Husband And Wife Relationship: భార్యాభర్తల మధ్య సంబంధం ఎంతో విలువైనది. ఎన్నో బంధాలతో ముడిపడి ఉంటుంది. ఆలుమగల మధ్య అపార్థాలు, అబద్ధాలకు తావు ఉండదని చెబుతుంటారు. అందుకే భార్యాభర్తల బంధానికి మనదేశం పెట్టింది పేరు. అందుకే మన వివాహ వ్యవస్థపై పాశ్చాత్యులు సైతం ఆసక్తి చూపుతుంటారు. మన పెళ్లి బంధంపై ఎంతో ఉత్సాహం వ్యక్తం చేస్తారు. జీవితాంతం ఒకే వ్యక్తితో కలిసి జీవించడం అంటే మాటలు కాదు. దీంతోనే విదేశీయులు సైతం హిందూ ధర్మం ప్రకారం జరిగే పెళ్లిళ్లంటే ఎంతో ఉత్సుకత వ్యక్తం చేస్తున్నారు. మన వివాహానికి అంతటి ప్రాధాన్యం ఉన్న సంగతి తెలిసిందే.

భార్యాభర్తల మధ్య ఎలాంటి అనుమానాలు, అపార్థాలు, అబద్ధాలు ఉండకూడదని చెబుతారు. ఆలుమగల మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. భార్య భర్త ఎదుట అన్ని విషయాలు చెప్పినా విషాదానికి సంబంధించిన విషయాలు మాత్రం దాచి పెడుతుంది. భర్తకు ఎలాంటి బాధ కలగడానికి ఒప్పుకోని సతి విషాదంతో కూడిన విషయాలేవి భర్తతో చర్చించదు. అన్ని విషయాలు భర్తకు చెప్పి ఇబ్బందులు పెట్టలేక విషాదానికి ఎప్పుడు దూరంగా ఉండాలని కోరుకుంటుంది. అందుకే భర్తకు చెప్పేందుకు మొగ్గు చూపదు.
Also Read: Harihara Veeramallu: ‘హరిహర వీరమల్లు’ ఆగిపోయినట్టే? నిర్మాతను నిండా ముంచింది ఆ దర్శకుడేనా?
భార్య తనకున్న అనారోగ్యం గురించి కూడా భర్తకు చెప్పదు. అనవసరంగా కంగారు పెట్టడం ఎందుకులే అనే ఉద్దేశంతో ఎంత నొప్పి అయినా భరిస్తుంది. తన పని తాను చేసుకుంటూ పోతుంది. పరిస్థితి చేయి దాటితే తప్ప భర్తతో తన జబ్బు గురింి చర్చించదు. ఎంతటి ఉపద్రవమైనా భరిస్తూ ఏవో మాత్రలు వేసుకుంటూ నెట్టుకొస్తుంది. ఇక తన వల్ల కాని పరిస్థితిలో మాత్రమే జీవిత భాగస్వామితో చెప్పి వైద్యం చేయించుకుంటుంది. దీంతో భార్య భర్తను బాధలకు గురిచేసే అంశాలపై చర్చించదని తెలుస్తోంది.

ప్రేమ చూపించడంలో కూడా భార్య తరువాతే ఎవరైనా. భార్య తన భర్తే సర్వస్వంగా భావిస్తుంది. తన ప్రేమ మొత్తం భర్తకే అంకితం చేస్తుంది. భర్త కూడా భార్య ప్రేమను అర్థం చేసుకోవాలి. ఆమె చెప్పినట్లు నడుచుకోవాలి. అంతేకాని చీటికి మాటికి అనవసర పట్టింపులకు పోయి భార్యను ఇబ్బందులకు గురి చేయవద్దు. ఏ విషయమైనా ఇద్దరు కలిసి చర్చించుకుని సావధానంగా నిర్ణయం తీసుకోవాలి.
భర్తకు తెలియకుండా భార్య కొంత ధనం దాస్తుంది. ఏదైనా అత్యవసర సమయాల్లో ఉపయోగపడుతుందని భావించి భర్త ఇచ్చే దానిలో కొంత మొత్తాన్ని పొదుపు చేస్తూ అత్యవసర సమయాల్లో బయటకు తీస్తుంది. కుటుంబాన్ని ఆదుకునే విధంగా ప్రతి మహిళ ఎంతో కొంత డబ్బును దాచి పెడుతూనే ఉంటుంది.
Also Read:Payal Rajput: 50 లక్షల కోసం పాయల్ రాజ్ పుత్ సంచలన నిర్ణయం.. ఆ సీన్స్ కి సై.. సంతోషంలో నిర్మాతలు