Bigg Boss Telugu 8: ఈ సీజన్ లో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ లో రోజుకి ఒక యాంగిల్ ని చూపిస్తూ, కంటెస్టెంట్స్ తో పాటు, ప్రేక్షకులను కూడా తికమక పెడుతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది నాగ మణికంఠ మాత్రమే. హౌస్ లోకి అడుగుపెట్టేముందు ఇతను ఎవరో ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోయినా, ఇతని బ్యాక్ గ్రౌండ్ హిస్టరీ ని విని ఆడియన్స్ బాగా కనెక్ట్ అయిపోయారు. అయితే మొదటి వారం ప్రేక్షకుల్లో ఇతని మీద ఉన్న సానుభూతి ఇప్పుడైతే లేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. రోజురోజుకి ఇతని ప్రవర్తన తీరు ఆయన మీద ఉన్న సానుభూతి యాంగిల్ ని ఆడియన్స్ లో తగ్గించేలా చేసింది. నా భార్య కావాలి అని అంటాడు, కానీ హౌస్ లో ప్రతీ అమ్మాయిని కౌగిలించుకుంటూ, ముద్దులు పెట్టుకుంటూ ఉంటాడు. చూసే ఆడియన్స్ మాత్రమే కాదు, హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి కూడా మణికంఠ ప్రవర్తన తీవ్రమైన చిరాకు కలిగిస్తుంది.
విష్ణు ప్రియా నిన్ననే ‘ఇతను కంటెంట్ కోసం హౌస్ లో ఉన్న అమ్మాయిలందరినీ మాటికొస్తే కౌగలించుకుంటున్నాడు..శ్రీ ప్రియా చూసుకో..బయటకి రాగానే విడాకుల పేపర్స్ ని సిద్ధం చేసుకో’ అని సరదాగా నవ్వుతూ అంటుంది. నేడు ఇదే తరహాలో మరో కంటెస్టెంట్ నైనికా కూడా మణికంఠ కి చాలా సున్నితంగా ఇచ్చి పారేసింది. ముందుగా మణికంఠ మాట్లాడుతూ ‘ప్రేమ అనేది ఒక పిచ్చి’ అని అంటాడు. దానికి నైనికా సమాధానం చెప్తూ ‘నువ్వు అందరితో ప్రేమలో ఉన్నావ్ ఇక్కడ’ అని అంటుంది నైనికా. అప్పుడు మణికంఠ దానికి సమాధానం చెప్తూ ‘అది ప్రేమ కాదు..ఎఫక్షన్’ అని అంటాడు. దానికి నైనికా ‘అదే అందరితో వద్దమ్మా..నీకు భార్య ఉన్నప్పుడు ఆమెతోనే ఉండాలి కదా’ అని అంటుంది. ఇంకా ఆమె మాట్లాడుతూ ‘పెళ్ళైన తర్వాత అసలు పులిహోర కలిపే కార్యక్రమాలే పెట్టుకోకూడదు’ అని అంటుంది నైనికా. అప్పుడు మణికంఠ ‘చాలా తప్పుగా మాట్లాడుతున్నారు నైనికా గారు’ అని అంటాడు. దానికి నైనికా ‘పర్లేదు..కానీ నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నా..నిజాలన్నీ ఇలాగే ఉంటాయి’ అని అంటుంది. అప్పుడు మణికంఠ మాట్లాడుతూ ‘ఛిల్ అయ్యేది ఇక్కడే కదా..మళ్ళీ ఇంటికి వెళ్తే మాములే’ అని డ్యాన్స్ వేస్తూ చెప్తాడు. అప్పుడు నైనికా ‘విన్నారా..శ్రీప్రియ గారు..చూసుకోండి ఇక మీరే’ అని అంటుంది నైనికా.
హౌస్ లో ఇప్పటికే ఇద్దరు అమ్మాయిలు ఇతనికి నేరుగా చెప్పేసారు, ప్రవర్తన మార్చుకోమని. అయినా కూడా మణికంఠ మారడం లేదంటే ఇతను హౌస్ లోకి గేమ్స్ ఆడేందుకు వచ్చాడా, అమ్మాయిలను కౌగలించుకోడానికి వచ్చాడా అని అనుకుంటున్నారు ప్రేక్షకులు. నైనికా నేడు సరదాగా మాట్లాడిన పాయింట్ ని మణికంఠ వచ్చే వారం నామినేషన్ పాయింట్ కి ఆమె మీదనే ఉపయోగించొచ్చు. ఎందుకంటే గతంలో కూడా విష్ణు ప్రియా, యష్మీ ని మణికంఠ ఇలాగే నామినేట్ చేసాడు. అప్పటి నుండి వాళ్లిద్దరూ అతనిని దూరం పెట్టేసారు, రేపు నైనికా కూడా ఇలాగే చేస్తుందా లేదా అనేది నామినేషన్స్ రోజు చూడాలి.
#Nainika correct ga cheppindi #BiggBossTelugu8 #Manikanta pic.twitter.com/hAdIVIp2vJ
— TeluguBigg (@TeluguBigg) September 19, 2024