Champions Trophy
Champions Trophy : ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19న పాకిస్తాన్ వేదికగా ప్రారంభమైంది. ఆతిథ్య జట్టుతోపాటు మరో ఏడు జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. అయితే భారత జట్టు పాకిస్తాన్ వెళ్లేందుకు నిరాకరించింది. దీంతో భారత్(Bharath) మ్యాచ్‌లు అన్ని మూడో వేదిక అయిన దుబాయ్‌లో జరుగుతున్నాయి. ఇప్పటికే బంగ్లాదేశ్, పాకిస్తాన్‌తో టీమిండియా తలపడింది. రెండింటిలోనూ విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరింది. మరో రెండు లీగ్ మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఇక ఆతిథ్య పాకిస్తాన్ కూడా రెండు మ్యాచ్‌లు ఆడింది. రెండింటిలోనూ చిత్తుగా ఓడింది. న్యూజిలాండ్, భారత్ చేతులో ఓడిపోయింది. దీంతో పాక్ జట్లుపై ఆదేశ క్రికెట్ అభిమానులు(Pakisthan Cricket Fans) దుమ్మెత్తిపోస్తున్నారు. సీనియర్లు క్రికెటర్లు కూడా పాక్ ఆటగాళ్ల ఆటతీరుపై మండిపడుతున్నారు. దుబాయ్ వేదికగా భారత్–పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతుండగానే ఓ పాక్ అభిమాని టీమిండియాకు మద్దతు తెలిపాడు. టీమిండియా జర్సీ ధరించాడు. టీమిండియా క్రికెటర్ల ఆట చూపి పాక్ ఫ్యాన్స్ జర్సీలు మారుస్తున్నారు. ఈమేరకు వీడియోలు వైరల్ అవుతున్నాయి.
60 కోట్ల మంది వీక్షణ..
ఇదదిలా ఉంటే.. భారత్–పాక్ మ్యాచ్ అంటేనే హై ఓల్టేజీ ఉంటుంది. తాజాగా దుబాయ్(Dubai) వేదికగా జరిగిన భారత్, పాక్ మ్యాచ్‌ను ప్రపంచ వ్యాప్తంగా లైవ్ స్ట్రీమింగ్‌లోనే 60.2 కోట్ల మంది వీక్షించారు. విరాట్ కోహ్లీ సెంచరీతో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకుంటుండగా, పాక్ ఫ్యాన్స్ కూడా మా క్రికెటర్లు దండగ అన్నట్లుగా టీమిండియా(Team india) ఫ్యాన్స్‌గా మారిపోతున్నారు. టీమిండియా విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
Also Read : తిక్క పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇక మారదా? ఆటగాళ్లు ఆడకుంటే.. కోచ్ ఏం చేస్తాడ్రా బాబూ
టీమిండియాకు పాక్ అభిమానులు ఫిదా..
భారత క్రికెటర్ల ఆటకు పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు కూడా ఫిదా అవుతున్నారు. టీమిండియా గెలుస్తుందనే టైంలో పాక్ అభిమానులు జెర్సీని మార్చి(Change Jersy) భారత్‌కు మద్దతు తెలిపారు. అప్పటి వరకు పాకిస్తాన్ ధరించి ఉన్న జెర్సీని తీసి అవతల పడేశాడు. దీనిని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అది నెట్టింట్లో చెక్కర్లు కొడుతోంది.
Also Read : ఫిబ్రవరి 19 న మొదలై 23న ముగిసింది.. పాక్ చాంపియన్స్ ట్రోఫీ ప్రయాణం నాలుగు రోజులేనా
The Love for Kohli is Unmatchable! ❤️ pic.twitter.com/0Vgj51MnfS
— Virat Kohli Fan Club (@Trend_VKohli) February 23, 2025
Pakistan fan wears India’s jersey over Pakistan’s during CT match in Dubai #indvspak #indiancricketteam #viratkohli #latestnews pic.twitter.com/W6Xu20BWl0
— Sports Today (@SportsTodayofc) February 23, 2025