spot_img
Homeక్రీడలుక్రికెట్‌Chennai Super Kings 2026 Final Squad: యువ చెన్నై.. ఐపీఎల్ లో తుది జట్టు...

Chennai Super Kings 2026 Final Squad: యువ చెన్నై.. ఐపీఎల్ లో తుది జట్టు ఫైనల్! ఎవరెవరు ఉన్నారంటే?

Chennai Super Kings 2026 Final Squad: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ముంబై తో సమానంగా ఎక్కువసార్లు ట్రోఫీలు అందుకున్న జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ కు పేరుంది. చెన్నై జట్టుకు నాయకుడిగా ధోని ఉన్న సమయంలో.. ఏకంగా ఐదు ట్రోఫీలు అందుకొని సరికొత్త చరిత్ర సృష్టించింది. చెన్నై జట్టులో నాడు అద్భుతమైన ప్లేయర్లు ఉండేవారు. జట్టు విజయాల కోసం తీవ్రంగా శ్రమించేవారు.

Also Read: విజయ్ అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ పవన్ కళ్యాణ్ మండిపాటు.. వీడియో వైరల్!

2024, 2025 సీజన్లలో చెన్నై జట్టు తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొంది. చెన్నై జట్టు సారధ్య బాధ్యతల నుంచి ధోని తప్పుకున్నాడు. రుతు రాజ్ గైక్వాడ్ కు చెన్నై జట్టు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. గత సీజన్లో అతడు అంతగా ఆకట్టుకోలేదు. పైగా గాయం బారిన పడిన నేపథ్యంలో.. ధోని తాత్కాలిక సారధిగా వ్యవహరించాడు.

20 24, 2025 సీజన్లలో ఎదురైన వైఫల్యాల నుంచి చెన్నై జట్టు విలువైన పాఠాలు నేర్చుకున్నట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో జట్టులో యువ రక్తాన్ని ఎక్కించింది. గత ఏడాది జరిగిన మినీ వేలంలో యంగ్ ప్లేయర్లను జట్టులోకి తీసుకుంది.. ఈ క్రమంలోనే 2026 ఐపిఎల్ సీజన్లో ఎక్కువగా యంగ్ ప్లేయర్లకు ఆ జట్టు యాజమాన్యం అవకాశాలు ఇస్తున్నట్టు కనిపిస్తోంది. ధోని, గైక్వాడ్, ఆయుష్ మాత్రే.. మినహా మిగతా వారంతా యంగ్ ప్లేయర్లు కావడం విశేషం. సంజు శాంసన్, బ్రేవిస్, కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్, శివం దుబే, నాదన్ ఇల్లిస్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, హెన్రీ వంటి ప్లేయర్లకు తుది జట్టులో చోటు కల్పించినట్టు తెలుస్తోంది.

భీకరమైన బ్యాటర్లు.. భయంకరమైన ఆల్ రౌండర్లు.. సత్తా చూపించే బౌలర్లు.. ఇలా మొత్తం అద్భుతమైన కలయికతో జట్టును రూపొందించిన తెలుస్తోంది.. గత ఏడాది జట్టు ఆటగాళ్ల ప్రదర్శన పట్ల ధోని అంతగా ఆసక్తి ప్రదర్శించలేదు. పైగా జట్టులో చాలా వరకు మార్పులు జరగాలని సూచించాడు. దానికి తగ్గట్టుగానే మేనేజ్మెంట్ మెగా వేలంలో అనేక రకాల మార్పులకు శ్రీకారం చుట్టింది. దీంతో యంగ్ ప్లేయర్లకు అవకాశం లభించింది. ఇప్పుడు చెన్నై జట్టులో యంగ్ ప్లేయర్లు స్థానం దక్కించుకున్న నేపథ్యంలో.. ఈసారి ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular