SS Rajamouli : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక పాన్ ఇండియాలో మన దర్శకులు కొత్త కథలతో సినిమాలను చేస్తూ భారీ విజయాలను సాధిస్తూ వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటున్నారు. ఇక ఇండియాలో ఉన్న ప్రతి హీరో తన ఎంటైర్ కెరీర్ లో ఒక్కసారైనా సరే రాజమౌళి(Rajamouli) తో సినిమా చేయాలని చూస్తుండటం విశేషం… మరి ఇప్పుడు ఆయన మహేష్ బాబు (Mahesh Babu) తో సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. మరి ఆయన చేస్తున్న ఈ సినిమా ఎలాంటి జానర్ లో తెరకెక్కుతుంది. ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధించబోతున్నాడు అనేది తెలియాల్సి ఉంది. నిజానికి రాజమౌళి తన ప్రతి సినిమా స్టార్ట్ చేసే ముందు ప్రెస్ మీట్ పెట్టి తన సినిమా స్టోరీని ప్రేక్షకులకు తెలియజేసి ఆ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకి వెళుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే డేట్లను సైతం ప్రకటిస్తూ ఉంటాడు. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం ఎలాంటి అనౌన్స్ మెంట్ లేకుండా చాలా గోప్యంగా సినిమా షూటింగ్ ను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. దీనివల్ల ఆయన ప్రతీది బిజినెస్ స్ట్రాటజీ లోనే ఆలోచిస్తూ అలా చేస్తున్నాడు అంటు కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఇప్పటివరకు రాజమౌళి చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది. మరి ఈ సినిమాలో సైతం అడ్వెంచర్ జానర్ లో తెరకెక్కుతుంది అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి.
Also Read : పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త..ఈసారి మిస్ అయ్యే ప్రసక్తే లేదు!
ఇక మూవీని చాలా ఎక్స్ట్రార్డినరీ విజువల్స్ తో తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు మొదటి షెడ్యూల్ ను కంప్లీట్ చేసి రెండో షెడ్యూల్ ని చేసుకుంటూ ముందుకు సాగుతున్న రాజమౌళి తొందర్లోనే మహేష్ బాబు కోసం ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని కూడా రెడీ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.
ఇందులో మహేష్ బాబు తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prudhvi Raj Sukumaran) కూడా పాల్గొనబోతున్నాడనే వార్తలైతే వస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ నే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇండస్ట్రీ మొత్తం షేక్ అవుతాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
మరి రాజమౌళి ఈ సినిమాని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తిరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కోసం దాదాపు 1200 కోట్ల బడ్జెట్ అవుతుందనే వార్తలైతే వస్తున్నాయి. చూడాలి మరి ఈ సినిమాతో మన వాళ్ళు ఎలాంటి మ్యాజిక్ ను చేస్తారు. తద్వారా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా వరల్డ్ వైడ్ గా తెలుగు సినిమా స్థాయి అనేది మారుమ్రోగుతుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…