https://oktelugu.com/

Virat Kohli: కోహ్లీ ఇజ్జత్ తీసిన చెన్నై అభిమానులు.. ఇంతకీ ఏం జరిగిందంటే..

ఈ ఏడాది జనవరిలో టీమ్ ఇండియా ఇంగ్లాండ్ జట్టుతో తలపడింది. స్వదేశంలో జరిగిన ఈ సిరీస్ లో టీమ్ ఇండియా గెలిచింది. వ్యక్తిగత కారణాలవల్ల ఆ సిరీస్లో విరాట్ కోహ్లీ ఆడలేదు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 19, 2024 8:46 pm
    Virat Kohli

    Virat Kohli

    Follow us on

    Virat Kohli: అంతకుముందు విరాట్ కోహ్లీ టెస్ట్ సిరీస్ ఆడినప్పటికీ తన స్థాయికి తగ్గట్టుగా ఆడలేదు. ఇక సుదీర్ఘ విరామం తర్వాత విరాట్ కోహ్లీ స్వదేశంలో జరుగుతున్న బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ లో ఎంట్రీ ఇచ్చాడు. చాలా గ్యాప్ తర్వాత టెస్ట్ క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్ట్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు వచ్చిన విరాట్ కోహ్లీ ఆరు పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆరు బంతుల్లో ఆరు పరుగులు చేసి అత్యంత తీవ్రంగా నిరాశపరిచాడు. హసన్ మహమూద్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీ వేయగా.. దానిని విరాట్ అనవసరంగా కొట్టాడు. దీంతో ఆ బంతి వికెట్ కీపర్ లిటన్ దాస్ చేతిలో పడింది.

    బలహీనతను బయట పెట్టుకున్నాడు

    హసన్ మహమూద్ బౌలింగ్లో అవుట్ అయిన విరాట్ కోహ్లీ తన బలహీనతను మరోసారి ప్రదర్శించాడు. విరాట్ ఆరు పరుగులకే అవుట్ కావడంతో చెన్నై అభిమానులు సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. చెన్నై అభిమానుల తీరు పట్ల మండిపడుతున్నారు. ఐపీఎల్ 2024 సీజన్లో చెన్నై జట్టుతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో బెంగళూరు సంచలన విజయం సాధించింది. రన్ రేట్ పెంచుకొని ప్లే ఆఫ్స్ వెళ్ళిపోయింది. అప్పట్లో ఈ విజయాన్ని బెంగళూరు అభిమానులు భారీగా జరుపుకున్నారు. నాటి రోజుల్లో వారు చేసుకున్న సంబరాలు చెన్నై అభిమానులను కలతకు గురిచేసాయి. చివరికి అంబటి రాయుడు వంటి ఆటగాళ్లు కూడా బెంగళూరు అభిమానుల సంబరాలను తట్టుకోలేకపోయారు. బెంగళూరు జట్టు యాజమాన్యాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా ప్రశ్నించారు. ఐపీఎల్ 2024 ఫస్ట్ ఆఫ్ లో బెంగళూరు సరిగా ఆడలేదు. సెకండ్ హాఫ్ లో దూకుడుగా ఆడి ప్లే ఆప్స్ కు చేరుకుంది.

    కోహ్లీ పై ఆగ్రహం పెంచుకున్నారట

    దీంతో బెంగళూరు జట్టు, విరాట్ కోహ్లీపై చెన్నై జట్టు అభిమానులు కసి పెంచుకున్నారు. బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్ లో ఓడిపోయినప్పుడు వేడుకలు చేసుకున్నారు. చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ అవుట్ కావడంతో చెన్నై అభిమానులు బిగ్గర్ గా అరిచారు. సంబరాలు చేసుకున్నారు. అయితే ఇది వాస్తవం కాదని.. చెన్నై అభిమానులు విరాట్ కోహ్లీ అభిమానిస్తారని.. ఐపీఎల్ వరకే కోహ్లీ వ్యతిరేకించారని కొంతమంది నెటిజన్లు అంటున్నారు. కోహ్లీ అవుట్ కావడంతో చెన్నై అభిమానులు నిరాశకు గురయ్యారని.. రిషబ్ పంత్ మైదానంలోకి వస్తున్న సమయంలో గట్టిగా అరిచారని.. అంత తప్ప కోహ్లీని వారు వ్యతిరేకించలేదని నెటిజన్లు పేర్కొంటున్నారు.