఫెన్స్ చేసే ఘనత మన పూజారా సొంతం. అతడి ఓపిక, సహనానికి బౌలర్లు, కామెంటర్లు కూడా విసిగి వేసారిన పోయిన సందర్భాలున్నాయి.

పూజారా సహనశీలి టెస్టుల్లో ఆడుతున్నాడంటే సగం బాల్స్ కంటే ఎక్కువనే తినేస్తాడు. బోరింగ్ ఆట అని చాలా మంది తిట్టిపోస్తుంటారు. కానీ ఆ బోరింగ్ మ్యాన్ ఇప్పుడు ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ లో బెబ్బులిలా మారాడు. ఏమా ఆట అంటూ అందరూ కీర్తిస్తున్నారు. పూజారా తన సహజమైన స్లో గేమ్ కు స్వస్తి పలికి.. గేర్ మార్చి, రయ్యిన దూసుకెళ్తున్నాడు. ఇప్పుడు గేర్ మార్చి వరుస సెంచరీలతో దుమ్ము దులిపేస్తున్నాడు.

పూజారా ఆటచూసి అందరూ షాక్ అవుతున్న పరిస్థితి. ఎప్పుడూ డిఫెన్స్ ఆడే పూజారా ముందుకొచ్చి మరీ బౌలర్లను ఉతికి ఆరేస్తుంటే ఇది పూజారానేనా? అని అందరూ డౌట్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి.

భారత టెస్ట్ స్పెషలిస్ట్ క్రికెటర్ చెతేశ్వర్ పుజారా మంగళవారం ఇంగ్లండ్ లో జరిగిన రాయల్ లండన్ వన్డే కప్‌లో వరుసగా మూడో సెంచరీని బాదాడు. ససెక్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న పుజారా 90 బంతుల్లో 132 పరుగులు చేయడం విశేషం. దీంతో అతని జట్టు మిడిల్‌సెక్స్‌పై 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 400 పరుగులు చేసింది. అతని అటాకింగ్ గేమ్ లో ఏకంగా 20 ఫోర్లు మరియు రెండు సిక్సర్లు ఉండడం గమనార్హం. అంటే మన పూజారా స్లో బ్యాటింగ్ ను పక్కనపెట్టి ఎంతలా విరుచుకుపడి తన టీంకు భారీ స్కోరు అందించాడో అర్థం చేసుకోవచ్చు. ఓపెనర్ టామ్ అల్సోప్ 155 బంతుల్లో 189 పరుగులతో ఇన్నింగ్స్‌లో టాప్ స్కోర్ చేశాడు.

అంతకుముందు.. వార్విక్‌షైర్‌పై పుజారా 79 బంతుల్లో 107 పరుగులు చేశాడు. ఆ తర్వాత అతను సర్రేతో జరిగిన మ్యాచ్‌లో తన కెరీర్‌లో అత్యుత్తమ స్కోరు 174ను సాధించాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో పూజారా దంచికొట్టుడు చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ వెటరన్ క్రికెటర్ ను భారత వన్డే జట్టులోకి తీసుకోవాలన్న డిమాండ్ క్రికెట్ ప్రేక్షకుల నుంచి వినిపిస్తుంది. అనలిస్టులు ఇదే కోరుతున్నారు. పుజారా గత నెలలో ఇంగ్లండ్‌తో తిరిగి షెడ్యూల్ చేయబడిన ఐదో టెస్టు కోసం భారత జట్టులోకి తిరిగి వచ్చాడు.ఆ టెస్టులో పెద్దగా రాణించలేకపోయాడు. కానీ ఇప్పుడు కౌంటీ క్రికెట్ లో మాత్రం విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు.

https://twitter.com/on_drive23/status/1562063373340409857?s=20&t=0tfnJV1v9vzotGnX5wrPoA

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular