India Champions Trophy Squad : ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో తలపడే భారత జట్టు ప్రకటనపై కొనసాగుతున్న ఉత్కంఠ వీడింది. జనవరి 12వ తేదీ వరకే తుది జట్ల వివరాలు ఇవ్వాలని ఐసీసీ సూచించింది. కానీ బీసీసీఐ వారం రోజులు ప్రత్యేక అనుమతి కోరింది. దీంతో తుది జట్టు ఎంపికపై ఆసక్తి నెలకొంది. ఆస్ట్రేలియా(Australia)లో ఘోర వైఫల్యం తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే టీమిండియా తుది జట్టులో ఎవరికి అవకాశం దక్కుతుందని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఫామ్‌లో ఉన్న పలువురు యువ క్రికెటర్ల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే యువ ఆటగాళ్లకు తుది జట్టులో అవకాశం దక్కలేదు. అనుభవానికే సెలక్టర్లు ప్రాధాన్యం ఇచ్చారు. చీఫ్ సెలక్టర్ అజిత్ ఆగార్కర్ ఆధ్వర్యంలో సమావేశమైన సెలక్షన్ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఈ టోర్నీలో పాల్గొనే ఆరు దేశాల జట్లను ఇప్పటికే ప్రకటించారు. శనివారం(జనవరి 18న) టీమిండియా తుది జట్టును ప్రకటించారు. ఇందులో రోహిత్‌ను కెప్టెన్ గా కొనసాగించారు. చీఫ్ సెలక్టర్(Chief Selector) అజిత్ అగార్కర్ టీమ్‌ను ప్రకటించారు.
సమావేశానికి రోహిత్ శర్మ
టీమిండియా జట్టు ఎంపిక కోసం సెలక్షన్ కమిటీ ప్రారంభమైంది. బీసీసీఐ కొత్త సెక్రెటరీ దేవ్‌జిత్ సైకియా, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్‌శర్మ సమావేశానికి హాజయ్యారు. ఎంపిక ప్రక్రియను ప్రారంభించారు. చీఫ్ సెలక్టర్ అగార్కర్, రోహిత్ తుది జట్టును ప్రకటించారు.
టీ20 ప్లేయర్లకు దక్కని ఛాన్స్..
ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో టీ20 ప్లేయర్స్‌ను సెలక్షన్ కమిటీ పరిగణనలోకి తీసుకోలేదు. సంజుశాంసన్,నితీశ్‌కుమార్‌రెడ్డి, ఇషాన్ కిషన్ తదితరులు టీ20ల్లో అద్భుతంగా ఆడుతున్నారు. కానీ, వారిని సెలక్టర్లు పక్కన పెట్టారు. ఇక దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించిన కరుణ్‌నాయర్, మయాంక్ అగర్వాల్‌ను కూడా లెక్కలోకి తీసుకోలేదు. పాత చింతకాయ పచ్చడిలా మళ్లీ పాత ఆటగాళ్లకే పెద్దపీట వేశారు. సంజూశాంసన్, ఇషాన్ కిషన్‌లలో ఒకరికైనా ఛాన్స్ దక్కుతుందని అభిమానులు ఆశించారు. కానీ, కేఎల్ రాహుల్ నే కొనసాగించడంతో వారందరికీ నిరాశే మిగిలింది.
తుది జట్టు ఇదే..
రోహిత్‌శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, హార్ధిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్‌టన్ సుందర్, కల్‌దీప్, సజ్‌ప్రిత్ బుమ్రా, అర్ష్‌దీప్‌సింగ్, మహ్మద్ షమీ, యశశ్వి జైశ్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా.