Champions Trophy : ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది.. దానికి తగ్గట్టుగానే ఆట తీరు ప్రదర్శిస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ జట్టు పై ఆరు వికెట్ల తేడాతో గెలుపును సొంతం చేసుకుంది. ఆ తర్వాత రెండో మ్యాచ్లో దయాది పాకిస్తాన్ జట్టుపై అదే జోరు కొనసాగించింది. ఏకంగా ఆరు వికెట్ల తేడాతో అద్భుతమైన విక్టరీని తన ఖాతాలో వేసుకుంది. మొత్తంగా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సెమీస్ వెళ్లిపోయింది. రోజుల విరామం తర్వాత లీగ్ దశలో న్యూజిలాండ్ జట్టును ఢీకొంటుంది. గత ఏడాది స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్లో న్యూజిలాండ్ స్థితిలో భారత్ 0-3 తేడాతో ఓడిపోయింది. ఆ ఓటమికి బదులు తీర్చుకోవాలని టీమ్ ఇండియా భావిస్తోంది. అయితే చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా పరోక్షంగా ముగ్గురికి మాత్రం గట్టి స్ట్రోక్ ఇచ్చింది. వారు ఎవరెవరు అంటే..
నజ్ముల్ హొస్సేన్ షాంటో
ఛాంపియన్స్ ట్రోఫీ లో భారత్ తన ప్రారంభ మ్యాచ్ ను బంగ్లాదేశ్ జట్టుతో ఆడాల్సి ఉండేది. పాకిస్తాన్ లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో.. భారత్ దుబాయిలో తన తొలి మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. బంగ్లాదేశ్ -భారత్ దుబాయ్ వెళ్లిన తర్వాత.. మ్యాచ్ కు ఒక రోజుకు ముందు బంగ్లా, భారత్ కెప్టెన్లు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రోహిత్ మాట్లాడుతూ బంగ్లాదేశ్ జట్టు అయినంత మాత్రాన మేము తక్కువగా తీసుకోమని.. అన్ని జట్ల మాదిరిగానే.. బంగ్లాదేశ్ తో ఆడతామని అన్నాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షాంటో మాత్రం.. మేము ఏ జట్టునైనా ఓడిస్తామని.. భారత్ అంటే భయపడేది లేదని వ్యాఖ్యానించాడు. సీన్ కట్ చేస్తే బంగ్లాదేశ్ భారత చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది.
అఖిబ్ ఆయుబ్
పాకిస్తాన్ జట్టుకు తాత్కాలిక హెడ్ కోచ్ గా అఖిబ్ ఆయుబ్ కొనసాగుతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ప్రారంభ మ్యాచ్లో పాకిస్తాన్ న్యూజిలాండ్ చేతిలో 60 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆ తర్వాత తదుపరి మ్యాచ్ భారత్ తో ఆడింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో భారత్ ఆరు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ అందుకుంది. అంటే ఈ మ్యాచ్ కంటే ముందు పాకిస్తాన్ హెడ్ కోచ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.. భారత జట్టుకు సర్ప్రైజ్ ఇస్తామని.. కచ్చితంగా ఇది ఆ జట్టుకు జీవితాంతం గుర్తుకు ఉంటుందని వ్యాఖ్యానించాడు.. సీన్ కట్ చేస్తే పాకిస్తాన్ జట్టు దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్లో భారత్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది. ఈ ఓటమి ద్వారా ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి నిష్క్రమించింది.
Also Read : మావోళ్లకు చేతకాదు.. మీ ఆట సూపర్.. టీమిండియాకు జైకొడుతున్న పాకిస్తాన్ ఫ్యాన్స్..
బెన్ డకెట్
ఛాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు టీమిండియా – ఇంగ్లాండ్ జట్లు తలపడ్డాయి. భారత్ వేదికగా జరిగిన టి -20, వన్డే సిరీస్లలో ఇంగ్లాండ్ ఓడిపోయింది. ఈ ఓటమి తర్వాత ఇంగ్లాండ్ ఆటగాడు బెన్ డకెట్ విలేకరులతో మాట్లాడాడు. “మేము ఇండియా చేతిలో 3-0 తేడాతో సీడీస్ కోల్పోయాం. కానీ వారిని చాంపియన్స్ ట్రోఫీలో ఓడిస్తాం. ఆ గెలుపు తర్వాత 3-0 తేడాతో ఇండియా చేతిలో ఓడిన విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. మేము ఛాంపియన్స్ ట్రోఫీపైనే ప్రధానంగా దృష్టి సారించాం. కచ్చితంగా టీమిండియా కు షాక్ ఇస్తామని” డకెట్ వ్యాఖ్యానించాడు. కానీ ఇక్కడ కూడా సీన్ కట్ చేస్తే ఇంగ్లాండ్ జట్టు ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ జట్ల చేతుల్లో ఓడిపోయి ఛాంపియన్స్ ట్రోఫీ నుంచే నిష్క్రమించింది. మొత్తానికి ఇద్దరు కీలక ఆటగాళ్లకు..ఓ జట్టు కోచ్ ఛాంపియన్స్ ట్రోఫీ భలే గుణపాఠం చెప్పింది. టీమ్ ఇండియా మీద ఆవాకులు చవాకులు పేలితే ఎలా ఉంటుందో.. వారికి వాస్తవ రూపంలో తెలిసింది.
Also Read : ఇంగ్లాండ్ కు ఇదేం దరిద్రం.. అప్ఘాన్ చిత్తు చేసి పడేసింది